Viral News: వీడెవడండి బాబూ.. మటన్ షాప్ ముందు శవాన్ని పడేశాడు, ఎందుకో తెలుసా.?
సమాజంలో కొందరి ప్రవర్తన చూస్తే షాక్ కి గురి కావాల్సిందే. తాజాగా ఓ వ్యక్తి ఇలాగే విచిత్రంగా ప్రవర్తించి అందరినీ భయాందోళనకు గురి చేశాడు. శవాన్ని భుజాన వేసుకొని రచ్చ రచ్చ చేశాడు. ఇంతకీ అతను అలా ఎందుకు చేశాడంటే..

శవంతో షాపు ముందుకు
ప్రతీ రోజూ దేశంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఇట్టే వైరల్ అవుతున్నాయి. తమిళనాడులోని తేని అనే పట్టణంలో జరిగిన ఓ సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారన్న కారణంతో ఓ వ్యక్తి నీచమైన చర్యకు ఒడిగట్టాడు.
మటన్ కోసం గొడవ
తేని జిల్లాలోని పళనిశెట్టిపట్టికి చెందిన మణియరసన్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా సంగీత మటన్ స్టాల్ పేరుతో మటన్, చికెన్ షాపును నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన కుమార్ అనే ఓ వ్యక్తి ఏ పనిలేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దుకాణదారులను బెదిరిస్తూ, డబ్బులు దొంగలిస్తుండే వాడు. ఇందులో భాగంగానే తాజాగా మణియరసన్ షాపుకి వచ్చి డబ్బులు అడిగి బెదిరించాడు. మణియరసన్ కోపంతో డబ్బులు ఇవ్వనన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే శవాన్ని తెచ్చి దుకాణం ముందు పడేస్తా అంటూ బెదిరించాడు.
శవాన్ని షాపు ముందు పడేశాడు
దీంతో భయపడిన మణియరసన్ కొంత మొత్తంలో మటన్ బోటిని ఇచ్చాడు. డబ్బులు ఇవ్వమంటే బోటి ఇస్తావా అంటూ కుమార్ షాపు ముందు ఆ బోటీని పడేసి వెళ్లిపోయాడు. కొంత సేపటికి శ్మశానానికి వెళ్ళిన కుమార్ అక్కడ పాతిపెట్టిన శవాన్ని తవ్వి తలపై మోసుకొని వీధుల్లో తిరుగుతూ మణియరసన్ షాపు ముందు పడేశాడు. ఆదివారం కావడంతో మటన్ కొనడానికి జనం ఎక్కువగా ఉన్నారు. శవాన్ని చూసి అందరూ భయంతో పారిపోయారు.
అరెస్ట్ చేసిన పోలీసులు
ఫిర్యాదు అందుకున్న పోలీసులు శవాన్ని తీసుకెళ్లి తిరిగి శ్మశానంలో పాతిపెట్టారు. కుమార్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. డబ్బులు ఇవ్వలేదని స్మశానంలో శవాన్ని తవ్వి మటన్ షాపు ముందు పడేసిన ఘటనతో పళనిశెట్టిపట్టి లో కలకలం రేపింది. ఇక సోషల్ మీడియా ద్వారా ఈ వార్త దేశమంతా వైరల్ అయ్యింది.