కచ్చా బాదం గాయకుడికి ప్రమాదం.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే...
కచ్చా బాదం పాటతో ఓవర్నైట్ స్టార్ గా.. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన గాయకుడు భుబన్ బద్యాకర్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఛాతిలో గాయంలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

kacha badam
సోషల్ మీడియా సంచలనం.. కచ్చా బాదం పాట గాయకుడు ప్రమాదానికి గురయ్యాడు. ఆ పాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఇంటర్నెట్ సంచలనం భుబన్ బద్యాకర్ ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని ఆసుపత్రిలో చేరాడు. వివరాల ప్రకారం.. బద్యాకర్ ఇటీవల కొత్త కారు కొనుక్కున్నాడు. బెంగాల్ లోని తన గ్రామంలో కారు నేర్చుకుంటుండగా కారు ప్రమాదానికి గురయ్యాడు.
ఈ ప్రమాదంలో భుబన్ బద్యాకర్ ఛాతిలో గాయం కావడంతో వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. బద్యాకర్ ఇటీవలే సెకండ్ హ్యాండ్ కారును కొన్నాడు. డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బద్యాకర్ ఇటీవల ఒక సింగింగ్ రియాలిటీ షోకి హాజరయిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని ప్రముఖ పబ్‌లో కూడా వైరల్ గా మారిన తన పాటను ప్రదర్శించాడు.
భుబన్ బద్యాకర్ వెస్ట్ బెంగాల్ లోని కురల్జూరి అనే గ్రామంలో వీధుల్లో తిరుగుతూ పాత సామానుకు వేరుశనగలు(కచ్చా బాదం) అమ్మేవాడు. తన పాట వైరల్ కావడం.. తనకు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ కారణంగా.. అతనిప్పుడు సంగీత ప్రపంచంలో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. దీనికోసం వేరుశెనగ అమ్మడం మానేయాలని నిర్ణయించుకున్నాడు.
భుబన్ బద్యాకర్ వెస్ట్ బెంగాల్ లోని కురల్జూరి అనే గ్రామంలో వీధుల్లో తిరుగుతూ పాత సామానుకు వేరుశనగలు(కచ్చా బాదం) అమ్మేవాడు. తన పాట వైరల్ కావడం.. తనకు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ కారణంగా.. అతనిప్పుడు సంగీత ప్రపంచంలో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. దీనికోసం వేరుశెనగ అమ్మడం మానేయాలని నిర్ణయించుకున్నాడు.
సోషల్ మీడియాలో ఓవర్నైట్ స్టార్ గా మారిపోయాడు భుబన్. ఇప్పుడు ఈ పాట బేస్ గా ఎన్నో రీల్స్, వీడియోలు వస్తున్నాయి. ఎంతో మంది ప్రముఖులు ఆయన పాటను మెచ్చుకుని.. మద్దతు ఇస్తున్నారు.
kacha badam
రీమిక్స్ అయిన ఇతని పాటకు యూట్యూబ్‌లో 50 మిలియన్లకు పైగా వీక్షణలు ఉన్నాయి. భుబన్ బద్యాకర్ పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా లక్ష్మీనారాయణపూర్ పంచాయతీలోని కురల్జూరి గ్రామంలోని దుబ్రాజ్‌పూర్ బ్లాక్‌లో నివసిస్తాడు.
ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పాత సామాన్లు, పనికిరాని ఇనుప, విరిగిపోయిన వస్తువులకు వేరుశెనగలను విక్రయిస్తాడు. ఇలా రోజుకు రూ.200-250 సంపాదిస్తున్నాడు. భుబన్ బద్యాకర్‌ను ఇటీవల పశ్చిమ బెంగాల్ పోలీసులు కూడా సత్కరించారు.