- Home
- National
- Viral: పై నుంచి చూస్తే సాధారణ ఖర్జూరాలే.. అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూడగా, ఫ్యూజుల్ అవుట్..
Viral: పై నుంచి చూస్తే సాధారణ ఖర్జూరాలే.. అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూడగా, ఫ్యూజుల్ అవుట్..
పోలీసులు, అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు మాత్రం తగ్గడం లేదు. కాదేది స్మగ్లింగ్‌కి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..

పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఎర్రచందనాన్ని పుష్ప రాజ్ ఎలా సముద్రా తీరాలను దాటించాడన్నదే ఈ సినిమా అసలు కథ. ఇక స్మగ్లింగ్ కోసం పుష్ఫ రాజ్ ఎంచుకున్న మార్గాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అయితే సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతున్నారో లేదా.. సినిమాలే నిజ జీవితం నుంచి స్పూర్తి పొంది తీస్తున్నారో తెలియదు కానీ. అక్రమార్కులు మాత్రం స్మగ్లింగ్ కోసం చిత్ర విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటున్నారు.
Representative image
ముఖ్యంగా బంగారం స్మగ్లింగ్ యథేశ్చగా సాగుతోంది. బంగారం ధర తక్కువగా ఉన్న దేశాల్లో కొనుగోలు చేసి భారత్‌లోకి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాళ్లు. ఎంచక్కా విమానాల్లోనే తరలిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమాశ్రయంలో ఇలాగే బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. అయితే ఇందుకోసం కేటుగాళ్లు ఉపయోగించిన పద్ధతి ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
తాజాగా జెడ్డా నుంచి 56 ఏళ్ల వయసున్న ఓ ప్రయాణికుడు ఎస్వీ 756 విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాడు. అయితే అతని బ్యాగ్‌ను చెకింగ్ చేసే సమయంలో ఏదో అనుమానం వచ్చిన అధికారులు కాస్త లోతుగా పరిశీలించారు. బ్యాగులో ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఖర్జూరాలను గమనించిన అధికారులు అనుమానం వచ్చి వాటిని విప్పి చూశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
Gold smugling
ఇంతకీ వాటిలో ఏముందంటే..
ఖర్జూర పండ్లను ముందుగానే విప్పి అందులోని గింజల స్థానంలో బంగారు ముక్కలను ఉంచారు. అంతేకాదు ఆ ఖర్జూర పండ్ల బ్యాగ్‌లో ఓ గోల్డ్ చైన్‌ను కూడా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఖర్జూర పండ్లలో తీసుకొచ్చిన మొత్తం బంగారం సుమారు 172 గ్రాములు ఉండొచ్చని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఖర్జూరాల్లో బంగారాన్ని తరలించడం చూసిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.