MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ‘నా రక్తంలో సిక్కిజం ఉంది’: సిక్కు ప్రతినిధుల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ

‘నా రక్తంలో సిక్కిజం ఉంది’: సిక్కు ప్రతినిధుల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ

దేశంలోని సిక్కు మతానికి చెందిన ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసం 7 లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో మోదీ.. సిక్కు నేతల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.

2 Min read
Author : Sumanth K
Published : Feb 18 2022, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దేశంలోని సిక్కు మతానికి చెందిన ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసం 7 లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో మోదీ.. సిక్కు నేతల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ సమావేశం అనంతరం కొందరు సిక్కు నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై, ఆయన పని తీరుపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.  ‘నా రక్తంలో సిక్కిజం ఉంది.. నా రక్తంలో సేవ ఉంది’ అని మోదీ తమతో అన్నారని యమునా నగర్‌లోని సేవాపంతి అధ్యక్షుడు మహంత్ కరమ్‌జిత్ సింగ్ తెలిపారు. 

38

సిక్కుల పట్ల మోదీకి ఉన్న ప్రేమ మాకు చాలా స్పష్టతను తెచ్చిపెట్టిందని ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా అన్నారు. ‘సిక్కు మతగ్రంథాలు, సిక్కు గురువులు, భాష, సేవలో సిక్కులు ఎలా నిమగ్నమై ఉన్నారనే దానిపై మోదీ తప్ప మరెవ్వరికీ అంతగా అవగాహన లేకపోవచ్చు’ అని న్యూఢిల్లీలోని సిక్కు ఫోరమ్ అధ్యక్షుడు రవీందర్ సింగ్ అహుజా అన్నారు.

48

‘మోదీ.. సిక్కులను, దేశాన్ని ప్రపంచ స్థాయిలో బలోపేతం చేశారు. దేశం కోసం సిక్కులు బలిదానంలో ఎంతో కృషి చేశారని ఆయనకు (ప్రధాని మోదీకి) తెలుసు.. సిక్కు సమాజం సేవకు అంకితం చేయబడింది’ అని మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని సింగ్ సభ గురుద్వారా సాహిబ్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ భాటియా అన్నారు.
 

58

‘సిక్కుల కోసం మోదీ జీ చేసిన పని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం దీన్ని చేయడానికి సాహసించలేదు.. మా బ్లాక్ లిస్ట్ ముగిసింది’ అని పాటియాలాలోని యంగ్ ప్రోగ్రెసివ్ ఫోరమ్ అధ్యక్షుడు ప్రభలీన్ సింగ్ అన్నారు.
 

68

మోదీని కలిసినవారిలో ప్రముఖ సిక్కు నాయకులు.. హర్మీత్ సింగ్ కల్కా, ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు; పద్మశ్రీ బాబా బల్బీర్ సింగ్ జీ సిచేవాల్ (సుల్తాన్‌పూర్ లోధి); మహంత్ కరంజిత్ సింగ్, ప్రెసిడెంట్ సేవాపంతి, యమునా నగర్; బాబా జోగా సింగ్, డేరా బాబా జంగ్ సింగ్ (నానక్సర్) కర్నాల్; సంత్ బాబా మేజోర్ సింగ్ వా, ముఖి డేరా బాబా తారా సింగ్ వా, అమృత్‌సర్.

78

మోదీని కలిసినవారిలో ప్రముఖ సిక్కు నాయకులు.. జతేదార్ బాబా సాహిబ్ సింగ్ జీ, కర్ సేవా ఆనంద్‌పూర్ సాహిబ్; సురీందర్ సింగ్ నామ్ధారి దర్బార్ (భేని సాహిబ్); బాబా జస్సా సింగ్ శిరోమణి అకాలీ బుధ దళ్, పంజ్వా తఖ్త్; డాక్టర్ హర్భజన్ సింగ్, దామ్‌దామి తక్సల్, చౌక్ మెహతా; సింగ్ సాహిబ్ గియానీ రంజిత్ సింగ్ జీ, జతేదార్ తఖ్త్ శ్రీ పాట్నా సాహిబ్.

88

ఇక,మరో రెండు రోజుల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరుగనున్నవేళ.. మోదీ సిక్కు నేతలతో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరుగనున్నాయి. మొత్తం 117 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 20వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
 

About the Author

SK
Sumanth K
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
Recommended image2
Now Playing
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo
Recommended image3
Cyclospora parasite: వ్యాక్సిన్ లేదు.. సైక్లోస్పోరా వణికిస్తోంది.. మరో కరోనా లాంటి ముప్పేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved