- Home
- National
- TGSRTC Jobs : పరీక్ష లేదు, ఫీజు లేదు... తెలుగు రాయడం, చదవడం వస్తేచాలు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం
TGSRTC Jobs : పరీక్ష లేదు, ఫీజు లేదు... తెలుగు రాయడం, చదవడం వస్తేచాలు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం
తెలంగాణ ఆర్టిసిలో భారీ ఉద్యోగాాల భర్తీ చేపడుతున్నారు. విద్యార్హతలతో సంబంధం లేకుండా కేవలం తెలుగు రాయడం, చదవడం వస్తేచాలు... ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకూ ఆ ఉద్యోగాలేంటో తెలుసా?

Telangana RTC Jobs
Telangana RTC Jobs : తెలంగాణ ఆర్టిసి గుడ్ న్యూస్ తెలిపింది. అసలు విద్యార్హతలతో సంబంధమే లేకుండా కేవలం తెలుగు చదవడం, రాయడం వస్తేచాలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దమయ్యింది ఈ ప్రభుత్వ సంస్థ. పాఠశాల విద్యకే పరిమితమై ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా ఇబ్బందిపడుతున్నవారికి ఇది మంచి అవకాశం. ఇలా టిజిఎస్ ఆర్టిసి ఏకంగా 1500 ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది... ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేసారు.
అయితే ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో చేపడుతోంది ఆర్టిసి సంస్థ. అంటే ఈ ఉద్యోగాలు పర్మనెంట్ కాదన్నమాట... ఇప్పుడున్న అవసరాన్ని తీర్చుకోడానికి తాత్కాలికంగా నియమించుకుంటున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయినవారు నిర్ణీత కాలానికే (నాలుగు నెలలు) పనిచేయాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఆర్టిసి అధికారులు కాంట్రాక్టును పొడిగిస్తారు.
ప్రస్తుతం ఆర్టిసిలో డ్రైవర్ల కొరత ఉంది... చాలాకాలంగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, ఉన్నవారిలో చాలామంది రిటైర్ అవుతుండటంతో ఈ సమస్య ఏర్పడింది. ప్రతినెలా సగటున 50 మంది డ్రైవర్లు రిటైర్ అవుతున్నారట. దీంతో మొదటిసారి ఆర్టిసి ఔట్ సోర్సింగ్ పద్దతిలో డ్రైవర్లను నియమించుకుంటోంది.
TGSRTC Jobs
టిజిఎస్ ఆర్టిసి డ్రైవర్ ఉద్యోగాలకు అర్హతలు :
తెలంగాణ ఆర్టిసి డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారి 60 ఏళ్లలోపు వయసు కలిగి సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. ఎత్తు 160 సెంటిమీటర్లు తగ్గకుండా ఉండాలి. భారీ వాహనాలు నడిపిన అనుభవంతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్ కలిగిఉండాలి.
విద్యార్హతలు అవసరం లేదు... కానీ తెలుగులో మాట్లాడటమే కాదు కనీసం రాయడం, చదవడం వచ్చిఉండాలి. అంటే కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం చేసివుండాలన్నమాట. అలాగే ఎంప్లాయిమెంట్ ఎక్చ్సేంజ్ కార్డు కలిగివుండాలి.
TGSRTC
ఎంపిక ప్రక్రియ, జీతం :
టిజిఎస్ ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎలాంటి దరఖాస్తు ఫీజు, రాత పరీక్ష లేకుండానే ఈ నియామకాలు చేపడతారు. ఆర్టిసి ఉన్నతాధికారులే దరఖాస్తు చేసినవారిలో ఎవరు సరిపోతారో నిర్ణయించి ఉద్యోగాల్లో చేర్చుకుంటారు.
ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టిసి ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే డ్రైవర్ల నైపుణ్యాన్ని పరీక్షించేందుకు ఓ టెక్నికల్ కమిటీని కూడా ఏర్పాటుచేయనున్నారు. ఈ కమిటీలు దరఖాస్తుదారులను పరిశీలించి సరైనవారికి డ్రైవర్లుగా నియమిస్తారు.
ఎంపికచేసిన అభ్యర్థులకు ముందుగా రెండువారాలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో రోజుకు రూ.200 చెల్లిస్తారు. ఆ తర్వాత ఉద్యోగాల్లో చేర్చుకుంటారు. ఇలా పూర్తిస్థాయిలో బస్ డ్రైవర్ గా ఎంపికయితే నెలకు రూ.22,415 సాలరీ వస్తుంది.