Lok Sabha Elections 2024 : ఫస్ట్ ఫేజ్ పోలింగ్ షురూ... పోటీలో వున్న ప్రముఖులు వీళ్లే...
2024 లోక్ సభ ఎన్నికల్లో కీలక ప్రక్రియ ప్రారంభం అయ్యింది. దక్షిణ భారతదేశంలో కీలకమైన తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. ఫేజ్ 1 పోటీలొ నిలిచిన ప్రముఖులు వీళ్లే....
voters
లోక్ సభ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ షురూ అయ్యింది. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. అందులో భాగంగానే ఫస్ట్ ఫేజ్ లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఇవాళ (శుక్రవారం) పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ఉదయమే తమ ఓటుహక్కును వినియోగించుకునేందు ప్రజలు పోలింగ్ కేంద్రాలను తరలివెళుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 16 కోట్లకు పైగా ఓటర్లు 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
Polling
అయితే ఈ ఫస్ట్ ఫేజ్ లోక్ సభ పోలింగ్ లో పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్ తో పాటు ఎనిమిది మంది కేంద్ర మంత్రులు పోటీలో వున్నారు. వీరందరి భవితవ్యం ఇవాళ ఈవిఎం మిషన్లలో నిక్షిప్తం కానుంది. ప్రజా తీర్పు ఎలావుందో జూన్ 4న వెలువడే లోక్ సభ ఫలితాల్లో తేలనుంది.
ఫస్ట్ ఫేజ్ పోటీలో వున్న ప్రముఖులు :
నితిన్ గడ్కరి
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రుల్లో నితీన్ గడ్కరి ఒకరు. ప్రస్తుతం ఈయన రోడ్డు రవాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోక్ సభ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా నాగ్ పూర్ నుండే పోటీచేస్తున్న ఆయన హ్యాట్రిక్ విజయంపై కన్నేసారు. నాగ్ పూర్ లో ఇవాళే పోలింగ్ జరుగుతోంది.
Kiren rijiju
కిరణ్ రిజిజు
అరుణాచల్ ప్రదేశ్ లోని రెండు లోక్ సభ స్థానాల్లో మొదటి ఫేజ్ లోననే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో అరుణాచల్ వెస్ట్ నుండి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పోటీ చేస్తున్నారు. ఇక్కడినుండి మూడుసార్లు ఎంపీగా గెలిచారు రిజిజు. ఆయనపై మాజీ సీఎం, అరుణాచల్ కాంగ్రెస్ అధ్యక్షుడు నబమ్ టుకీ పోటీ చేస్తున్నారు.
sarbananda sonowal
సర్బానంద్ సోనోవాల్
అస్సాం మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బనంద సోనోవాల్ డిబ్రూగర్ లోక్ సభ నుండి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా వున్న సోనోవాల్ కు మరో కేంద్ర మంత్రి రామేశ్వర్ టెలీ ని తప్పించిమరి డిబ్రూగర్ పోటీలో నిలిపింది బిజెపి. మరి ఇవాళ జరిగే పోలింగ్ లో ప్రజాలు ఎలా తీర్పు ఇస్తారో చూడాలి.
sanjeev baliyan
సంజీవ్ బలియాన్
కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్ పోటీచేస్తున్న ముజప్పర్ నగర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ హిందూ ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగుతుంటాయి. సమస్యాత్మకమైన ఈ లోక్ సభలో కూడా ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
Jitender Singh
జితేందర్ సింగ్
ఉదంపూర్ లోక్ సభ నుండి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఉదంపూర్ నుండి పోటీచేసి గెలిచిన ఆయన ఈసారి హ్యాట్రిక్ విజయంపై కన్నేసారు.
Bhupender Yadav
భూపేంద్ర యాదవ్
రాజ్యసభ ఎంపీగా వున్న కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన అల్వార్ నుండి మొదటిసారి ఎంపీగా పోటీచేస్తున్నారు.
Union Minister Arjunram
అర్జున్ రాం మేఘావాల్
బికనేర్ లోక్ సభ నుండి కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘావల్ పోటీ చేస్తున్నారు. మాజీ కాంగ్రెస్ మంత్రి గోవింద్ రామ్ మేఘావల్ ఆయనకు పోటీగా నిలిచారు. ఇక్కడ కూడా ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
L Murugan
ఎల్ మురుగన్
తమిళనాడుకు చెందిన ఎల్ మురుగన్ ప్రస్తుతం మధ్య ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ మోదీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. అయితే ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆయన మాజీ కేంద్ర మంత్రి ఏ రాజాపై నీలగిరి లోక్ సభ నుండి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మురుగన్ మొదటిసారి పోటీ చేస్తున్నారు.
Karthi chidambaram
కార్తీ చిందంబరం
తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుండి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుండి చిదంబరం ఏడుసార్లు ఎంపీగా గెలిచారు,
k annamalai
అన్నామలై
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు అన్నామలై. ద్రవిడ రాజకీయాలకు దీటుగా ఎదుర్కొంటూ బిజెపిని బలోపేతం చేస్తున్నారు తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై. ఆయన కోయంబత్తూరు లోక్ సభ నుండి పోటీ చేస్తున్నారు.
Tamilisai
తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ లోక్ సభ నుండి పోటీ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల కోసమే ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేసారు.
biplav dev
విప్లవ్ దేవ్ కుమార్
త్రిపుర మాజీ సీఎం విప్లవ్ దేవ్ ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిష్ కుమార్ సాహా నిలిచారు. వీరిద్దరు వెస్ట్ త్రిపుర నుండి బరిలోకి దిగారు.