- Home
- National
- Ban on Words: అరాచకం అంటే ఇదే.. అక్కడికి వెళ్లి ఐస్ క్రీమ్ అన్నారంటే అంతే సంగతులు, ఆంగ్ల పదాలపై నిషేధం
Ban on Words: అరాచకం అంటే ఇదే.. అక్కడికి వెళ్లి ఐస్ క్రీమ్ అన్నారంటే అంతే సంగతులు, ఆంగ్ల పదాలపై నిషేధం
ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్రూరమైన నియమాలు పెడుతూ ఉంటాడు. అలా ఇప్పుడు దేశంలో ఐస్ క్రీమ్ (Ice cream), హాంబర్గర్ లాంటి ఆంగ్ల పదాల వాడకంపై నిషేధం విధించారు. వాటిని వాడితే శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.

ఉత్తర కొరియా అధ్యక్షుడి అరాచకం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. అతడు తీసుకున్న నిర్ణయాలు చాలా వింతగా, కొన్ని సార్లు క్రూరంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఆంగ్ల పదాల వాడకాన్ని తగ్గించాలని ఆదేశించారు. ముఖ్యంగా తమ దేశంలో హాంబర్గర్, ఐస్ క్రీమ్, కరోకే లాంటి ఆంగ్ల పదాల వాడకంపై నిషేధం విధించారు. ఉత్తర కొరియా భాషను, దాని పదాలను ప్రోత్సహించాలని కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
టూరిస్ట్ గైడ్‌లకు తప్పనిసరి
ఉత్తర కొరియాను పర్యాటకుల కోసం ఓపెన్ చేశారు. దీని వల్ల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. అయితే పైన చెప్పిన ఇంగ్లిషు పదాలు మాత్రం వాడకూడదని కిమ్ ఆదేశించారు. ఇందుకోసం టూరిస్ట్ గైడ్ లను పిలిచి వారికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు.
"హాంబర్గర్" అనే పదానికి బదులుగా, “dahin-gogi gyeopppang” అనే పదాన్ని వాడాలి. "ఐస్ క్రీమ్" కోసం "eseukimo" అని, "కరోకే" మెషీన్‌లకు "ఆన్-స్క్రీన్ అకంపెనీమెంట్ మెషీన్స్" అనే పదాలు గైడ్‌లు ఉపయోగించాలి.
మరణ శిక్షే
ప్రభుత్వం ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహించి మరీ గైడ్‌లకు శిక్షణ ఇస్తున్నారు. అధికారికంగా ఆమోదించిన పదాలను, నినాదాలను మాత్రమే గౌడ్ లు ఉపయోగించాలి.
ఉత్తర కొరియాలో విదేశీ మీడియా వినియోగంపై అణచివేత ఎప్పట్నించో జరుగుతోంది. విదేశీ సినిమాలు, టీవీ సీరియల్స్ చూడటం అక్కడ నిషేధం. అలా చూస్తే తీవ్రమైన శిక్షలు పడతాయి. ఒక్కోసారి మరణశిక్ష కూడా పడే అవకాశం ఉంది.
ఐక్యరాజ్యసమితి ఆందోళన
ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం గత పదేళ్లలో ఉత్తర కొరియాలో విదేశీ భాష, మీడియాను పూర్తిగా అణచివేశారు. దక్షిణ కొరియాకు చెందిన సినిమాలు, డ్రామాలు, సంగీతం వంటివి చూడడం నేరం. ఎవరైనా ఆ సినిమాలు చూస్తూ పట్టుబడితే ఇంటికి వచ్చి సోదా చేస్తారు. బహిరంగ మరణ శిక్ష పడే ఛాన్స్ కూడా ఉందట.
ఇది అతి పెద్ద నేరం
2015లో ఒక చట్టం చేశాడు కిమ్. తమ శత్రు దేశాలకు చెందినవేవీ ఉత్తరకొరియా ప్రజలు వాడకూడదు. వారి సినిమాలు చూడకూడదు. అలా చూస్తే నేరంగా పరిగణిస్తూ ఉత్తర కొరియా ప్రభుత్వం చట్టం చేసింది. 2020 తర్వాత ఈ అణచివేతలు ఎక్కువైపోయాయి.