MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Supreme Court: బ‌ల‌వంతంగా భాష‌ను రుద్ద‌డ‌మంటే, విద్యార్థుల‌పై ఒత్తిడి పెంచ‌డ‌మే.. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Supreme Court: బ‌ల‌వంతంగా భాష‌ను రుద్ద‌డ‌మంటే, విద్యార్థుల‌పై ఒత్తిడి పెంచ‌డ‌మే.. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Supreme Court: 9వ తరగతి నుంచి మూడో భాష బోధించడంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలకు ముందు కొత్త భాష ప్రవేశపెట్టడం విద్యార్థులపై ఒత్తిడి పెంచడమేనని స్పష్టం చేసింది. అలాగే NEPలో హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 16 2026, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇప్పుడు కొత్త భాష ఎందుకు?
Image Credit : chatgpt

ఇప్పుడు కొత్త భాష ఎందుకు?

9 వ తరగతిలో మూడో భాషను ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే టైంలో కొత్త భాష ఇవ్వడం సరైన విధానం కాదని జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. మూడో భాషను 9 తరగతిలో కాకుండా 6వ తరగతి లేదా 8 వ తరగతి నుంచి పెడితే విద్యార్థులకు ఈజీ అవుతుందని సుప్రీంకోర్టు సూచించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై తమిళనాడు ప్రభుత్వం పిటిషన్
Image Credit : Asianet News

మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై తమిళనాడు ప్రభుత్వం పిటిషన్

తమిళనాడులో ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‍పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణలో జాతీయవిద్యా విధానం, త్రిభాషా సూత్రం, విద్యార్థులపై విద్యాభారం వంటి అంశాలపై ధర్మాసనం స్పందించింది.

Related Articles

Related image1
Evil Eye: దిష్టి తీయడానికి ఉప్పు, మిరపకాయలనే ఎందుకు వాడతారు? అసలు ఈ అలవాటు ఎలా మొదలైంది?
Related image2
USA: అమెరికాలో సంవత్సరానికి రెండుసార్లు టైం ఎందుకు మార్చుతున్నారు? అసలీ టైం గోల ఏంటీ?
35
తమిళనాడు ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యర్థనను తోసి పుచ్చిన సుప్రీంకోర్టు
Image Credit : X

తమిళనాడు ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యర్థనను తోసి పుచ్చిన సుప్రీంకోర్టు

తమిళనాడు ప్రభుత్వ తరపు న్యాయవాది..CBSCలో 9 వ తరగతి నుంచే మూడో భాష తప్పనిసరి అవుతుందని చెప్పగా...జస్టిస్ నాగరత్న ఆ వాదనను తోసిపుచ్చారు. 9 తరగతి నుంచి బోర్డు పరీక్షల ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు కొత్త భాషను ప్రారంభించడం కంటే 6 తరగతి నుంచే చేర్చితే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని సూచించారు. తన సూచనను CBSC, ICSE, రాష్ట్ బోర్డులు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. 8 వ తరగతి నుంచే 10 వ తరగతి బోర్డ్ ఏగ్జామ్స్ ప్రెజర్ ఉంటుందని...ఆ సమయంలో కొత్త భాషను విద్యార్థులపై రుద్దొద్దని చెప్పారు.

45
జాతీయ విద్యావిధానంపైనా సుప్రీంకోర్టు క్లారిటీ
Image Credit : X

జాతీయ విద్యావిధానంపైనా సుప్రీంకోర్టు క్లారిటీ

ఇదే విచారణలో జాతీయ విద్యావిధానంపైనా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. NEPలో మూడో భాషగా హిందీని ఎవరూ తప్పనిసరి చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర భాష, ఇంగ్లీష్‍తో ఏదైనా మరో భారతీయ భాషను మూడో భాషగా ఎంచుకోవచ్చని, హిందీనే చదవాలనే నిబంధన ఎక్కడా లేదని వివరించారు. ప్రతివాది తరపు న్యాయవాది కూడా NEPలో ఏ రాష్ట్రంపైనా ఏ భాషను బలవంతంగా రుద్దకూడదని స్పష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు...మీకు హిందీ వద్దనుకుంటే..సంస్కృతం అయితే అభ్యంతరం ఏమిటని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

55
కేంద్రం చెప్పిందని వ్యతిరేకించకండి: సుప్రీంకోర్టు
Image Credit : chatgpt

కేంద్రం చెప్పిందని వ్యతిరేకించకండి: సుప్రీంకోర్టు

అదే సమయంలో కేంద్రం తీసుకొచ్చిన విద్యా విధానాన్ని కేవలం కేంద్రం ప్రతిపాదించిందనే కారణంతో వ్యతిరేకించవద్దని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్రానికి సొంత విద్యా విధానం ఉండొచ్చని, కానీ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించడం సరికాదని వ్యాఖ్యానించింది. అయితే జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని కోర్టు చెప్పింది. ఆ చర్చలు విఫలమైతే కేసు మెరిట్స్ పై విచారణ చేపడతామని తెలిపింది. తర్వాతి విచారణ ఆగష్టు 11కు వాయిదా వేసింది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
విద్య
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Stock Market Today: ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన గ్లోబల్ అప్‌డేట్స్ ఇవే !
Recommended image2
Now Playing
Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Recommended image3
USA: అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే టాప్ 5 నగరాలు ఇవే.. ఈ ప్రాంతాలే ఎందుకు? వాటి ప్రత్యేకత ఏంటి?
Related Stories
Recommended image1
Evil Eye: దిష్టి తీయడానికి ఉప్పు, మిరపకాయలనే ఎందుకు వాడతారు? అసలు ఈ అలవాటు ఎలా మొదలైంది?
Recommended image2
USA: అమెరికాలో సంవత్సరానికి రెండుసార్లు టైం ఎందుకు మార్చుతున్నారు? అసలీ టైం గోల ఏంటీ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved