- Home
- National
- వివాహేతర సంబంధం : ప్రియుడితో ఏకాంతంగా ఉండటం చూశాడని.. సవతి కొడుకును హత్య చేసి, బావిలో పడేసి...
వివాహేతర సంబంధం : ప్రియుడితో ఏకాంతంగా ఉండటం చూశాడని.. సవతి కొడుకును హత్య చేసి, బావిలో పడేసి...
రెండో పెళ్లి చేసుకున్న ఓ మహిళ తన సవతి కొడుకును అతి దారుణంగా హత్య చేసింది. యేడాది తరువాత ఈ కేసులో అరెస్టయ్యింది.

తమిళనాడు : ఓ వివాహిత ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ అబ్బాయితో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ బాలుడు చూశాడు. దీంతో తమ విషయం ఎక్కడ బయటకి చెప్పేస్తాడోనని కంగారుపడ్డ ఆ వివాహిత బాలుడిని హత్య చేసి బావిలో పడేసింది.
ఇది జరిగిన ఏడాది తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో బాలుడి పినతల్లి పినతల్లి కౌసల్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే... తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లా వెంబకోట పక్కన ఎలాయి రాంపన్నాయ్ సమీపంలోని ఆర్.మడతుప్పట్టికి చెందిన గోపాల్ (45) కార్మికుడు.
మృతుడైన చిన్నారి పరంధామన్ గోపాల్ మొదటి భార్య కుమారుడు. కొడుకు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోవడంతో గోపాల్ కౌసల్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. యేడాది క్రితం తొమ్మిదేళ్ల పరంధామన్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు.
అన్ని చోట్లా వెతికిన గోపాల్ చివరికి పోలీసులను ఆశ్రయించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మదత్తుపట్టిలోని బావిలో పరంధామన్ మృతదేహాం దొరికింది.
ఆ సమయంలో పరంధామన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో జారిపడి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. కానీ, వారికెందుకో సవతి తల్లి అయిన కౌసల్య మీద అనుమానం వచ్చింది.
ఏలాయిరం న్నైకి చెందిన సేతు కామేష్ (35) కి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని అనుమానించారు. దీంతో వీరిద్దరినీ విచారించాలని భావించారు. కౌసల్య విచారణలో వారి వివాహేతరం సంబంధం వెలుగు చూసింది. సోమవారం కౌసల్య బాలుడిని తానే చంపినట్లు నేరం ఒప్పుకుంది.
నేరం చేయడంలో సేతు కామేష్ సహకరించడాని తేలడంతో అతడి కోసం గాలింపు చేపట్టారు. బాలుడు చనిపోయిన రోజు.. కౌసల్య, కామేష్ ఇంట్లో ఏకాంతంగా ఉన్నారు. అది బాలుడు చూశారు. గోపాల్ కు చెబుతాడని భయపడ్డ కౌసల్య బాలుడి గొంతు కోసి చంపేసింది. తరువాత మృతదేహాన్ని బావిలో పడేసింది.