- Home
- National
- Indian Army: రూ. 6000 కోట్లతో బిగ్ ప్లాన్.. నిశ్శబ్ధ ఆయుధాన్ని తయారు చేస్తున్న భారత్
Indian Army: రూ. 6000 కోట్లతో బిగ్ ప్లాన్.. నిశ్శబ్ధ ఆయుధాన్ని తయారు చేస్తున్న భారత్
భవిష్యత్ యుద్ధంలో తుపాకులు, క్షిపణులు మాత్రమే కాకుండా, క్వాంటం టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోంది. శబ్దం చేయని ఈ సాంకేతిక ఆయుధం భారత రక్షణ రంగాన్ని కొత్త దిశగా నడిపిస్తోంది.

ఏంటీ క్వాంటం టెక్నాలజీ.?
క్వాంటం టెక్నాలజీ అనేది సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్, హ్యాక్ చేయలేని కమ్యూనికేషన్, అధునాతన నావిగేషన్ అందించే విప్లవాత్మక సాంకేతికత. దీని సహాయంతో రక్షణ రంగంలో సూపర్ సెక్యూర్ నెట్‌వర్క్స్, క్వాంటం రాడార్లు, క్వాంటం సెన్సర్లు తయారు చేయవచ్చు. క్వాంటం ఆధారిత కమ్యూనికేషన్ వల్ల హ్యాకింగ్‌కు గురి కాకుండా రహస్య సంకేతాలను పంచుకోవచ్చు. అంతరిక్ష, ఆరోగ్య, ఫైనాన్స్ రంగాల్లో కూడా దీని వాడకం పెరగనుంది.
KNOW
జాతీయ క్వాంటం మిషన్
2023లో కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ క్వాంటం మిషన్’ ప్రారంభించింది. దీని కోసం రూ. 6,003 కోట్లు కేటాయించారు, ఇందులో క్వాంటం కంప్యూటర్లు, నెట్‌వర్క్స్, సెన్సర్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటివరకు సుమారు రూ. 17 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌కు బలమైన పునాది పడింది. ఈ మిషన్ 2031 నాటికి ప్రపంచ స్థాయి క్వాంటం సామర్థ్యాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్ కీలక పాత్ర
హైదరాబాద్‌లోని Qulabs కంపెనీ క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీపై పని చేస్తోంది. ఇది హ్యాక్ చేయలేని కమ్యూనికేషన్ అందిస్తుంది. మరో కంపెనీ QuBeats క్వాంటం GPS సిస్టమ్‌ను నేవీ కోసం అభివృద్ధి చేస్తోంది. ఇది డీప్ సీ నావిగేషన్‌లో కూడా పని చేస్తుంది, అక్కడ సాధారణ GPS పనిచేయదు. ఈ కంపెనీలు ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన చాలెంజ్‌లో రూ.25 కోట్లు నిధులు గెలుచుకున్నాయి.
Enabling the Battlefield of Tomorrow with Quantum Tech
The Indian Army takes a significant leap in harnessing Quantum Technologies with the development of indigenous Post-Quantum Cryptography (PQC) applications. These applications have been developed by the Military College of… pic.twitter.com/VbGdmMOaTp— ADG PI - INDIAN ARMY (@adgpi) June 20, 2025
తొలి క్వాంటం ట్రయల్
2025 జూన్‌లో IIT ఢిల్లీ మొదటి రియల్-వరల్డ్ క్వాంటం కమ్యూనికేషన్ ట్రయల్ చేసింది. సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు సెక్యూర్ క్వాంటం సిగ్నల్స్ పంపడంలో విజయం సాధించారు. దీనిని రక్షణ మంత్రి ‘ల్యాండ్‌మార్క్ అచీవ్‌మెంట్’గా అభివర్ణించారు. ఇది ల్యాబ్ స్థాయి ప్రయోగం నుంచి ఫీల్డ్ అప్లికేషన్‌కు మొదటి అడుగుగా చెబుతున్నారు.
భారత్ ముందు ఉన్న సవాళ్లు
చైనా ఇప్పటికే $14 బిలియన్ క్వాంటం పరిశోధనలో పెట్టుబడి పెట్టింది, భారత్ మాత్రం కొత్తగా మొదలుపెడుతోంది. మనకు మేధస్సు ఉన్నా, ఫండింగ్, వేగం, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో ఇంకా మెరుగుకావాల్సి ఉంది. క్వాంటం టెక్నాలజీతో భారత్.. సైబర్ యుద్ధాలు, ఉపగ్రహ నెట్‌వర్క్ భద్రత, అండర్‌వాటర్ నావిగేషన్ రంగాల్లో దూసుకుపోనుంది. భవిష్యత్‌లో ఇది సివిలియన్ రంగాల్లో కూడా (హెల్త్‌కేర్, ఫైనాన్స్, స్పేస్) విస్తరించే అవకాశం ఉంది.