MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • వయనాడ్ వరద విధ్వంసం: సెల్ఫీలు తీసుకోవడంపైనా నిషేధం.. 10 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

వయనాడ్ వరద విధ్వంసం: సెల్ఫీలు తీసుకోవడంపైనా నిషేధం.. 10 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

కేరళలో తీవ్రమైన వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా 10 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భద్రతా కారణాలతో సెల్ఫీలు తీసుకోవడం, ఆట స్థలాల్లో ఆడటంపై నిషేధం విధించారు.

2 Min read
Galam Venkata Rao
Published : Aug 01 2024, 08:58 AM IST| Updated : Aug 01 2024, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Wayanad Landslides

Wayanad Landslides

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం నెలకొంది. వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, మృతుల సంఖ్య 260 దాటింది. గల్లంతైన వందలాది మంది జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అయితే, కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. 

210
Kerala schools, College holidays

Kerala schools, College holidays

భారీ వర్షాల కారణంగా కేరళలోని 10 జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇడుక్కి, ఎర్నాకులం, పతనంతిట్ట, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, త్రిసూర్, కాసరగోడ్, కన్నూర్ జిల్లాల్లో కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ప్రొఫెషనల్ కాలేజీల కూడా సెలవులిచ్చేశారు. 

310
Kerala schools, College holidays

Kerala schools, College holidays

మరోవైపు రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది.

410
Kerala schools, College holidays

Kerala schools, College holidays

ఆగస్టు 2న కోజికోడ్‌, వాయనాడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను కూడా కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తక్కువ సమయంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... ఇది ఆకస్మిక వరదలకు కారణం కావచ్చని తెలిపింది. దీంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని... ప్రజలు, ప్రభుత్వ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

510
Kerala schools, College holidays

Kerala schools, College holidays

పతనంతిట్ట జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, ప్రొఫెషనల్ కాలేజీల నుంచి అంగన్‌వాడీల వరకు అన్ని ట్యూషన్ సెంటర్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. అయితే, జిల్లాలో ప్రీ షెడ్యూల్డ్ యూనివర్సిటీ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు.

610
Kerala schools, College holidays

Kerala schools, College holidays

ఇడుక్కి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, గాలుల కారణంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రొఫెషనల్ కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సెంట్రల్ స్కూల్స్, CBSE, ICSE స్కూల్స్, అంగన్‌వాడీలు, నర్సరీలు, మదర్సాలు, కిండర్ గార్టెన్‌లకు కూడా సెలవులిచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యూషన్ సెంటర్లు పనిచేయకూడదని అధికారులు ఆదేశించారు. 

710
Kerala schools, College holidays

Kerala schools, College holidays

ఎర్నాకులం జిల్లాలో అంగన్‌వాడీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ప్రైవేట్ ట్యూషన్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పాలక్కాడ్ జిల్లాలోని ప్రొఫెషనల్ కాలేజీలు, అంగన్‌వాడీలు, కిండర్ గార్టెన్‌లు, మదర్సాలు, ట్యూషన్ సెంటర్‌లతో సహా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రీ షెడ్యూల్డ్ పబ్లిక్ పరీక్షలు, రెసిడెన్షియల్ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, నవోదయ విద్యాలయాలకు సెలవు వర్తించదు.

810
Ban on selfies and video filming

Ban on selfies and video filming

భద్రతా కారణాల దృష్ట్యా, పిల్లలు కొన్ని రోజుల పాటు టర్ఫ్‌లు, ఇతర ఆట స్థలాలపై ఆడటం, సెల్ఫీలు తీసుకోవడం, వంతెనలు, నీటి వనరుల దగ్గర వీడియోలు చిత్రీకరించడం మానుకోవాలని అధికారులు హెచ్చరించారు.

910
Kerala schools, College holidays

Kerala schools, College holidays

మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, త్రిసూర్, కాసరగోడ్, కన్నూర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. అన్ని జిల్లాలు, ప్రొఫెషనల్ కాలేజీలకు కూడా సెలవులిచ్చారు. అయితే, వయనాడ్‌లోని రెసిడెన్షియల్ పాఠశాలలకు సెలవు వర్తించదు. కన్నూరులో గతంలో నిర్వహించాల్సిన పబ్లిక్ పరీక్షలు, యూనివర్సిటీ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. కాసరగోడ్ జిల్లాలోని CBSE, ICSC, కేంద్రీయ విద్యాలయాలకు కూడా సెలవు ప్రకటించారు.

1010
kerala school

kerala school

త్రిస్సూర్ జిల్లాలో భారీ వర్షం, గాలులు కొనసాగుతున్నందున సెలవు ప్రకటించారు. చాలా పాఠశాలలు సహాయక శిబిరాలుగా పనిచేస్తున్నాయి. నర్సరీలు, సెంట్రల్ స్కూల్స్, CBSE మరియు ICSE స్కూల్స్, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్‌లతో సహా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులందరూ ఉండి చదువుకునే హాస్టల్‌తో కూడిన విద్యా సంస్థలకు సెలవు వర్తించదు. ప్రీ షెడ్యూల్డ్ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఎటువంటి మార్పు ఉండదు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
Recommended image2
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
Recommended image3
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved