MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ప్రధానిని కలిసిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మోడీ ఏమన్నారంటే...

ప్రధానిని కలిసిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మోడీ ఏమన్నారంటే...

భారత యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. భారత యువత ఏ రంగంలోనైనా ఢంకా బజాయిస్తుందనడానికి  ఉదాహరణగా ప్రజ్ఞానంద నిలుస్తారంటూ మోడీ మెచ్చుకున్నారు. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Sep 01 2023, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఢిల్లీ : భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రధాని నరేంద్ర మోడీని గౌరవ సూచకంగా కలుసుకున్నారు. అత్యంత పిన్న వయసుకుడైన భారతీయ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.  అతను తల్లిదండ్రులతో కలిసి  ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ఆయనతో కాసేపు గడిపారు.  మీ కుటుంబంతో పాటు మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ  ప్రజ్ఞానందను పొగిడారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రధానిని కలిసిన తర్వాత ప్రజ్ఞానంద ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. గౌరవనీయులైన ప్రధానమంత్రిని ఆయన నివాసంలో కలవడం గొప్ప గౌరవం. నన్ను, నా తల్లిదండ్రులను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఆ ఫోటోలు షేర్ చేశాడు ప్రజ్ఞానంద.

35

ప్రజ్ఞానందగ చేసిన ట్వీట్ ను షేర్ చేస్తూ ప్రధాని.. ఈ గౌరవం మీ అభిరుచిని, పట్టుదలను తెలుపుతుంది. భారత యువత ఏ రంగంలోనైనా ఎలాంటి విజయాలు సాధించగలదో చెప్పడానికి మీరు ఉదాహరణగా నిలుస్తారు. మిమ్మల్ని చూసి మేము గర్వంగా ఉన్నాం..  అంటూ కామెంట్ చేశారు.

45

ఇటీవల జరిగిన చెస్ ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్ కు చేరుకున్నాడు యువ ఆటగాడు ప్రజ్ఞానందా.  చెన్నైకి చెందిన ఈ  ప్రతిభావంతుడైన యువ ఆటగాడు.. టైటిల్ మ్యాచ్లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సెన్ తో పోటీపడి ఓడిపోయాడు. ఈ ప్రపంచ టోర్నమెంట్లో  రన్నరప్ గా నిలిచాడు. అంతకుముందు కార్ల్ సెన్ ను ఓడించిన ప్రజ్ఞనంద.. ఫైనల్ లో మాత్రం దాన్ని పునరావృతం చేయలేకపోయాడు.

55

రన్నరపుగా నిలిచిన ఈ యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తన ప్రతిభతో కోట్లాదిమంది భారతీయుల హృదయాలు గెలుచుకున్నాడు. ప్రజ్ఞానందా కనపరచిన ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ముగ్ధుడై ఓ బహుమతి కూడా ప్రకటించారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులైన రమేష్ బాబు, నాగలక్ష్మిలకు  ఎక్స్యువి 400 ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు వారికి రెండు రోజుల క్రితం కారును అందజేశారు.

About the Author

BS
Bukka Sumabala
నరేంద్ర మోదీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
Recommended image2
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !
Recommended image3
Now Playing
CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved