స్నేహితుడి భార్యను అక్కా అని పిలుస్తూ వివాహేతర సంబంధం.. తట్టుకోలేని ఆ భర్త చేసిన పని..
భార్యను అక్కా అనిపిలిచే తన స్నేహితుడే తనను వంచించడం.. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య మోసం చేయడం తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

కర్ణాటక : వివాహేతర సంబంధాలు కాపురాలను నిలువునా కూల్చుతున్న ఘటనలో కోకోల్లలుగా వెలుగు చూస్తున్నాయి. క్షణికావేశంలో.. మోహంతో ఏర్పడిన ఈ బంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తన కళ్ళముందే మరొకరితో సన్నిహితంగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు ఆ భర్త.
దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మోసం చేసిందన్న ఆవేదన ఓవైపు.. భార్యను అక్కా అంటూ పిలుస్తూ ఇంటికి వచ్చే స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న షాక్ మరోవైపు..అతడిని బలవన్మరణానికి ఉసిగొలిపింది.
ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు బిబిఎంపీలో పౌర కార్మికుడిగా పనిచేస్తున్నాడు లోకేష్. అతను స్థానిక చిక్కమారనహళ్లిలో నివాసం ఉంటున్నాడు. శశికళ అనే యువతిని 11 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
లోకేష్ స్నేహితుడి పేరు చిరంజీవి. అతను తరచుగా ఇంటికి వస్తుండేవాడు. శశికళను అక్కా అక్కా అని పిలిచేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు చిరంజీవి, శశికళ సన్నిహితంగా ఉండడం లోకేష్ చూశాడు. దీంతో తీవ్ర షాక్ కు గురయ్యాడు. శశికళ తనను మోసం చేసిందనే బాధను తట్టుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని సూసైడ్ నోట్లో రాశాడు.
ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలియని లోకేష్ తల్లి కొడుకు కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో వారి పెంపుడు కుక్క వచ్చి.. లోకేష్ చనిపోయిన చోటికి ఆమెను తీసుకెళ్లింది. అక్కడ కొడుకును చూసిన ఆమె పెద్ద పెట్టున రోధిస్తూ.. పోలీసులకు సమాచారాన్ని అందించింది.
సమాచారం అందుకున్న నేలమంగళ గ్రామాంతర పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన సూసైడ్ నోట్ ని బట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.