MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • హెల్మెట్ లేదా? అయితే పెట్రోల్ బంద్.. ఈ రూల్ ఎక్కడంటే?

హెల్మెట్ లేదా? అయితే పెట్రోల్ బంద్.. ఈ రూల్ ఎక్కడంటే?

No Helmet No Fuel: రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి 30 వరకు ఉత్తరప్రదేశ్‌లో ‘నో హెల్మెట్ నో ఫ్యూయల్' అనే ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 

2 Min read
Author : Rajesh K
Published : Aug 28 2025, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హెల్మెట్ పెట్టుకుంటేనే పెట్రోల్
Image Credit : Getty

హెల్మెట్ పెట్టుకుంటేనే పెట్రోల్

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా లక్షాలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను నివారించాలంటే.. రోడ్డుపై వెళ్లేటప్పుడు కనీస భద్రత నియామాలు పాటించాలి. ప్రధానంగా బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపడం చాలా సేఫ్టీ. కానీ, చాలామంది ప్రజలు హెల్మెట్ పెట్టుకోవడం లైట్ తీసుకొని జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. అలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టాలని ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటీ? ఆ నిర్ణయమేంటీ ?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 నో హెల్మెట్ నో ఫ్యూయల్
Image Credit : Getty

నో హెల్మెట్ నో ఫ్యూయల్

రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో హెల్మెట్‌కి, పెట్రోల్‌కి లింక్ పెట్టేశారు. పెట్రోల్ లేకపోతే బండి నడవదు కాబట్టి హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయొద్దు అనే రూల్ పెట్టేసింది. ఈ ఆలోచన కొత్తగా ఉన్నా చాలా లాజిక్‌గా కూడా ఉంది. దీంతో ఈ విషయం క్షణాల్లో వైరల్ మారింది. నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏ ఈ నిర్ణయం ఎక్కడ అని ఆలోచిస్తున్నారా?

Related Articles

Related image1
Top Fuel Efficient Petrol Cars: ప్రస్తుత మార్కెట్ లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే!
Related image2
Fuel Saving Tips: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చు ఆదా..
35
యూపీ సర్కార్ కీలక నిర్ణయం
Image Credit : Getty

యూపీ సర్కార్ కీలక నిర్ణయం

రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి సర్కార్ ఈ విన్నూత నిర్ణయం తీసుకుంది. హెల్మెట్ పెట్టుకోని వారికి పెట్రోల్ పోయవద్దని పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చేసింది. దీంతో హెల్మెట్ లేకుండా వచ్చి పెట్రోల్ అడిగిన వాహనదారులకు ఇకపై నో చెప్పాలని పెట్రోల్ బంకులకు ఆర్డర్స్ జారీ చేసింది. ఈ రూల్స్ ను సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి తీసుకరాబోతుంది. 

ఈ తరుణంలో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు 'హెల్మెట్ లేదు, ఇంధనం లేదు' అనే ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించబోతోంది. జిల్లా మేజిస్ట్రేట్ నాయకత్వంలో, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ (DRSC) సమన్వయంతో ఈ ప్రచారం నిర్వహించబడుతుంది. ఈ ప్రచారంలో పోలీసులు, రెవెన్యూ/జిల్లా పరిపాలన, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

45
మోటారు వాహన చట్టం – హెల్మెట్ తప్పనిసరి
Image Credit : facebook

మోటారు వాహన చట్టం – హెల్మెట్ తప్పనిసరి

మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 129 ప్రకారం ద్విచక్ర వాహనదారుడు, పిలియన్ రైడర్ ఇద్దరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అదే సమయంలో సెక్షన్ 194D కింద ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి జరిమానా విధించవచ్చు. అలాగే..

సుప్రీంకోర్టు సూచనలను అనుసరిస్తూ యోగి ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ‘హెల్మెట్ లేకపోతే.. ఇంధనం లేదు’ ప్రచారాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా IOCL, BPCL, HPCL వంటి అన్ని పెట్రోల్ పంప్ ఆపరేటర్లను హెల్మెట్ ధరిస్తున్న వ్యక్తులకు మాత్రమే ప్యూయల్ పోయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రూల్ వల్ల ఇంధన అమ్మకాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని రవాణా కమిషనర్ స్పష్టం చేశారు.

55
శిక్ష కాదు.. హెల్మెట్ సాంప్రదాయం: సిఎం యోగి
Image Credit : ChatGPT

శిక్ష కాదు.. హెల్మెట్ సాంప్రదాయం: సిఎం యోగి

ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ప్రారంభించిన ‘నో హెల్మెట్ లేదు- నో ఫ్యుయల్’ అనే ప్రచారంపై సిఎం యోగి స్పష్టత ఇచ్చారు. ఈ రూల్ ముఖ్య ఉద్దేశ్యం పౌరులను శిక్షించడం కాదని, కానీ ప్రతి ద్విచక్ర వాహనదారుడు ‘ముందు హెల్మెట్, తర్వాత ఇంధనం’ అనే నియమాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు.

హెల్మెట్ ధరించడం భద్రతా బీమా లాంటిదని అన్నారు. గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం కారణంగా తీవ్రమైన గాయాలు, మరణాలు సంభవించాయని గుర్తు చేశారు. అంతేకాక, ఈ ప్రచారం ప్రజలకు చట్టపరమైన భయాన్ని సృష్టించకుండా, సురక్షిత, భద్రతను ప్రేరేపించేలనే ఉద్దేశంతో తీసుకవచ్చినట్టు యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image3
Now Playing
Actor Salim Kumar Passes Away: మలయాళ ప్రముఖ నటుడు కన్నుమూత నివాళి అర్పించిన సీఎం వి.డి. సతీసన్
Related Stories
Recommended image1
Top Fuel Efficient Petrol Cars: ప్రస్తుత మార్కెట్ లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే!
Recommended image2
Fuel Saving Tips: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చు ఆదా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved