- Home
- National
- Russia Ukraine Crisis: వార్ జోన్ నుంచి 800 మందిని సురక్షితంగా తీసుకొచ్చిన ఈ భారత పైలట్ గురించి తెలుసా?
Russia Ukraine Crisis: వార్ జోన్ నుంచి 800 మందిని సురక్షితంగా తీసుకొచ్చిన ఈ భారత పైలట్ గురించి తెలుసా?
Russia Ukraine Crisis: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో వేలాది మంది భారతీయులు వార్ జోన్ లోనే చిక్కుకుపోయారు. వారిని తీసుకురావడానికి భారత్ ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. అయితే, 800 మందికి పైగా భారత విద్యార్థులను వార్ జోన్ నుంచి సురక్షితంగా తీసుకువచ్చిన 24 ఏండ్ల భారత పైలట్ పై ప్రస్తుతం ప్రశంసలు జల్లు కురుస్తోంది.

కోల్‌కతా న్యూ టౌన్‌కు చెందిన 24 ఏండ్ల పైలట్‌మహాశ్వేతా చక్రవర్తి... ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ వార్ జోన్ పోలిష్, హంగేరియన్ సరిహద్దుల నుండి 800 మందికి పైగా భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత పౌరుల రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాలో గర్వించదగిన సభ్యురాలు మహాశ్వేతా చక్రవర్తి.
ఉక్రెయిన్ వార్ జోన్ నుంచి భారతీయులను తరలించడానికి చేపట్టిన ఆపరేషన్ గంగాలో భాగంగా ఫిబ్రవరి 27 మరియు మార్చి 7 మధ్య ఆరు తరలింపు విమానాలను నడిపారు. పోలాండ్ నుండి నాలుగు, హంగేరి నుండి రెండు విమానాలను ఆమె నడిపారు.
“ వార్ జోన్ నుంచి భారత పౌరులను తరలించడం జీవితకాల అనుభవం అని మహాశ్వేత చక్రవర్తి అన్నారు. మేము రక్షించిన వారిలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారనీ, వారిలో చాలా మంది ఆ టైంలో అనారోగ్యానికి గురై ఉన్నారని తెలిపారు. మనుగడ కోసం సాగిన అనేక బాధకరమైన కథలు అందులో ఉన్నాయని అన్నారు.
ఆమె ఆక్సిలియం కాన్వెంట్ పాఠశాల విద్యార్థి. మహాశ్వేత చక్రవర్తి.. తల్లిదండ్రుల ఏకైక సంతానం. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనుకునేదని తెలిపింది. గత నాలుగు సంవత్సరాలుగా ఓ ప్రయివేట్ ఇండియన్ క్యారియర్‌తో ముందుకు సాగుతున్నానని చెప్పింది.
"ఎయిర్‌లైన్ నుండి నాకు అర్థరాత్రి కాల్ వచ్చింది.. భారత పౌరుల రక్షణ కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ కు ఎంపిక చేసినట్టు చెప్పారని పేర్కొంది. “రెండు గంటల్లో అన్ని సర్దుకుని బయలుదేరాను. నేను పోలాండ్ నుండి రెండున్నర గంటల ఇస్తాంబుల్‌కి వెళ్లాను. అక్కడి నుండి రెస్క్యూ ఆపరేట్ చేయమని మాకు ఆదేశాలు అందాయని తెలిపింది.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత పౌరుల రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాలో గర్వించదగిన సభ్యురాలు మహాశ్వేతా చక్రవర్తి. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా లో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో వేలాది మంది భారతీయులు వార్ జోన్ లోనే చిక్కుకుపోయారు. వారిని తీసుకురావడానికి భారత్ ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. అయితే, ఏకంగా 800 మందికి పైగా భారత విద్యార్థులను వార్ జోన్ నుంచి సురక్షితంగా తీసుకువచ్చిన 24 ఏండ్ల భారత పైలట్ పై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి.