ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్ .. ఫొటోస్ వైరల్
Raghav Chadha - Parineeti Chopra Engagement:బాలీవుడ్ నటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. శనివారం సాయంత్రం ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో జరిగింది. ఈ ఫంక్షన్‌కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Raghav Chadha - Parineeti Chopra Engagement
Raghav Chadha - Parineeti Chopra Engagement: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులగా వస్తున్న రూమర్లకు నేటీతో తెరపడింది. ఈ ప్రేమ జంట త్వరలోనే దంపతులు కానున్నారు. ఇందులో భాగంగానే నేడు నిశ్చితార్థం చేసుకోనున్నారు. వీరిద్దరి నిశ్చితార్థ వేడుక శనివారం సాయంత్రం ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో జరిగింది.
Raghav Chadha - Parineeti Chopra Engagement
parineeti chopraపరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఈ జంట నిశ్చితార్థ వేడుకకు 150 మంది అతిథులు హాజరవుతారని చెబుతున్నారు. ఈ జాబితాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. అదే సమయంలో ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ కూడా హజరయ్యారు.
Raghav Chadha - Parineeti Chopra Engagement
గత కొన్ని రోజులుగా రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్ వార్తలు వస్తున్నా.. వారు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఇప్పుడు నిశ్చితార్థం వల్ల ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని అంతా తేలిపోయింది. సినీ రాజకీయ వర్గాల ప్రకారం నిశ్చితార్థం తర్వాత పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం అక్టోబర్ లో చేసుకోనున్నారు.
Raghav Chadha - Parineeti Chopra Engagement
ఎంగేజ్‌మెంట్ అనంతరం రాఘవ్ చద్దాతో కలిసి ఉన్న ఫొటోను పరిణీతి చోప్రా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫోటోతో పాటు ‘నేను ప్రార్థించింతా.. అవునని చెప్పాను’ అంటూ క్యాప్షన్ పెట్టింది. వారి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఆ జంటకు అభిమానులు,సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈవెంట్‌కి మీడియాను అనుమతించలేదు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. త్వరలోనే వారిద్దరూ ఓ ఇంటి వారు కాబోతున్నారు.