మోడీపట్ల మమత మెత్తబడినట్లేనా, బెంగాల్‌లో రాజకీయం మారుతుందా

First Published 19, Sep 2019, 4:40 PM

ప్రధాని మోడీ తొలివిడత అధికారంలో ఉన్న సమయంలో ఆయనను ఎదుర్కొని నిలిచారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. శారద స్కాంలో టీఎంసీ నేతలను ఇరుకున పెట్టాలని చూసినా, కోల్‌కతా మాజీ పోలీస్  కమీషనర్ రాజీవ్‌ను అరెస్ట్ చేయాలని చూసిన దీదీ బెదరలేదు

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో విపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. బెంగాల్‌లో భారీ ఎత్తున సభలను నిర్వహించారు. బీజేపీ ర్యాలీలు, ధర్నాలకు రాష్ట్రంలో అనుమతి ఇవ్వలేదు. తనతో కలిసొచ్చే నేతలతో ప్రధాని పీఠాన్ని టార్గెట్ చేశారు మమత

బీజేపీపై అలుపెరగని పోరాటం చేస్తున్న క్రమంలో నరేంద్రమోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడితే కనీసం ఆయనను అభినందించలేదు. అక్కడితో ఆగకుండా బంపర్ మెజారిటీతో గెలిస్తే నాకేంటి నేను మాత్రం మోడీని తిడతాను అన్నట్లు మమత వ్యవహరించారు.

మోడీ పాలనను దీదీ ఎండగడుతుండటంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు. బెంగాల్ సీఎం పీఠానికి మరో రెండేళ్లలో మమత నుంచి విముక్తి వస్తుందని వారు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అమిత్ షా బెంగాల్‌లో పాగా వేయడానికి పావులు కదుపుతున్నారు. కేంద్రంలో  అధికారంలో ఉండటం దానికి తోడు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో భారీగా సీట్లు కైవసం చేసుకుని వున్న బీజేపీని ఎదుర్కోవాలని మమత గట్టిగా నిర్ణయించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ సాయం కోరారు.

కలకత్తా కాళీలా బీజేపీ ప్రభంజనాన్ని ఎదుర్కొంటారని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో మమతా బెనర్జీ ఒక్కసారిగా ప్రధాని నివాసంలో ప్రత్యక్షమయ్యారు. మోడీ బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పి.. కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించి సంచలనానికి తెరలేపారు.

అక్కడితో ఆగకుండా గురువారం బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ షా ద్వయానికి దీదీ లొంగిపోయారని.. శారదా స్కాం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్‌ను కాపాడటానికే మమతా బెనర్జీ తన స్టాండ్ మార్చుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

loader