MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • National
  • మహారాష్ట్రలోనూ పవన్ స్ట్రైక్ రేట్ అదిరిందిగా ... ఎంతుందో తెలుసా?

మహారాష్ట్రలోనూ పవన్ స్ట్రైక్ రేట్ అదిరిందిగా ... ఎంతుందో తెలుసా?

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ క్రేజ్ మామూలుగా లేదు. అక్కడ పలు నియోజకవర్గాల గెలుపోటములపై పవన్ ప్రభావం కనిపిస్తోంది. ఇంతకూ మహా ఎన్నికల్లో పవన్ స్ట్రైక్ రేట్ ఎంతుందో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 23 2024, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్ కల్యాణ్ క్రేజ్ మామూలుగా లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీని గెలిపించుకోవడమే కాదు టిడిపి, బిజెపి ల గెలుపులోనూ కీలక పాత్ర పోషించి కూటమికి అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ప్రదర్శనే కనబర్చి పాలిటిక్స్ లో కూడా తాను పవర్ స్టార్ నే అని నిరూపించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంను మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించుకుని మంచి రిజల్ట్ రాబట్టింది ఎన్డిఏ. మహాయుతి కూటమి తరపున తెలుగు ప్రజలు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో పవన్ ప్రచారం నిర్వహించారు. ఇలా పవన్ ప్రచారం చేపట్టిన అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయుతి కూటమి విజయం సాధించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
pawan kalyan

pawan kalyan

పవన్ ప్రచారం చేపట్టిన నియోజకవర్గాల పలితాలివే : 

పూణే కంటోన్మెంట్ : 

పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహాయుతి కూటమి తరపున బిజెపి అభ్యర్థి కాంబ్లే సునీల్ ద్యాన్ దేవ్ బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు ఎక్కువగా వుండటంతో పవన్ కల్యాణ్ ను ప్రచారంలోకి దించింది బిజెపి. ఈ ప్రభావం ఎన్నికలపై పడి బిజెపి 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

పూణే కంటోన్మెంట్ లో సునీల్ ద్యాన్ దేవ్ కు మొత్తం 76,032 ఓట్లు రాగా మహా వికాస్ అఘాడీ   తరపున పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ ఆనంద్ రావ్ కు కేవలం 65,712 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ తెలుగు ప్రజల ఓట్లు చాలా కీలకం... కాబట్టి పవన్ ప్రచారం బాగా పనిచేసిందనే చెప్పాలి. 

34
pawan kalyan

pawan kalyan

 బల్లార్ పూర్ : 

మహారాష్ట్రలోని బల్లార్ పూర్ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ బిజెపి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాజాగా వెలువడిన ఎన్నికల పలితాల్లో ఇక్కడ బిజెపి విజయం సాధించింది. మహాయుతి కూటమి తరపున పోటీచేసిన ముంగతివార్ సుధీర్ సచ్చిదానంద్ ఏకంగా 26,047 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు. ఆయనకు 1,04,975 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రావత్ సంతోష్ సింగ్ చందన్ సింగ్ కు 78,928 ఓట్లు వచ్చాయి. 

డెగ్లూర్ : 

మహారాష్ట్రలోని డెగ్లూర్ నియోజకవర్గంలో కూడా పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఇక్కడ కూడా మహాయుతి కూటమి తరపున పోటీచేసిన బిజెపి అభ్యర్థి అంతపూర్కర్ జితేష్ రావుసాహెబ్ విజయం సాధించారు. ఆయనకు మొత్తం 1,07,841 ఓట్లు పోలవగా మహా వికాస్ అఘాడి కూటమి తరపున పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి నివృత్తి కొండిబ కాంబ్లె సాంగ్వికర్ కి కేవలం 64,842 ఓట్లు వచ్చాయి. ఇలా ఏకంగా 42,999 ఓట్ల మెజారిటీతో విజయం బిజెపి విజయం సాధించింది. 

 

44
pawan kalyan

pawan kalyan

షోలాపూర్ : 

షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే విజయం సాధించారు. ఆయనకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహించారు. తాజా విజయం తర్వాత దేవేంద్ర మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ ప్రచారం తన విజయానికి ఎంతగానో దోహదపడిందని అన్నారు. తనకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

లాతూర్ : 

లాతూర్ లో కూడా పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. కానీ ఇక్కడ మిశ్రమ ఫలితం వచ్చింది. లాతూర్ సిటీలో బిజెపి అభ్యర్థి అర్చన పాటిల్ చకుర్కర్ పై అమిత్ విలాస్ రావు దేశ్ ముఖ్ విజయం సాధించారు. ఇక లాతూర్ రూరల్ లో మాత్రం బిజెపి అభ్యర్థి రమేష్ కాశీరాం కరద్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ విలాస్ రావు దేశ్ ముఖ్ ఓటమిపాలయ్యారు. 
 

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Recommended image2
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్
Recommended image3
ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved