MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • National
  • Onion Price Hike : ఏవండోయ్ కామన్ మ్యాన్స్.. ఈ వీకెండ్ మార్కెట్లోనే ఉల్లిపాయలు కొనేయండి, లేదంటే దబిడిదిబిడే

Onion Price Hike : ఏవండోయ్ కామన్ మ్యాన్స్.. ఈ వీకెండ్ మార్కెట్లోనే ఉల్లిపాయలు కొనేయండి, లేదంటే దబిడిదిబిడే

తెలుగు రాాష్ట్రాల్లో మరీముఖ్యంగా హైదరాబాద్ లో ఉల్లి ధర ఒక్కసారిగా పెరిగింది. అయితే భవిష్యత్ లో ఈ దర మరింత పెరగవచ్చనే అంచనాలు సామాన్యులను కంగారు పెడుతున్నాయి. కాబట్టి ఇప్పుడే ఉల్లిపాయలు కొనిపెట్టుకోవడం మంచిది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 10 2026, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉల్లి ధర
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉల్లి ధర

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సామాన్య ప్రజలు, గృహిణులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని మలక్ పేట్ కు ఉల్లి సరపరా తగ్గింది… దీంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Image Credit : Getty

ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

ఉల్లి ధరల పెరుగుదలకు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలే ప్రధాన కారణం. దేశంలో ఉల్లిపాయలు ఎక్కువగా పండించేది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలే. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి… దీంతో ఉల్లి పంట దెబ్బతింది. అంతేకాదు ఉల్లి పంటు కోతకు, రవాణాకు ఈ వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్లే తెలుగు రాష్ట్రాలకు ఉల్లి సరఫరా తగ్గి ధరలు పెరిగాయి. 

 హైదరాబాద్ లోని మలక్ పేట మార్కెట్ కు ప్రతిరోజు 20 వేల క్వింటాళ్ల ఉల్లిపంట వస్తుంది. కానీ ఇటీవల కాలంలో సరఫరా బాగా తగ్గి కేవలం పదివేల క్వింటాళ్ల లోపే వస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి… ఉల్లి సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయి. 

Related Articles

Related image1
Now Playing
Gold Price Today: బంగారం కొనేవారికి షాక్ మళ్ళీ పెరిగిన ధరలు | Asianet News Telugu
Related image2
Now Playing
Gold Price Today: బంగారం కొనేవారికి షాక్ మళ్ళీ పెరిగిన ధరలు | Asianet News Telugu
35
కిలో ఉల్లి ధర ఎంతో తెలుసా?
Image Credit : Getty

కిలో ఉల్లి ధర ఎంతో తెలుసా?

గత వారం కిలో ఉల్లిపాయలు రూ.20-25 అమ్మాయి… కానీ ఇప్పుడు రూ.30-40 అమ్ముతున్నాాయి. రైతు బజార్లలో ఈ ధరలు ఉన్నాయి… ఇక బయటి మార్కెట్లలో ఇంకా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వారాంతం సంతల్లో రూ.100 కి 6-7 కిలోలు అమ్మగా ఇప్పుడు 3-4 కిలోలకు అమ్ముతున్నారు.

వర్షాలు ఇలాగే కొనసాగితే ఉల్లి సరఫరా మరింత తగ్గుతుందని మార్కెట్ వ్యాపారులు అంటున్నారు. అదే జరిగితే కిలో ఉల్లి ధర రూ.50 నుంచి రూ.60కి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పెరుగుదల పూర్తిగా సరఫరా పరిస్థితిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

45
ఉల్లి పెరిగింది... టమాటా తగ్గింది
Image Credit : Getty

ఉల్లి పెరిగింది... టమాటా తగ్గింది

రోజూవారీ వంటల్లో ఉల్లి తప్పనిసరి. అందుకే ఉల్లి ధర పెరిగితే అది నేరుగా కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఈ ఉల్లి ధరల పెరుగుదల అదనపు భారంగా మారుతుంది.

ఉల్లి ధర పెరిగినా, టమాటా సహా ఇతర కూరగాయల ధరలు ప్రస్తుతం నిలకడగానే ఉన్నాయి. సరఫరా పెరగడంతో నాటు టమాటా కిలో రూ.10 నుంచి రూ.20కి, హైబ్రిడ్ టమాటా రూ.30 నుంచి రూ.50కి అమ్ముతున్నారు. ఇతర కూరగాయల ధరల్లో పెద్దగా మార్పులేదని వ్యాపారులు చెబుతున్నారు.

55
ఉల్లి సెంచరీ కొడుతుందా?
Image Credit : Getty

ఉల్లి సెంచరీ కొడుతుందా?

ఉల్లి ధరలు పెరుగుతాయా లేదా మళ్లీ తగ్గుతాయా అనేది మహారాష్ట్రలోని వర్షాలు, మార్కెట్‌కు వచ్చే సరఫరా, ప్రభుత్వ ధరల నియంత్రణ చర్యలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో, రాబోయే కొన్ని రోజులు ఉల్లి మార్కెట్‌కు చాలా కీలకమని వ్యాపారులు భావిస్తున్నారు. ఉల్లి ధరలు రూ.100 దాటిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. మళ్లీ అలాంటి పరిస్థితే వస్తుందేమోనని తెలుగు ప్రజలు భయపడిపోతున్నారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
భార‌తీయులు ఆ దేశంలో వీసా లేకుండా ప్ర‌యాణం.. మోదీ ప‌ర్య‌ట‌న‌లో నేప‌థ్యంలో
Recommended image2
Now Playing
Nepal flash flood Update: నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన కోట్లు విలువ చేసే సోలార్ ప్యానెళ్లు
Recommended image3
Now Playing
Nepal flash flood: నేపాల్ వరద బాధితులకోసం రంగంలోకి దిగిన హెలికాఫ్టర్లు | Asianet News Telugu
Related Stories
Recommended image1
Now Playing
Gold Price Today: బంగారం కొనేవారికి షాక్ మళ్ళీ పెరిగిన ధరలు | Asianet News Telugu
Recommended image2
Now Playing
Gold Price Today: బంగారం కొనేవారికి షాక్ మళ్ళీ పెరిగిన ధరలు | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved