సెలబ్రిటీని కానంటోంది... నటిస్తున్నానంటోంది..: ఫేస్ బుక్ పై మార్క్ జుకన్ బర్గ్ కేసు
మార్క్ జుకన్ బర్గ్ ఫేస్ బుక్ పై కేసు పెట్టడమేంటని ఆశ్చర్యపోతున్నాారా? అయితే మీరు ఈ స్టోరీ పూర్తిగా చదివితే దీనిపై క్లారిటీ వస్తుంది.

మార్క్ జుకన్ బర్గ్ పేరు ఎంతపని చేసింది..
అవును... మీరు పైన చదివిన హెడ్డింగ్ నిజమే. మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. కానీ ఈ జుకన్ బర్గ్ మీరు అనుకుంటున్నట్లు మెటా సీఈవో కాదు... ఇండియాకు చెందిన ఓ లాచర్. తన పేరు ఫేస్ బుక్ వ్యవస్థాపకులు, మెటా సీఈవో పేరు ఒకటే కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని... ఆర్థికంగా కూడా నష్టపోయానని సదరు లాయర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జుకన్ బర్గ్ పేరువల్ల ఫేస్ బుక్ తో సమస్య..
మార్క్ జుకన్ బర్గ్ పేరువల్ల తాను సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఫేస్ బుక్ ను ఉపయోగించకలేకపోతున్నానని లాయర్ జుకన్ బర్గ్ పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా తన ఫేస్ బుక్ వెరిఫైడ్ అకౌంట్ పనిచేయడంలేదు... దీనివల్ల క్లైంట్స్ తో కమ్యూనికేషన్, ప్రకటనల డబ్బులు కోల్పోయానని అంటున్నారు. మెటా తనను సెలబ్రిటీగా నటిస్తున్నానంటూ ఫేస్ బుక్ అకౌంట్ ను క్లోజ్ చేసిందని లాయర్ వాపోతున్నారు.
ఏకంగా 11 వేల డాలర్ల నష్టమా..!
తాను చెప్పేది కొందరికి ఫన్నీగా అనిపించవచ్చు... కానీ ఫేస్ బుక్ తీరు తనకు చాలా కోపం తెప్పించిందని లాయర్ జుకన్ బర్గ్ పేర్కొన్నారు. ''నేను తప్పుడు సమాచారంతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే మెటా సీఈవో కంటే ముందే నాపేరు జుకన్ బర్గ్. అతడిని అనుసరించి ఈ పేరు పెట్టుకోలేదు. వాళ్లవద్ద భారీగా డబ్బు ఉండవచ్చు... అనుభవం కలిగిన లాయర్లు ఉండవచ్చు. ఇలాంటి వారితో నేను గొడవ పడాలని అనుకోవడం లేదు. తన సమస్యను తెలియజేయడానికి ఇంతకంటే మంచి మార్గం కనిపించలేదు. అందుకే న్యాయపోరాటాన్ని ప్రారంభించాను'' అని సదరు లాయర్ అంటున్నారు.
గత మే నెలల తన లా ఫర్మ్ బిజినెస్ ఫేజీని కూడా ఫేస్ బుక్ తొలగించిందని లాయర్ జుకన్ బర్గ్ తెలిపారు. తద్వారా 11,000 డాలర్లను నష్టపోవాల్సి వచ్చిందన్నారు. కాబట్టి తన అకౌంట్ ను మళ్లీ తొలగించకుండా, నష్టపరిహారం చెల్లించేలా చూడాలని కోర్టును కోరుతున్నారు లాయర్ జుకన్ బర్గ్.
ఫేస్ బుక్ ను సంప్రదిస్తే ఏమంటున్నారు..?
లాయర్ జుకన్ బర్గ్ ఫేస్ బుక్ సమస్య ఇప్పటిది కాదు... కాలాకాలంగా అతడు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తన అకౌంట్ తొలగించిన ప్రతిసారి ఫేస్ బుక్ ను సంప్రదిస్తున్నారు... ఇలా ఓసారి అతడికి కంపెనీ క్షమాపణలు కోరుతూ ఈమెయిల్ కూడా పంపింది. కానీ తర్వాత మళ్లీ అతడి అకౌంట్ ను రద్దచేస్తూ వస్తోంది. ఇలా ఒక్కోసారి నాలుగు, మరోసారి ఆరునెలలు తన అకౌంట్ పనిచేయకుండా చేస్తున్నారని... ఇలా ఎందుకు జరుగుతోందని అడిగితే సమాధానం లేదని అంటున్నారు.
జుకన్ బర్గ్ మెటా నుండి ఏం కోరుకుంటున్నారు?
ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతో పేరుప్రఖ్యాతలు ఉన్న కంపెనీ తన వినియోగదారుడితో ఇలా వ్యవహరిస్తుందని అస్సలు ఊహించలేదని లాయర్ జుకన్ బర్గ్ అంటున్నారు. కనీసం తన వాదనను విని న్యాయం చేసేవారు లేకుండాపోయారు... అందుకే ఇక లాభంలేదని కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు అతడు వెల్లడించారు.
ఫేస్ బుక్ లో తన అకౌంట్ తొలగించడంవల్ల తన క్లైంట్స్ తో కమ్యూనికేషన్ కోల్పోయాను... అలాగే యాడ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వేల డాలర్లు నష్టపోయానని తన పిటిషన్ లో పేర్కొన్నారు జుకన్ బర్గ్. ఇకపై మెటా తన అకౌంట్ ను రద్దు చేయకుండా శాశ్వతంగా ఉంచేలా... ఇలా చేయడంవల్ల ఇప్పటివరకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. మరి లాయర్ జుకన్ బర్గ్ పిటిషన్ కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.