ఇన్ స్టాలో ఫ్రెండ్ షిప్.. కలుద్దామని పిలిచి మైనర్ పై అత్యాచారం...
ఇన్ స్టా గ్రాంలో మైనర్ బాలికతో స్నేహం చేసిన ఓ యువకుడు ఆమెను కలుద్దామని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నోయిడాలో వెలుగు చూసింది.

నోయిడా : ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం చేసి 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని హాపూర్ నివాసి జుబేర్ ఖాన్‌గా గుర్తించారు.
"జూన్ 6న ఓ టీనేజ్ బాలిక కనిపించకుండా పోయింది, ఆ తర్వాత వారు సెక్టార్ 39 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఐపీసీ సెక్షన్ 363కింద కేసు నమోదు చేయబడింది. అమ్మాయిని వెతకడానికి బృందాలను ఏర్పాటు చేశారు. ఆమె పోలీసులు కనిపెట్టిన తరువాత.. బుధవారం ఆమె కుటుంబం సభ్యులకు అప్పగించారు.
ఆ తరువాత ఆమె తల్లిదండ్రులతో తన మీద జరిగిన అత్యాచారాన్ని తెలిపింది. దీంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... అత్యాచారం సెక్షన్లు ఐపీసీ 376,పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్లు కూడా ఈ కేసుకు జోడించబడ్డాయి... అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. బొటానికల్ బస్టాండ్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 7 నుంచి అతడి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)