'ది కేరళ స్టోరీ’ వివాదం : కథ వాస్తవమని ఆధారాలతో నిరూపిస్తే రూ. కోటి బహుమతి..
పి.కె. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, ఐయుఎంఎల్ యువజన విభాగం ముస్లిం యూత్ లీగ్ చీఫ్ ఫిరోజ్ 'ది కేరళ స్టోరీ’ కథాంశం వాస్తవమైనదని రుజువు చేస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు.

త్వరలో విడుదల కాబోతున్న చిత్రం "ది కేరళ స్టోరీ" చుట్టూ వివాదాలు ముసురుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ రాష్ట్ర పార్టీ యువజన విభాగం, వేరే ఇద్దరు వ్యక్తులు విడివిడిగా ప్రేక్షకులకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు.
ది కేరళ స్టోరీ కథాంశం సరైనదని రుజువు చేయగలిగితే.. దానికి సరైన ఆధారాలు చూపించి నిరూపించిన వారికి వారికి నగదు బహుమతులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మే 5న విడుదల కానున్న అదా శర్మ నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. దీని చుట్టూ ఇప్పటికే చాలా వివాదాలు ముసురుకున్నాయి.
కేరళలో సుమారు 32,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని పేర్కొంది. ఈ కేరళ మహిళలకు బ్రెయిన్‌వాష్ చేసి, మతం మార్చి, భారతదేశం, విదేశాలలో టెర్రర్ మిషన్ల కోసం పంపబడ్డారనేది సారాంశం.
ఈ నేపథ్యంలోనే పి.కె. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, ఐయుఎంఎల్ యువజన విభాగం ముస్లిం యూత్ లీగ్ చీఫ్ ఫిరోజ్ మాట్లాడుతూ, సినిమా తీసిన వారు కథాంశం సరైనదని రుజువు చేస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు.
కె. నజీర్ హుస్సేన్ అనే బ్లాగర్ కూడా ఇలాంటి ప్రకటనే చేశాడు. ‘మహిళలను మతమార్పిడి చేసి బలవంతంగా ఇస్లామిక్ స్టేట్‌లో చేర్చుకున్నట్లు ఆధారాలు చూపితే వారికి రూ.10 లక్షలు ఇస్తానని’ ఆయన ప్రకటించారు.
న్యాయవాది, నటుడు షుకూర్ ఫేస్‌బుక్‌లో "మత మార్పిడి జరిగి, ఆ తరువాత ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన కేరళ మహిళల పేర్లు చెబితే వారికి రూ. 11 లక్షలు ఇస్తాను" అని చెప్పుకొచ్చారు.
ఈ సినిమా టీజర్ విడుదలైన వెంటనే అధికార సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు, యూడీఎఫ్‌లు సినిమాను ప్రదర్శించరాదని డిమాండ్ చేశాయి.
‘ది కేరళ స్టోరీ’ తెరకెక్కితే ప్రజలు బహిష్కరించాలని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ అన్నారు. దీనిమీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు.
ఇది ఇస్లామిక్ స్టేట్‌లో భాగమైన కేరళలోని నలుగురు మహిళా కళాశాల విద్యార్థుల ప్రయాణాన్ని చెబుతుంది. ఈ చిత్రంలో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ కూడా నటించారు. దీనిని విపుల్ అమృత్‌లాల్ షా.ఐక్ నిర్మించారు
ఇది ఇస్లామిక్ స్టేట్‌లో భాగమైన కేరళలోని నలుగురు మహిళా కళాశాల విద్యార్థుల ప్రయాణాన్ని చెబుతుంది. ఈ చిత్రంలో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ కూడా నటించారు. దీనిని విపుల్ అమృత్‌లాల్ షా.ఐక్ నిర్మించారు