శత వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ తల్లి...!
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ప్రత్యేకంగా ఆశీర్వాదం తీసుకున్నారు. నేల మీద కూర్చొని తల్లి పాదాలను నీటితో కడిగారు. అనంతరం ఆమె మోదీని ఆశీర్వదించారు.

Modi
భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ ఈ రోజు వందో వసంతంలోకి అడుగు పెట్టారు. ఆమె నేడు తన 100వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. కాగా.. తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆమెను కలిసేందుకు ఉదయాన్నే మోదీ అక్కడకు చేరుకున్నారు.
ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ప్రత్యేకంగా ఆశీర్వాదం తీసుకున్నారు. నేల మీద కూర్చొని తల్లి పాదాలను నీటితో కడిగారు. అనంతరం ఆమె మోదీని ఆశీర్వదించారు.
కొద్ది సేపు ఇంట్లోనే ఉన్న మోదీ, ఆ తర్వాత అక్కడి నుంచి మరో కార్యక్రమానికి వెళ్లిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. వారు జూన్ 17న ఇక్కడికి చేరుకున్నారు. వారం వ్యవధిలో మోదీ గుజరాత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు జూన్ 10న వచ్చాడు.
ఆ తర్వాత నవ్‌సారిలో 'గుజరాత్ గౌరవ్ అభియాన్' సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కాగా అంతకుముందు మార్చిలో మోదీ తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. అప్పుడు కూడా గాంధీనగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు.
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కు సంబంధించిన వార్తలు తరచుగా మీడియా మరియు సోషల్ మీడియాలో ముఖ్యాంశాలుగా ఉంటాయి. మార్చిలో, ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పుడు మోదీ ట్వీట్ చేస్తూ, "ఈ రోజు మా అమ్మ కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నట్లు తెలియజేయడానికి సంతోషంగా ఉంది" అని రాశారు.
మార్చిలో మోదీ తన తల్లి హీరాబెన్‌ను కూడా కలిశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్బుతమైన ప్రదర్శన కనబర్చిన తర్వాత మోదీ తన తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారు. అప్పుడు కూడా గాంధీనగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. మోదీ తన తల్లి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. కలిసి డిన్నర్ కూడా చేశారు. అనంతరం గుజరాత్‌లో రోడ్ షోలు, ఇతర కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు.
ప్రధాని మోదీ శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గాంధీనగర్‌లోని తన రైసన్ ఇంటికి చేరుకున్నారు. అరగంటకు పైగా తల్లి వద్దే ఉన్నారు. మోదీ తన తల్లికి ప్రత్యేక బహుమతిని కూడా ఇచ్చారు.మోదీ తల్లికి లడ్డూలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తల్లి హీరాబెన్ కోసం ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతిగా శాలువా తీసుకొచ్చారు. అది ఆమెకు బహుకరించారు. కాగా.. వీరి ఫోటోలు ఇఫ్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మోదీ తల్లికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని గాంధీనగర్‌లోని రైసన్‌లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైసన్ గ్రామం వైపు ఇంటికి వెళ్లే సమయంలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు.