MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Ganja Farming : వీడెవడండీ బాబు.. గంజాయిని చట్నీ చేసి తినడమేంటి, పాలలో కలిపి తాగడమేంటి..!

Ganja Farming : వీడెవడండీ బాబు.. గంజాయిని చట్నీ చేసి తినడమేంటి, పాలలో కలిపి తాగడమేంటి..!

Ganja Farming : అపార్ట్ మెంట్ ప్లాట్ లో గంజాయి పెంచడమే విచిత్రం. దాన్ని పాలల్లో కలుపుకుని తాగడం, చట్నీ చేసుకుని తినడం మరింత విచిత్రం. ఇలాంటి వింత ఘటన తాజాగా వెలుగుచూసింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 02 2026, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇదెక్కడి విడ్డూరం... అపార్ట్ మెంట్ గంజాయి సాగా..!
Image Credit : Gemini AI

ఇదెక్కడి విడ్డూరం... అపార్ట్ మెంట్ గంజాయి సాగా..!

Ganja Farming: సాధారణంగా పొలాల మధ్యలో గుట్టుగా గంజాయి పెంచుతుంటారు. కొందరు ఇంటి పరిసరాల్లోనూ పెంచుతుంటారు. కానీ ఇంట్లోనే గంజాయిని పెంచడం గురించి ఎప్పుడైనా విన్నారా...? ఇలాంటి వింత ఘటన కేరళలో వెలుగుచూసింది.

హర్యానాకు చెందిన విశాల్ కేరళలోని తిరువనంతపురంలో నివాసం ఉంటున్నారు. ఇతడు సాప్ట్ వేర్ ఇంజనీర్... టెక్నోపార్క్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని నెలజీతం సుమారు రూ. 1.5 లక్షలు. మంచి ఉద్యోగం, మంచి శాలరీతో హాయిగా సాగుతున్న ఇతడి జీవితంలోకి గంజాయి ఎంటరయ్యింది. దీనికి అలవాటుపడ్డ విశాల్ ఇంట్లోని గంజాయిని సాగు చేసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సేంద్రియంగా గంజాయి సాగు
Image Credit : twitter

సేంద్రియంగా గంజాయి సాగు

విశాల్ తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. గంజాయికి అలవాటుపడ్డ అతడు తన ప్లాట్ లోనే గంజాయి సాగు ప్రారంభించాడు. ఆధునిక పద్దతిలో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. అయితే ఈ గంజాయి మొక్కలకు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులనే వాడుతున్నాడు. ఇలా జనావాసాల మధ్యలో గంజాయిని నేచురల్ గా పండిస్తూ అందరినీ ఆశ్చర్యపర్చాడు విశాల్.

Related Articles

Related image1
Hyderabad : వీడెవడండీ బాబు..! హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నాడు
Related image2
Ganja Seized in Hyderabad : హైదరాబాద్‌లో 1,240 కిలోల గంజాయి పట్టివేత..సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా
34
అపార్ట్ మెంట్ ప్లాట్ లో గంజాయి సాగు
Image Credit : Getty

అపార్ట్ మెంట్ ప్లాట్ లో గంజాయి సాగు

అయితే ఎలా అనుమానం వచ్చిందో గానీ అపార్ట్మెంట్ వాసులు విశాల్ గంజాయి సాగు గురించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఫ్లాట్‌లో తనిఖీ చేయగా 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగిన సుమారు 70 గంజాయి మొక్కలు లభించాయి. పగలంతా ప్రొఫెషనల్ ఐటీ మేనేజర్‌గా పనిచేసే విశాల్, రాత్రిళ్లు ఫ్లాట్‌కు వచ్చి ఈ గంజాయి తోటను చూసుకునేవాడని తెలిసింది. మార్కెట్లో కొన్న ప్రత్యేక కుండీలు, గుడ్లు పెట్టే ట్రేలు, చిన్న చిన్న పాత్రలలో ఇతను గంజాయి మొక్కలను పెంచుతున్నాడు.

'ఆపరేషన్ తూఫాన్'లో భాగంగా కేరళ పోలీసులు మాధక ద్రవ్యాల స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగానే విశాల్ ఫ్లాట్‌లో తనిఖీ చేసిన పోలీసులు అక్కడి దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. అయితే ఈ గంజాయిని సొంతంగా వాడుకోడానికి మాత్రమే అతడు ఉపయోగిస్తున్నాడట... స్మగ్లింగ్ కోసం కాదట. ఇంట్లో గంజాయిని సాగుచేస్తున్న ఈ టెకీని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొన్ని సంచలన విషయాలు బైటపడ్డాయి.

44
గంజాయితో చట్నీ..
Image Credit : Instagram

గంజాయితో చట్నీ..

గంజాయి ఆకులను చట్నీ చేసుకోవడానికి, పాలలో కలుపుకుని తాగడానికే పెంచుతున్నానని విశాల్ పోలీసులకు చెప్పడం గమనార్హం. ప్రాథమిక విచారణ ప్రకారం... గంజాయి అమ్మి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం విశాల్‌కు లేదని తెలుస్తోంది. పూర్తిగా సొంత అవసరాల కోసమే అతను ఈ గంజాయి తోటను పెంచాడు. 

గంజాయి ఆకులను పేస్ట్ చేసి పాలలో కలుపుకుని తాగడం ఇతనికి ఎప్పట్నుంచో అలవాటట. అంతేకాకుండా గంజాయి ఆకులతో చట్నీ (పచ్చడి) చేసుకుని కూడా రోజూ తినేవాడని పోలీసులు తెలిపారు. ఇంత మంచి జీతంతో ఐటీ ప్రొఫెషనల్‌గా ఉన్న వ్యక్తి, ఇంట్లోనే ఇంత పెద్ద ఎత్తున గంజాయి పెంచడం పోలీసులతో పాటు స్థానికులను కూడా ఆశ్చర్యపరిచింది. నిందితుడిపై మరింత విచారణ జరుపుతున్నామని శ్రీకార్యం పోలీసులు తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
అమ్మాయిలు అర్థరాత్రి ఏం ఆర్డ‌ర్ పెడుతున్నారో తెలుసా? ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన జెప్టో డెలివ‌రీ బాయ్
Recommended image2
Now Playing
CM Vijay Grand Entry : అభిమానుల రచ్చ చూడండి | Asianet News Telugu
Recommended image3
Amarnath Yatra 2026: లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే.. హైదరాబాద్ టు అమర్‌నాథ్ యాత్ర ఫుల్ ట్రైన్ ప్లాన్ ఇదిగో !
Related Stories
Recommended image1
Hyderabad : వీడెవడండీ బాబు..! హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నాడు
Recommended image2
Ganja Seized in Hyderabad : హైదరాబాద్‌లో 1,240 కిలోల గంజాయి పట్టివేత..సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved