MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన టాప్ వార్తలు

ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన టాప్ వార్తలు

Top News Updates: భారీ వర్షాల హెచ్చరికల నుండి రాజకీయ ఘర్షణలు, కేంద్రం కొత్త పెట్టుబడుల ఆమోదం , కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలు, ట్రంప్ టారిఫ్‌లు, ఆర్సీబీ తొక్కిస‌లాట‌ విషాదం పై సంచ‌ల‌న నివేదిక‌ల వరకు ఈరోజు ప్రధాన వార్తల వివ‌రాలు మీకోసం.

3 Min read
Mahesh Rajamoni
Published : Aug 13 2025, 06:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు హెచ్చరికలు
Image Credit : ANI

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు హెచ్చరికలు

దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

దీంతో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లలో సమావేశం నిర్వహించారు. పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

26
నిరసనలు, వాగ్వాదాల మధ్య ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు
Image Credit : X/YSR Congress Party

నిరసనలు, వాగ్వాదాల మధ్య ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు

వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఘర్షణలు, నిరసనలు మధ్య ముగిశాయి. పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్‌ నమోదైంది. పులివెందులలో స్వల్ప ఘర్షణలు జరిగాయి.

ఒంటిమిట్టలోనూ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. దాడులు, రహదారులపై ఆందోళనలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ-వైకాపా వర్గాల మధ్య పలు చోట్ల తోపులాటలు, ఏజెంట్లపై దాడులు జరిగాయి. వివాదాల కారణంగా పలుమార్లు పోలింగ్‌ నిలిచిపోయి, అధికారులు జోక్యం చేసుకుని పునఃప్రారంభించారు. ఓట్ల లెక్కింపు ఆగస్టు 14న జరుగుతుంది.

Related Articles

Related image1
Heavy Rains: భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు.. వచ్చే 3 రోజులు బయటకు రావొద్దు
Related image2
India vs England: చరిత్ర సృష్టించిన ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. రికార్డుల మోత ఇది !
36
ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Image Credit : our own

ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

కేంద్ర కేబినెట్‌ ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి చిప్ తయారీ కంపెనీ రానుంది. ఏపీ, ఒడిశా, పంజాబ్‌లలో రూ.4,594 కోట్ల పెట్టుబడితో నాలుగు కొత్త సెమీకండక్టర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటితో దేశ సాంకేతిక సామర్థ్యం పెరిగి, ఉపాధి అవకాశాలు రానున్నాయి.

చిప్‌ తయారీలో స్వావలంబన దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. అలాగే, లక్నో మెట్రో రైల్‌ ఫేజ్‌-1బి, టాటో-II జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని షియోమి జిల్లాలో 700 మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి టాటో-II జలవిద్యుత్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది.

46
వీధికుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలు
Image Credit : ANI

వీధికుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలు

సుప్రీంకోర్టు ఢిల్లీ NCR ప్రాంతంలో అన్ని వీధికుక్కలను 8 వారాల్లో షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఆదేశించింది. రేబిస్‌ కేసులు, కుక్కకాటు ఘటనలు పెరగడాన్ని కారణంగా చూపింది. ఆదేశాలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

అయితే, సుప్రీంకోర్టు తీర్పుపై చాలా మంది ప్ర‌ముఖులు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. జంతు ప్రేమికులు, రాహుల్ గాంధీ, మేనకా గాంధీ వంటి పలువురు ఈ నిర్ణయంపై స్పందించారు. కాగా, ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య ఢిల్లీలో 35 వేల మంది కుక్కకాటుకు గురయ్యారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

56
మరోసారి అదే పాట పాడిన ట్రంప్
Image Credit : stockphoto

మరోసారి అదే పాట పాడిన ట్రంప్

భారతదేశంపై అమెరికా విధించిన 50% టారిఫ్‌లు విధించింది. మొదట 25% టారిఫ్‌లు ఆగస్టు 7, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత మరో 25% టారిఫ్‌లు ఆగస్టు 27, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే టారిఫ్‌ల పై కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఈ అంశంపై పుతిన్ తనతో మాట్లాడాలని కోరారని కూడా ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రభుత్వం ఈ చర్యను ఖండించగా, ఈ టారిఫ్‌ల వల్ల చిన్న, మధ్య తరహా భారతీయ వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, దిగుమతి బంగారు కడ్డీలపై సుంకాలు విధించబోమని కూడా తాజాగా పేర్కొన్నారు. అమెరికా కస్టమ్స్‌ ప్రకటన, వైట్‌హౌస్‌ అధికారుల వ్యాఖ్యలతో గందరగోళం నెలకొని, బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ట్రంప్‌ ప్రకటన తర్వాత ఔన్సుపై ధర 50 డాలర్లు తగ్గింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఉత్తర్వులు జారీ కాలేదు.

66
ఆర్సీబీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్
Image Credit : Asianet News

ఆర్సీబీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయాప‌డ్డారు. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. జస్టిస్ జాన్ మైఖేల్ డీకున్హా కమిషన్ నివేదిక ప్రకారం స్టేడియం డిజైన్, సౌకర్యాలు పెద్ద ఈవెంట్లకు త‌గిన‌ట్టుగా లేవ‌ని తేలింది. దీంతో బెంగ‌ళూరు చిన్న స్వామి స్టేడియంలో భ‌విష్య‌త్తు పై ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

మ‌హిళ ప్ర‌పంచ క‌ప్ 2025 తో పాటు రాబోయే ప‌లు క్రికెట్ ఈవెంట్లు మ‌రో వేదిక‌కు మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఐపీఎల్ లో ఆర్సీబీకి హోం గ్రౌండ్ గా కూడా ఉంది. ఇక్క‌డ జ‌రిగిన తొక్కిస‌లాట‌కు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, KSCA నిర్లక్ష్యమే కారణమని తేల్చి, ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. భద్రతా ప్రమాణాలు మెరుగుపరచకపోతే, భవిష్యత్తులో ఈ వేదికపై ప్రధాన మ్యాచ్‌లు జరగకపోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
రాజకీయాలు
డొనాల్డ్ ట్రంప్
ఏషియానెట్ న్యూస్
రోజు వారీ ప్రధాన వార్తలు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved