Facebook Password:ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ మర్చిపోయారా.. అయితే ఇలా ఈజీగా రిసెట్ చేసుకోండీ..
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఫేస్‌బుక్‌లో అకౌంట్ లేని వారు ఉండరు, కానీ చాలా మంది ఒకోసారి ఫేస్‌బుక్ అక్కౌంట్ పాస్‌వర్డ్‌ను మర్చిపోతుంటారు. దాన్ని రీసెట్ చేసే ప్రక్రియలో చాలా ఇబ్బంది పడుతుంటారు, దీంతో కొత్త అక్కౌంట్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంటుంది.
మీరు కూడా ఇలాంటి సమస్య ఎదురుకొంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇందుకు కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి, దీని ద్వారా మీరు పాస్‌వర్డ్‌ను చిటికెలో రీసెట్ చేయవచ్చు. మీరు Gmail IDతో లేదా ఫోన్ నంబర్ ద్వారా మీ ఖాతాను సృష్టించుకున్నా పాస్‌వర్డ్‌ని రెండు విధాలుగా రీసెట్ చేయవచ్చు.
Facebook ఖాతా పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడానికి, మీరు ముందుగా Facebook వెబ్‌సైట్‌ను ఓపెన్ చెయ్యాలి. ఇక్కడ మీ ఐడి ఎంటర్ చేశాక కింద Forgot Passwordపై క్లిక్ చేయాలి, ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మీరు ఇమెయిల్ IDతో మీ Facebook అక్కౌంట్ క్రియేట్ చేసినట్లయితే మీరు మొబైల్ నంబర్‌కు బదులు ఇమెయిల్ IDని ఎంటర్ చేయాలి.
పాస్‌వర్డ్‌ను మార్చడానికి సులభమైన మార్గం
మీరు ఇప్పటికే మీ Facebook ఖాతాకు లాగిన్ అయి ఉంటే, మీరు ముందుగా సెట్టింగ్‌లకు వెళ్లాలి. ఇక్కడ మీరు పాస్‌వర్డ్ & సెక్యూరిటీపై క్లిక్ చేయాలి, ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఛేంజ్ పాస్‌వర్డ్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాత పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలి. తరువాత కాలమ్‌లో కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు పాస్‌వర్డ్ మార్పులను సేవ్ పై క్లిక్ చేసిన తర్వాత మీ పాస్‌వర్డ్ మార్చబడుతుంది.
పాస్‌వర్డ్ మర్చిపోయారా అయితే ఇలా మార్చండి
మీ పాత పాస్‌వర్డ్ లేకుంటే లేదా మర్చిపోయి ఉంటే మీరు ఫర్గాట్ పాస్‌వర్డ్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత అక్కౌంట్ తో అనుబంధించబడిన మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDకి కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. దీని సహాయంతో మీరు పాస్‌వర్డ్ మార్చవచ్చు.
మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి లేకుండా పాస్‌వర్డ్ ఎలా మార్చవచ్చాంటే
మీకు మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి లేకపోయినా, మీరు మీ ఫేస్‌బుక్ ఖాతా పాస్‌వర్డ్‌ను చాలా సులభంగా మార్చవచ్చు. ఇందుకోసం ముందుగా ఫేస్ బుక్ వెబ్ సైట్ ను ఏదైనా బ్రౌజర్ లో ఓపెన్ చేయాలి. ఇక్కడ లాగిన్ పేజీలో, మీరు మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌ను ఎంటర్ చేసి, పాస్‌వర్డ్ ఫీల్డ్‌ను ఖాళీగా ఉంచడం ద్వారా లేదా తప్పు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా లాగిన్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత, యాక్సెస్ చేయలేని పాస్‌వర్డ్ నోటిఫికేషన్ వస్తుంది, దీనిలో ఫర్గాట్ పాస్‌వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది.
దానిపై క్లిక్ చేయడం ద్వారా, నెక్స్ట్ పేజీ ఆటోమేటిక్ గా మళ్లిస్తుంది. కన్ఫర్మేషన్ కోడ్‌ను మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడికి పంపడానికి ఇక్కడ సమాచారం ఇవ్వబడుతుంది. ఇక్కడ మీకు i dont have access to these? పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీలో మీరు i dont have access to my email అనే దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది, ఇందులో కొత్త ఈమెయిల్ ఐడీ అడుగుతుంది. ఈ కొత్త ఇమెయిల్ ఐడిలోనే మీ ఫేస్‌బుక్ అక్కౌంట్ రికవర్ చేసుకోమని మీకు మెసేజ్ వస్తుంది. కొత్త ఇమెయిల్ IDని మరే ఇతర Facebook ఖాతాకు లింక్ చేయరాదని మీరు గమనించాలి.