MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • National
  • ఇకపై రిజర్వేషన్ ఉంటేనే రైల్వే ప్రయాణమా? జనరల్ బోగీలు ఉండవా? : రైల్వే శాఖ ఫుల్ క్లారిటీ

ఇకపై రిజర్వేషన్ ఉంటేనే రైల్వే ప్రయాణమా? జనరల్ బోగీలు ఉండవా? : రైల్వే శాఖ ఫుల్ క్లారిటీ

రైళ్ల లోని జనరల్ బోగీలను రైల్వే శాఖ తగ్గిస్తోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రిజర్వేషన్ లేకుండానే నిత్యం రైలు ప్రయాణాలు చేసేవారు ఆందోళన చెందుతున్నారు. అయితే నిజంగానే రైళ్లలో జనరల్ బోగీలను తొలగించే ప్రయత్నం జరుగుతోందా?...  రైల్వే శాఖ ఏం చెబుతోందంటే...  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 22 2025, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Indian Railways

Indian Railways

భారతీయ ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వేలది కీలకపాత్ర. ప్రతిరోజు కొన్ని లక్షలమంది రైళ్లలోప్రయణించి గమస్థానాలకు చేరుకుంటారు. ఇతర ప్రజా రవాణా వ్యవస్థలతో పోలిస్తే రైలు ప్రయాణం కాస్త చవక, సౌకర్యవంతంగా కూడా ఉంటుంది... అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు.

ఇలా రైల్వేతో ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్నారు పేద, మధ్యతరగతి ప్రజలు. అలాంటివారిని దూరం చేసుకునేందుకు రైల్వే శాఖ సిద్దమైందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. చాలా రైళ్ళలో జనరల్ బోగీలను తగ్గించారనే ప్రచారం జరుగుతోంది. 

చాలా రైళ్లలో కేవలం ఏసి, రిజర్వేషన్ కలిగిన బోగీలే ఉంటున్నాయని... జనరల్ బోగీలు తగ్గించారని ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యధికమంది ముందుగా ప్లాన్ చేసుకోకుండానే రైళ్లలో ప్రయాణిస్తుంటారు... అలాంటివారికి జనరల్ బోగీలే దిక్కు. ఇప్పుటు వాటిని తగ్గించడంతో వీటిలో ఉన్నవాటిలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. దీంతో మహిళలు, చిన్నారులు,వృద్దులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.  

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నిజంగానే జనరల్ బోగీలను తగ్గిస్తున్నారా?

నిజంగానే జనరల్ బోగీలను తగ్గిస్తున్నారా?

ప్రస్తుతం చాలా రైళ్లలో జనరల్ భోగీల సంఖ్య తగ్గింనమాట వాస్తవమే. చాలా రైళ్ళలో సాధారణంగా నాలుగు జనరల్ బోగీలు ఉండేవి... ఇందులో రెండింటిని తగ్గించి ఇంకో రెండు మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇలా తొలగించిన బోగీల స్థానంలో ఏసీ బోగీలను పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తరచూ రైల్వే ప్రయాణాలు చేసే పేద, మద్యతరగతి ప్రజలను   టెన్షన్ పెడుతోంది. 

36
జనరల్ బోగీల తగ్గింపుతో రాజకీయాలు

జనరల్ బోగీల తగ్గింపుతో రాజకీయాలు

రైళ్లలో జనరల్ బోగీల తగ్గింపు రాజకీయ వివాదానికి దారితీసింది.  వివిధ రాష్ట్రాల్లోని బిజెపియేతర పార్టీలు రైల్వే నిర్ణయంపై భగ్గుమంటున్నాయి. ఇప్పటికే విమానం, బస్సుల్లో పేదలు ప్రయాణించే పరిస్థితి లేదు... ఇప్పుడు రైల్వేను కూడా వారికి దూరం చేస్తారా? అంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ జనరల్ బోగీలను తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి నిర్ణయాలతో సామాన్యులను కష్టాలు పెంచవద్దని సూచించారు. 

ఇలా రైల్వే శాఖ జనరల్ బోగీల తగ్గింపు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వాలని రైల్వే శాఖను ఆదేశించింది. దీంతో రైళ్లలో జనరల్ బోగీలు ఎందుకు తగ్గాయో రైల్వే అధికారులు వివరించారు. 

 

 

 

స్న్యలకు కష్టం అని సీఎం స్టాలిన్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రైల్వే శాఖ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది.

46
జనరల్ బోగీల తగ్గింపుపై రైల్వే శాఖ  క్లారిటీ

జనరల్ బోగీల తగ్గింపుపై రైల్వే శాఖ క్లారిటీ

రైళ్లలో జనరల్ బోగీలను తగ్గిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. తగ్గించడం కాదు వాటిని ఇంకా పెంచాలని ప్లాన్ చేశామని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ బోగీలను ఇతర అవసరాలకు వాడుకుంటున్నామని... అందువల్లే కొన్ని రైళ్లలో వాాటి సంఖ్య తగ్గిందన్నారు. 

56
జనరల్ బోగీలు తగ్గట్లేదు!

జనరల్ బోగీలు తగ్గట్లేదు!

జనరల్ బోగీలను ప్రయాగరాజ్ మహా కుంభమేళా స్పెషల్ ట్రైన్స్ కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. అందువల్లే ఇతర రైళ్లలో జనరల్ బోగీలు తగ్గాయని రైల్వే అధికారులు తెలిపారు. అంతేగానీ శాాశ్వతంగా జనరల్ బోగీలనే ఉద్దేశం రైల్వే శాఖకు లేదని అన్నారు. కుంభమేళా అయిపోయాక అంటే ఫిబ్రవరి 26 తర్వాత తిరిగి అన్ని రైళ్లలో జనరల్ బోగీలు యధావిధిగా ఉంటాయన్నారు... కొన్నిట్లో వీటిసంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. 

 

.

66
మార్చి నుండి జనరల్ బోగీలు పెరుగుతాయి...

మార్చి నుండి జనరల్ బోగీలు పెరుగుతాయి...

కొన్ని రూట్లలో జనరల్ బోగీలను మార్చి నుంచి పెంచుతామని అధికారులు తెలిపారు. ఇప్పుడు మూడు జనరల్ బోగీలుండే రైళ్లలో వచ్చే నెల నుండి నాలుగు భోగీలు ఉంటాయి. చెన్నై-త్రివేండ్రం, చెన్నై-అలప్పుజా, చెన్నై-మైసూరు రూట్లలో నడిచే పలు రైళ్లలో రెండు నుంచి నాలుగుకు జనరల్ బోగీలు పెంచుతున్నట్లు తెలిపారు..

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Recommended image2
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Recommended image3
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved