షఫీ ఆటకట్టు : కేరళ నరబలి వెలుగు చూసిన వైనం ఇదీ...
ఆమె దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను సమాధి చేశారని సిపి నాగరాజు చెప్పారు. ఆర్థిక ప్రయోజనం కోసం మహిళను బలి ఇచ్చారని దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో జరిగిన నరబలి సంఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ సంఘటన ఎలా వెలుగు చూసిందనేది కూడా ఆశ్చర్యకరంగానే ఉంది.
kerala human sacrifice
నరబలికి గురైన పద్మ మిస్సింగ్ కేసు ద్వారా ఈ సంఘటన వెలుగు చూసింది. తన సోదరి కనిపించడం లేదంటూ పద్మ సోదరి పలినియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాంతో పోలీసులు పద్మ ఫోన్ ను ట్రాక్ చేశారు. ఎలంతూరు సమీపంలో సిగ్నల్స్ వచ్చాయి. దీంతో ప్రధాన నిందితుడు మొహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ ను పోలీసులు పట్టుకున్నారు.
kerala
షఫీని పట్టుకుని పోలీసులు ప్రశ్నించారు. పోలీసు విచారణలో బోరున ఏడ్చేస్తూ అసలు విషయం చెప్పాడు. కనిపించుకుండా పోయిన కడవంతారా (ఎర్నాకులం)కు చెందిన పద్మ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తుండగా ఆమెను తిరువల్లలోని దంపతులు భగవాల్ సింగ్, అతని భార్య లైలా ఇంట్లో చంపేశారని తేలినట్లు కొచ్చి నగర పోలీసు కమీషనర్ నాగరాజు చకిలం చెప్పారు.
ఆమె దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను సమాధి చేశారని ఆయన చెప్పారు. ఆర్థిక ప్రయోజనం కోసం మహిళను బలి ఇచ్చారని దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.
దాంతో పోలీసులు భగవాల్ సింగథ్, ఆయన భార్య లైలాను కూడా విచారించారు. జూన్ నెలలో మరో మహిళ రోస్లీని కూడా బలి ఇచ్చినట్లు విచారణలో వాళ్లు వెల్లడించారు. ఈ సంఘటల్లో మధ్యవర్తులు కూడా ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. వారికి కూడా డబ్బులు చెల్లించారని అన్నారు.
ఈ కేసులోని ప్రధాన నిందితుడు షఫీ ఇటువంటి ఆఘాయిత్యాలను ఇతర ప్రాంతాల్లో కూడా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్నట్లు నాగరాజు చెప్పారు.