Gold Mines: ఏపీలోని జొన్నగిరి బంగారు గనుల్లో త్వరలో తవ్వకాలు, ఇక మనకు బంగారం కొరతే రాదు
మనదేశంలో బంగారానికి (Gold) ఎంతో విలువ ఉంది. ప్రతి ఏడాది భారత్ విదేశాల నుండి వెయ్యి టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి బంగారుగనుల్లో తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.

బంగారు గనులు
బంగారం పేరు చెబితేనే మహిళల మనసు పులకరించిపోతుంది. కనీసం ఏడాదికి ఏదో ఒక బంగారు వస్తువు కొనుక్కోకపోతే వారి మనసు ఆగదు. భారతదేశంలో బంగారం అంటే ప్రజలకు ఎంతో ఇష్టం. కాకపోతే మన అవసరాలకు తగ్గట్టు మన దేశంలో బంగారం లభించడం లేదు. దీని వల్ల విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. అందుకే బంగారం మరింత ఖరీదైనదిగా మారిపోయింది. మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది పెద్ద భారంగా పడుతుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరి బంగారుగని ప్రాజెక్టు మొదలవబోతోంది.
జొన్నగిరిలో బంగారు తవ్వకాలు
మన దేశానికి కావలసినంత బంగారం ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరి బంగారు గనులు అందిస్తాయని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుంది. జొన్నగిరి బంగారు గనుల్లో తవ్వకాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థకు బంగారు గనుల తవ్వకం పనులు అప్పగించారు. ఈ జొన్నగిరి బంగారుగనులు కర్నూలులోని తుగ్గలి మండలంలో ఉన్నాయి. జొన్నగిరి, పగడి రాయి, ఎర్రగుడి గ్రామాలకు దగ్గరలోనే ఈ బంగారు గనులను గుర్తించారు.
ఏడాదికి 750 కిలోల బంగారం
ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో మట్టిలో ఉన్న బంగారు ఖనిజాలను తీసి శుద్ధి చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో తవ్వకాలు మొదలవ్వలేదు. కొన్ని పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. అవి వస్తే అతి త్వరలోనే ఈ బంగారుగనిలో తవ్వకాలు మొదలవుతాయి. ఏడాదికి అతికి కనీసం 750 కిలోల బంగారాన్ని ఇక్కడి నుంచి తీయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
త్వరలో వెయ్యి కిలోలు బంగారం
మొదట ఏడాదికి 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసిన తర్వాత ఏటా ఆ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలని ఆలోచిస్తోంది. మూడు సంవత్సరాలలో ఈ ఉత్పత్తి 1000 కిలోలకి చేర్చాలని భావిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఏడాదికి ఒకటిన్నర టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది. కానీ ఇది మన అవసరాలను తీర్చలేక పోతోంది. అందుకే ఇప్పుడు జొన్నగిరి బంగారుగనుల్లో కూడా తవ్వకాలు మొదలయితే మనం విదేశాల నుంచి బంగారాన్ని కొనుక్కునే అవసరం ఉండదు. దీనివల్ల బంగారం తక్కువ ధరకే లభిస్తుంది కూడా.