రతన్ టాటా మృతి : ఇకపై టాటా వారసత్వాన్ని కొనసాగించేది ఆయనేనా?
భారత వ్యాపారదిగ్గజం రతన్ టాటా వయోభారంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే టాటా వారసత్వాన్ని కొనసాగించేది ఎవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో టాటా ఫ్యామిలీకి చెందిన ఓ పేరు బలంగా తెరపైకి వచ్చింది.
Ratan Tata Passes Away
భారత దేశంలోనే విదేశాల్లో కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన టాటా సంస్థకు తీరని లోటు సంభవించింది. టాటా సన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఈ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసారు. 86 ఏళ్ల వయసులో రతన్ టాటా మృతిచెందగా ఆయన వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారన్నదానిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
రతన్ టాటాకు పెళ్లాం పిల్లలు లేరు... ఇంతకాలం ఆయన ఒంటరిగానే జీవించారు. వేల కోట్ల ఆస్తిపాస్తులున్నా ఆయన మాత్రం అత్యంత సాధారణ జీవితమే గడిపారు. ఆయన ఆస్తుల విలువ రూ.3,600 కోట్ల వరకు వుంటుంది. ఆయన మరణంతో ఈ ఆస్తిపాస్తులు, టాటా వారసత్వం ఎవరికి చెందుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఎక్కువగా వినిపిస్తున్న పేరు నోయల్ టాటా.
Noel Tata
ఎవరి నోయెల్ టాటా :
నావల్ టాటా, సూని టాటా దంపతుల కుమారుడు రతన్ టాటా... అతడు 10 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు... అంతేకాదు తండ్రి నావల్ టాటా మరో వివాహం చేసుకున్నాడు. ఇలా నావల్ టాటాకు రెండో భార్య సిమోన్ టాటా ద్వారా కలిగిన సంతానమే నోయెల్ టాటా.
టాటా యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ నుండి బ్యాచిలర్ డిగ్రీ చేసారు నోయెల్ టాటా. ఆ తర్వాత ఫ్రాన్స్ లో INSEAD బిజినెస్ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ చేసారు. ఆ తర్వాత టాటా సంస్థలో చేరి అనేక కీలక బాధ్యతలు చేపట్టారు.
టాటా సంస్థ విదేశాల్లో నిర్వహించే వ్యాపార కార్యకలాపాలు, సేవలను చూసుకునే సంస్థ టాటా ఇంటర్నేషనల్. ఇందులో మొదట తన సేవలను అందించారు నోయెల్ టాటా. ఆ తర్వాత తన తల్లి స్థాపించిన ట్రెంట్ (వెస్ట్ సైడ్, జూడియో, ఉట్సా వంటి వస్త్రవ్యాపారాలు నిర్వహించే సంస్థ) కు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. 2003 లో నోయెల్ టైటాన్ ఇండస్ట్రీస్, వోల్టాస్ విభాగాలకు డైరెక్టర్ గా మారారు.
అయితే 2010-11 లోనే నోయెల్ టాటా తన సోదరుడు రతన్ టాటా వారసుడిగా నియమింపబడతాడనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా 2011 లో నోయెల్ బావమరిది సైరన్ మిస్త్రీ టాటా సంస్థల బాధ్యతలు చేపట్టాడు. ఇలా అప్పుడు టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టలేకపోయినా ఇప్పుడు టాటా వారసత్వాన్ని కొనసాగించే అవకాశం నోయెల్ టాటాకు దక్కే అవకాశాలున్నాయి.
Maya Tata
టాటా వారసత్వ పోటీలో నోయెల్ టాటా పిల్లలు :
నోయెల్... టాటా కుటుంబానికి చెందినవాడు. అలాగే టాటా సన్స్ లో అతిపెద్ద వాటాదారుగా వున్న పల్లోంజి మిస్త్రీ కూతురు ఆలూ మిస్త్రీ ఇతని భార్య. వీరిద్దరి సంతానమే మాయా, నెవిల్లే, లేహ్ టాటాలు. వీరికి అటు తండ్రి, ఇటు తల్లి తరపున టాటా సన్స్ తో అనుబంధం వుంది. కాబట్టి వీరిలో ఒకరు టాటా వారసులుగా మారే అవకాశాలున్నాయి.
మాయా టాటా (34 ఏళ్ళ వయసు) :
మాయా టాటా ఇప్పటికే టాటా సన్స్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బేయెస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్వవిక్ చేసి ప్రస్తుతం టాటా ఆపర్చునిటీస్ ఫండ్ ఆండ్ టాటా డిజిటల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Neville Tata
నెవిల్లే టాటా (32 ఏళ్ల వయసు) :
నెవిల్లే టాటా బ్రిటన్ లో ని బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. 2016 లో ట్రెంట్ లిమిటెడ్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. టాటా గ్రూప్ కు చెందిన రిటైల్ సంస్థ స్టార్ బజార్ బాధ్యతలను ఇతడు చూసుకుంటున్నాడు. ఇతడికి టాటా వారసుడిగా ఎక్కువ అవకాశాలున్నాయి.
నెవిల్లే టాటా టొయోటా కిర్లోస్కర్ గ్రూప్ కు చెందిన మానసి కిర్లోస్కర్ ను పెళ్లాడాడు. వీరి ఓ మగపిల్లాడు సంతానం. అతడి పేరు జంషెడ్ టాాటా.
లేహ్ టాటా :
నోయల్ టాటా పిల్లల్లో లేహ్ టాటా పెద్దది. 39 ఏళ్ల ఈమె టాటా గ్రూప్ హాస్పిటాలిటీ రంగం బాధ్యతలు చూస్తున్నారు. టాటా తాజ్ హోటల్స్, రిసార్ట్స్, ప్యాలెస్ లు చూసుకుంటున్నారు. ఈ రంగంలో ఈమె తనదైన ముద్ర వేసారు.