కోవిడ్ వ్యాక్సిన్‌ తొలి సరకును డెలీవరి చేసిన స్పైస్‌జెట్ (ఫోటోలు)

First Published Jan 12, 2021, 5:22 PM IST

జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి పూణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశంలోని పలు నగరాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.

మంగళవారం భారత్‌లోనే మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్‌ ‌సరకు బాక్సులను స్పైస్ జెట్ మోసుకెళ్లింది. దీనిపై హర్షం వ్యక్తం చేశారు స్పైస్ జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్.

స్పైస్ జెట్ విమానం నెం 8937లో 1088 కిలోల బరువున్న 34 పెట్టెల్లోని కోవిషీల్డ్ మొదటి సరుకు పూణే నుండి ఢిల్లీకి తీసుకువెళ్ళబడిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

గౌహతి, కోల్‌కతా, హైదరాబాద్, భువనేశ్వర్, బెంగళూరు, పాట్నా , విజయవాడలతో సహా వివిధ భారతీయ నగరాలకు భారీమొత్తంలో వ్యాక్సిన్ సరుకులను తీసుకువెళుతున్నామని అజయ్ చెప్పారు.

కోవిడ్ వ్యాక్సిన్‌ను భారతదేశం లోపల, వెలుపల రవాణా చేయడానికి స్పైస్ జెట్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశ పోరాటంలో సుదీర్ఘమైన, నిర్ణయాత్మక దశకు ఈ రోజు నాంది పలికిందని అజయ్ చెప్పారు. మానవజాతి చరిత్రలోనే అతిపెద్ద టీకా డ్రైవ్‌లో స్పైస్ జెట్ సహాయపడటం గర్వంగా ఉందన్నారు.

పూణె నుంచి వ్యాక్సిన్ లోడ్ తో బయలుదేరిన స్పైస్ జెట్ విమానం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?