మీకు ఫ్రీగా రూ.5 లక్షలు కావాలా ... అయితే ఇలా చేయండి
Union Budget 2025 : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2025-26 లో రైతుల, సామాన్యులపై వరాలు కురిపించింది. రైతులకు పెట్టుబడి లేదా ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఏకంగా రూ.5 లక్షలు ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరి ఈ డబ్బులు ఎలా పొందాలంటే...

Kisan Credit Card
Kisan Credit Card : రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ 2025-26 దేశ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది మోదీ 3.O సర్కార్. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశ రైతాంగానికి తీపికబురు చెప్పారు.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది. అందులో ఒకటి ఈ కిసాన్ క్రెడిట్ స్కీం... రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు బ్యాంకుల ద్వారా దీన్ని అమలు చేస్తున్నారు. అయితే తాజా బడ్జెట్ లో రైతులకు ఈ KCC పథకం ద్వారా మరింత లబ్దిని చేకూర్చే ఏర్పాటుచేసింది మోదీ సర్కార్. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేసారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రైతులు, పాడిరైతులు, మత్స్యకారులకు బ్యాంకుల ద్వారా షార్ట్ టర్మ్ లోన్స్ అందిస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ.3 లక్షల వరకు షార్ట్ టర్మ్ లోన్స్ అందించేవారు. దీన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 7.7 కోట్లమంది రైతులు లబ్ది పొందనున్నారు. ఈ లోన్ వడ్డీని కూడా మరింత తగ్గించి రైతులకు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇలా దేశ రైతాంగానికి బడ్జెట్ 2025 ద్వారా గుడ్ న్యూస్ వినిపించింది.
ఏమిటీ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం :
క్రెడిట్ కార్డ్ మనందరికీ సుపరిచితమే. ఈ కార్డు ద్వారా మనకు ముందుగానే డబ్బులిచ్చి తర్వాత వాటిని వసూలు చేసుకుంటాయి బ్యాంకులు. సేమ్ టు సేమ్ అలాంటిదే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం. బ్యాంకుల ద్వారా రైతులకు సాగు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల ద్వారా డబ్బులు పొందవచ్చు. తర్వాత అతి తక్కువ వడ్డీతో ఆ డబ్బులను తిరిగి చెల్లించవచ్చు.
రైతుల ఆర్థిక అవసరాల కోసం 1998 లోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.మారుతున్న పరిస్థితులకు అనుగునంగా ఈ పథకాన్ని కూడా మారుస్తూ వస్తున్నారు. ఈ కార్డ్ కలిగిన రైతులకు భీమా సదుపాయం కూడా కల్పించారు. ఇలా రైతులకు ఉపయోగపడుతున్న ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ విషయంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Kisan Credit Card
రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలి?
కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్నిఅమలుచేస్తోంది. కాబట్టి ప్రభుత్వ బ్యాంకుల్లోనే కాదు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ కార్డును పొందవచ్చు. ఏ బ్యాంక్ లో అయితే అకౌంట్ కలిగివుంటారో అక్కడ ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను రైతులు పొందవచ్చు. రైతుల బ్యాంకును సందర్శించి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
18 ఏళ్ల నుండి 75 ఏళ్లలోపు వయసు కలిగినవారు ఈ కార్డును పొందడానికి అర్హులు. బ్యాంకును బట్టి మనం తీసుకునే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలకు వడ్డీ వుంటుంది. గరిష్టంగా ఐదేళ్లలోపు తీసుకున్న రుణం తిరిగి చెల్లించే అవకాశం వుంటుంది. ఇప్పటివరకు కేవలం రూ.3 లక్షల వరకే రుణం తీసుకునే అవకాశం వుండేది... దీన్నే తాజాగా రూ.5 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.