MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • Schemes : మహిళలకు నెలనెలా రూ.2,500, యువతకు రూ.5000

Schemes : మహిళలకు నెలనెలా రూ.2,500, యువతకు రూ.5000

Tamilnadu Assembly Elections 2026 : తమిళనాడు రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల సమయంలో అన్నిపార్టీలు మేనిఫెస్టో ప్రకటించగా తాజాగా విజయ్ పార్టీ TVK కూడా తమ హామీలు ప్రకటించింది. 

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 17 2026, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టివికె ఎలక్షన్ మేనిఫెస్టో..
Image Credit : Gemini AI

టివికె ఎలక్షన్ మేనిఫెస్టో..

ప్రముఖ సినీనటుడు విజయ్ తమిళనాడు రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇలా మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన టివికే అధికారమే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతోంది... ఇందులో భాగంగానే తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో తమిళ ఓటర్లను ఆకట్టుకునే అనేక పథకాలున్నాయి... వీటిలో కొన్ని ముఖ్యమైన హామీల గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మహిళలకు నెలనెలా రూ.2500..
Image Credit : Getty

మహిళలకు నెలనెలా రూ.2500..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టివికే విజయం సాధించి అధికారంలోకి వస్తే మహిళలకు అండగా ఉంటామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వారికి నెలకు రూ.2,500 సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న కుటుంబాల్లోని ప్రతి అమ్మాయి పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర ఇస్తామని విజయ్ పార్టీ హామీ ఇచ్చింది.

Related Articles

Related image1
Farmer Registration: రైతులకు బిగ్‌ అలర్ట్‌..ఆ పథకాలు వర్తించాలంటే ఇవి కచ్చితంగా ఉండాల్సిందే!
Related image2
Savings Schemes: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకాలు.. అస్స‌లు రిస్క్ ఉండ‌దు.
36
యువతకు ఎడ్యుకేషన్ లోన్..
Image Credit : Getty

యువతకు ఎడ్యుకేషన్ లోన్..

యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కీలక ప్రకటన చేసింది టివికే. ప్రతి కాలేజీ విద్యార్థికి అండర్ గ్రాడ్యుయేట్ నుంచి డాక్టోరల్ స్టడీస్ వరకు చదువుకోవడానికి రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని విద్యా రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఉచితంగా పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తామని విజయ్ పార్టీ తెలిపింది.

ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసుల్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి గ్రాడ్యుయేట్‌కు నెలకు రూ.5,000 అందిస్తామని టివికే ప్రకటించింది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.10,000, ఐటీఐ, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.8,000 స్టైఫండ్‌తో ఏటా 5 లక్షల ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

46
పెన్షన్ పెంపు..
Image Credit : Getty

పెన్షన్ పెంపు..

ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందిస్తున్న పెన్షన్ ను పెంచనున్నట్లు టివికే తెతిపింది. ఈ పెన్షన్‌ను నెలకు రూ.3,000కు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక ప్రతి ఇంటికి ఏటా ఆరు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని కూడా టివికే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది.

ప్రతి విద్యార్థికి రూ.15,000..

1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే ప్రతి చిన్నారి తల్లికి ఏటా రూ.15,000 ఇస్తామని ప్రకటించింది. మహిళల స్వయం సహాయక సంఘాలకు (SHGs) రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని టివికే చీఫ్ విజయ్ తెలిపారు.

ఆరోగ్యం...

ఆరోగ్య రంగంలో రూ.25 లక్షల వరకు కవరేజీతో ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్, ఆధునిక మౌలిక సదుపాయాలతో కొత్త మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు, ఏటా ఉచిత ఫుల్-బాడీ చెకప్‌లు, డ్రగ్-ఫ్రీ తమిళనాడును గ్యారెంటీగా ఇస్తామంది టీవికే.

56
రైతులు, మత్స్యకారులపై వరాలు
Image Credit : pixabay

రైతులు, మత్స్యకారులపై వరాలు

5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు సహకార సంఘాల్లో తీసుకున్న అన్ని పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు 50% మాఫీ చేస్తారట. భూమి ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ.15,000 సాయం, వరికి క్వింటాల్‌కు రూ.3,500, చెరకుకు క్వింటాల్‌కు రూ.4,500 మినిమం సపోర్ట్ ఫ్రైజ్ (MSP) అందిస్తామన్నారు. రైతులకు ఐదు లక్షల సోలార్ పంపులు పంపిణీ చేస్తారట. ఇక వ్యవసాయ కూలీలకు ఏటా రూ.10,000 సపోర్ట్ అందిస్తామని ప్రకటించారు. 100% పంటల భీమా కల్పిస్తామన్నారు.

చేపల వేట లేని సీజన్‌లో రూ.27,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఫిషింగ్ బోట్లకు సబ్సిడీ డీజిల్, రూ.25 లక్షల ప్రమాద భీమా, శాశ్వత గృహాలు హామీ ఇచ్చారు., దేశంలోనే తొలిసారిగా చేపలకు (సార్డైన్, మాకేరెల్, రొయ్యలు, స్క్విడ్) చట్టబద్ధమైన MSP కోసం 'మీన్ విలైయుమ్ నీతి' పథకాన్నిఅమలు చేస్తామని తెలిపారు.

66
ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం
Image Credit : x

ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం

పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించడాన్ని సమీక్షిస్తామని, ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని TVK హామీ ఇచ్చింది. అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.18,000, పారిశుధ్య కార్మికులకు రూ.10,000 జీతం, పదవీ విరమణ తర్వాత రూ.15 లక్షలు అందిస్తామని పేర్కొంది.

ఆర్థిక విజన్, పాలనా సంస్కరణలు

2036 నాటికి తమిళనాడును రూ.1.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని టివికె పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ, AI విశ్వవిద్యాలయం, AI సిటీని ఏర్పాటు చేసి తమిళనాడును భారతదేశ AI రాజధానిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది. MSMEలకు రూ.15,000 కోట్ల సపోర్ట్, జిల్లా వారీగా "మండల ప్రణాళికలు" రూపొందిస్తామని తెలిపింది.

ప్రభుత్వ పథకాలను (రేషన్‌తో సహా) డోర్‌స్టెప్ డెలివరీ చేస్తామని, కమ్యూనిటీ సర్టిఫికేట్, ల్యాండ్ పట్టా, బర్త్ సర్టిఫికేట్ వంటి ప్రతి ప్రభుత్వ సేవను నిర్ణీత సమయంలో అందిస్తామని గ్యారెంటీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే, పౌరులు నేరుగా లేవనెత్తిన సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీలో ఒక ప్రత్యేక రోజు కేటాయిస్తామని, జిల్లా బడ్జెట్‌లో 10 శాతం నిధులను ప్రజలే నిర్ణయిస్తారని విజయ్ తన పార్టీ మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Recommended image3
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
Related Stories
Recommended image1
Farmer Registration: రైతులకు బిగ్‌ అలర్ట్‌..ఆ పథకాలు వర్తించాలంటే ఇవి కచ్చితంగా ఉండాల్సిందే!
Recommended image2
Savings Schemes: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకాలు.. అస్స‌లు రిస్క్ ఉండ‌దు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved