MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • ఒంటరిగా గర్జించే సింహం నేను.. 2026 ఎన్నికలపై విజయ్ సంచలన ప్రకటన

ఒంటరిగా గర్జించే సింహం నేను.. 2026 ఎన్నికలపై విజయ్ సంచలన ప్రకటన

TVK Vijay: 2026 తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని టీవీకే అధ్యక్షుడు, యాక్టర్ విజయ్ స్పష్టం చేశారు. మధురై ఈస్ట్‌ నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు. మానాడులో విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయాల్లో హీటును పెంచాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 21 2025, 11:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీవీకే మహానాడులో విజయ్ గర్జన
Image Credit : X/BlackGold

టీవీకే మహానాడులో విజయ్ గర్జన

తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై తన భవిష్యత్‌ ప్రణాళికను స్పష్టంగా వెల్లడించారు. మధురైలో గురువారం నిర్వహించిన టీవీకే రెండో మహానాడులో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

"సింహం ఎప్పుడూ ఒంటరిగానే గర్జిస్తుంది. అది అడవిలో రాజు. మిగతా జంతువులు ఎన్ని ఉన్నా దాని స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు" అంటూ ఆయన తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. ఈ సభకు సుమారు నాలుగు లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు హాజరై ఉత్సాహపరిచారు.

DID YOU
KNOW
?
తమిళగ వెట్రి కజగం (టీవీకే)
తమిళగ వెట్రి కజగం (TVK) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజకీయ పార్టీ. నటుడు విజయ్ 2024 ఫిబ్రవరి 2న స్థాపించిన ఈ పార్టీ ప్రధాన కార్యాలయం చెన్నై పనైయూర్ 8వ అవెన్యూలో ఉంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2026లో ఎన్నికల్లో విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?
Image Credit : Asianet News

2026లో ఎన్నికల్లో విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని విజయ్ ముందుగానే ప్రకటించారు. మధురై ఈస్ట్ నుంచి తాను బరిలో దిగుతానని స్పష్టంగా చెప్పారు. "టీవీకే కార్యకర్తలు 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు. మీరు ఎవరికీ కాదు, నాకే ఓటేస్తున్నారు అనుకోవాలి" అంటూ సందేశం ఇచ్చారు. ఇది పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

35
డీఎంకేపై విజయ్ ఘాటు విమర్శలు
Image Credit : Asianet News

డీఎంకేపై విజయ్ ఘాటు విమర్శలు

డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ను విజయ్ తీవ్రంగా విమర్శించారు. "ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తూ మోసం చేస్తున్నారు. మహిళలకు రూ.1,000 ఇచ్చి సరిపోతుందనుకుంటున్నారా? రైతులు, మత్స్యకారులు కష్టాల్లో ఉన్నారు" అంటూ ఆయన నిప్పులు చెరిగారు. 2026లో డీఎంకేను అధికారంలో నుంచి దింపాలని టీవీకే కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

45
బీజేపీపై విజయ్ హాట్ కామెంట్స్
Image Credit : Asianet News

బీజేపీపై విజయ్ హాట్ కామెంట్స్

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు పై కూడా విజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. "తమిళుల సమస్యలను బీజేపీ విస్మరించింది. NEET సమస్య, కచ్చతీవు దీవి, మత్స్యకారుల ఇబ్బందులు.. ఇలా ఏవీ పరిష్కరించలేకపోయారు" అంటూ విజయ్ విమర్శించారు. బీజేపీ భావజాల శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువు అంటూ కామెంట్ చేశారు. "టీవీకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు. ఒంటరిగానే.. స్వయం శక్తితోనే పోటీ చేస్తుంది" అని తెలిపారు.

55
టీవీకే లక్ష్యాలు, భవిష్యత్ దిశను వివరించిన విజయ్
Image Credit : ANI

టీవీకే లక్ష్యాలు, భవిష్యత్ దిశను వివరించిన విజయ్

మానాడులో విజయ్ తన పార్టీ టీవీకే లక్ష్యాలను కూడా వివరించారు. "మహిళలు, యువకులు, రైతులు, కూలీలు, మత్స్యకారులు, వృద్ధులు.. ఇలా అందరి సంక్షేమమే మా లక్ష్యం" అన్నారు. అధికారం కోసం కాదు.. తాను ప్రజల కోసమే రాజకీయంలోకి వచ్చానని చెప్పారు. 

ప్రజా సమస్యల పరిష్కారమే తమ దిశ అని వివరించారు. "నిజాయితీ ఉన్న నాయకుడు కావడం ముఖ్యం. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను" అని విజయ్ చెప్పారు.

విజయ్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో వేడి పెరిగింది. బీజేపీ, డీఎంకే రెండింటినీ లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను కదిలించాయి. 

మధురై ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేయడం, అలాగే అన్ని నియోజకవర్గాల్లో టీవీకే పోటీ చేస్తుందని ప్రకటించడం రాష్ట్ర ఎన్నికల్లో కొత్త సమీకరణలకు దారితీస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో విజయ్ ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
రాజకీయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
ఏపీ కేబినెట్ మీట్: 2,778 పోస్టుల భర్తీ, 250 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్.. మొత్తం 33 అంశాలకు ఆమోదం
Recommended image2
ముంబై కెప్టెన్సీకి గుడ్ బై.. రిటైర్మెంట్ ప్లాన్ లో అజింక్య రహానే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved