వార్నీ.. మేక కన్ను వ్యక్తి ప్రాణాలు తీసింది.. ఎలాగంటే...
ఛత్తీస్‌గఢ్‌లో 50 ఏళ్ల వ్యక్తి వండిన మాంసంలోని మేక కన్ను తినడానికి నోట్లో వేసుకోగా.. అది గొంతులోకి జారి..అతనిని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో అతను మృతి చెందాడు.

చత్తీస్ ఘడ్ : మృత్యువు ఎప్పుడు.. ఎవరిని.. ఎలా.. పలకరిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. అప్పటివరకు ఎంతో సంతోషంగా నవ్వుతూ తుళ్లుతూ ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కనిపించని లోకాలకు వెళ్ళిపోతుంటారు. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు షాక్ కు గురవడం మామూలే.
అలాంటిది మరీ విచిత్రమైన సందర్భంలో మరణిస్తే.. అరే అని ఆశ్చర్యపోవాలో... చనిపోయినందుకు బాధ పడాలో తెలియని పరిస్థితుల్లో పడుతుంటాం. అలాంటి ఓ విచిత్రమైన ఘటన ఛత్తీస్గఢ్లోని సూరజ్ పూర్ లో జరిగింది. ఛత్తీస్గఢ్లోని సూరజ్ జిల్లాలో మేక కన్ను ఓ మనిషి ప్రాణాలు తీసింది.
ఆశ్చర్యంగా ఉందా.. ఇది నిజంగా జరిగిన ఘటన. మేక కన్ను గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి ఊపిరాడక మృతి చెందాడు. అదెలాగో తెలియక తికమకపడుతున్నారా?
ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే… చత్తీస్గడ్ సూరజ్ పూర్ జిల్లాలోని కోపాధామ్ లో ఓ వ్యక్తి అక్కడి దేవుడికి తన మొక్కులు చెల్లించుకుని మేకలను కోశాడు. వాటితో వంటకాలు చేసి స్నేహితులు, బంధువులకు భోజనాలు పెట్టాడు. ఆ తర్వాత తాను కూడా తినే సమయంలో.. మేక కన్ను తిన్నాడు.
ఆ సమయంలో అది కాస్తా అతడి గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. దీంతో అది ఎంత ప్రయత్నించినా బైటికి రాక.. ఊపిరాడక మృతి చెందాడు. సూరజ్ పూర్ జిల్లాలోని మదన్పూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి బగార్ రాయ్. మొక్కులు చెల్లించుకోవడం కోసం కోపాథామ్ వెళ్ళాడు. అక్కడ పూజలు చేసిన తర్వాత తన మొక్కు ప్రకారం మేకను దేవతకు బలి ఇచ్చాడు.
ఆ మేక మాంసంతో గ్రామస్తులకు భోజనం పెట్టాడు. ఈ క్రమంలోనే తానూ తింటూ మేకకన్నును నోట్లో వేసుకున్నాడు.. అంతే అది కాస్తా గొంతులో ఇరుక్కోవడంతో.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి.. ఆస్పత్రికి వచ్చేసరికే మృతి చెందాడు. దీంతో వారు షాక్ కు గురయ్యారు.