MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మళ్లీ IRCTC సేవలకు అంతరాయం : అత్యవసరం అయితే ఈ నెంబర్లకు కాల్ చేయండి

మళ్లీ IRCTC సేవలకు అంతరాయం : అత్యవసరం అయితే ఈ నెంబర్లకు కాల్ చేయండి

IRCTC సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం ఈ వెబ్ సైట్ తో పాటు యాప్ కూడా పనిచేయకపోవడంతో రైల్వే టికెట్స్ కోసం ప్రయత్నించేవారు ఇబ్బందిపడుతున్నారు. కాబట్టి అత్యవసర సహాయం కోసం ఏం చేయాలో తెలుసుకొండి. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Dec 31 2024, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
IRCTC

IRCTC

ఇండియన్ రైల్వే బుకింగ్స్ వెబ్ సైట్, యాప్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) రైల్వే టికెట్ బుకింగ్స్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అయితే ఈ డిసెంబర్ 2024 లో ఇప్పటికే రెండుసార్లు ఆ ఐఆర్ సిటిసి సేవలు నిలిచిపోయాయి. తాజాగా ఇవాళ (డిసెంబర్ 31) ఉదయం మరోసారి ఇదే జరిగింది.
 
ఇవాళ రైల్వే తత్కాల్ బుకింగ్స్ ఓపెనింగ్ కు సరిగ్గా పదినిమిషాల ముందు IRCTC వెబ్ సైట్, యాప్ పనిచేయడం ఆగిపోయింది. ఉదయం 9.50 గంటలకు ఈ అంతరాయం ఏర్నడింది. ఐఆర్ సిటిసి వెబ్ సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినవారికి ''బుకింగ్ ఆండ్ క్యాన్సలేషన్ వంటి సేవలు మరో గంటసేపటి వరకు అందుబాటులో వుండవు. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. అయితే టికెట్ క్యాన్సలేషన్, టిడిఆర్ ఫైల్ చేయడానికి కస్టమర్ కేర్ నంబర్ 14646,08044647999 లేదా 08035734999కు కాల్ చేయండి.లేదా etickets@irctc.in కు మెయిల్ చేయండి'' అని సూచిస్తోంది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
IRCTC

IRCTC

IRCTC పనితీరు ఇంత దారుణమా!

న్యూ ఇయర్ నేపథ్యంలో రేపు (బుధవారం) తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో సెలవు వుంది. దీంతో న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన ప్రజలు ప్రయాణాలు పెట్టుకున్నారు.  ఇలాంటి సమయంలో రైల్వే టికెట్ బుకింగ్స్ వెబ్ సైట్, యాప్ IRCTC పనిచేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రైల్వేను, IRCTC నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  

డౌన్ డిటెక్టర్ ప్రకారం... ఐఆర్ సిటిసి వెబ్ సైట్ ను దాదాపు 47 శాతం ఉపయోగించలేకపోతున్నారు. ఇక 42 శాతం వినియోగదారులు యాప్ లో సమస్య ఎదుర్కొంటున్నారు. 10 శాతం మంది టికెట్ బుకింగ్ పూర్తి చేయలేకపోతున్నారు. ఇలా ఐఆర్ సిటిసి వెబ్ సైట్, యాప్ పనితీరు అత్యంత దారుణంగా వుందని తెలుస్తోంది. 
 

33
IRCTC

IRCTC

పదేపదే IRCTC వెబ్ సైట్, యాప్ ఎందుకు పనిచేయడం లేదు? 

ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ యాప్, వెబ్ సైట్ IRCTC సేవలకు పదేపదే అంతరాయం కలగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా ఒకటిరెండు సార్లు కాదు ప్రతిసారీ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించే వినియోగదారులకు సమస్యే ఎదురవుతోంది. కేవలం ఈ ఒక్క నెలలోనే (డిసెంబర్ 2024) ఇలా ఐఆర్ సిటిసి పనిచేయకపోవడం ఇది మూడోసారి. దీన్నిబట్టే దీని పనితీరు ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. 

అయితే ఐఆర్ సిటిసి వెబ్ సైట్, యాప్ ప్రతిసారి సరిగ్గా తత్కాల్ టికెట్ విడుదల సమయంలోనే పనిచేకపోవడంపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.  'ప్రతిరోజు ఉదయం 10 గంటలకు IRCTC వెబ్ సైట్ పనిచేయదు. మళ్లీ ఓపెన్ చేయగానే తత్కాల్ టికెట్స్ అన్ని బుక్ అయిపోతాయి. కేవలం అధిక ధర టికెట్స్ మాత్రమే అందుబాటులో వుంటాయి. దీంతో డబుల్ రేట్లకు టికెట్స్ కొనాల్సిన పరిస్థితి'' అంటూ ఎక్స్ లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, ప్రధాని మంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు ఓ నెటిజన్. 

ఇక ఐఆర్ సిటిసి వెబ్ సైట్ పనిచేయకపోవడంపై కొందరు నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 'ఇండియా చంద్రుడిని చేరుకుంది. కానీ ఇప్పటికీ ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ యాప్ కేవలం తత్కాల్ టికెట్స్ ను కూడా సమస్యలు లేకుండా అమ్మలేకపోతోంది. రాకెట్ సైన్స్ కంటే టికెట్ బుకింగ్స్ యాప్ నిర్వహణ కష్టమేమో' అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
Recommended image2
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !
Recommended image3
Now Playing
CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved