- Home
- National
- వరకట్నవేధింపుల కేసు.. భార్యను దహనం చేసిన శ్మశానవాటికలోని చెట్టుకు ఉరేసుకుని.. భర్త ఆత్మహత్య..
వరకట్నవేధింపుల కేసు.. భార్యను దహనం చేసిన శ్మశానవాటికలోని చెట్టుకు ఉరేసుకుని.. భర్త ఆత్మహత్య..
భార్యను దహనం చేసిన శ్మశానవాటిక సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

Dowry Deaths
జైపూర్ : రాజస్థాన్ లో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ ఆత్మహత్యచేసుకుని మృతి చెందింది. దీనికి ఆమె భర్ వరకట్న వేధింపులే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు అల్లుడి మీద పోలీస్ కేసు పెట్టారు.
దీంతో మనస్తాపానికి గురైన అల్లుడు భార్య అంత్యక్రియలు చేసి స్మశానవాటిక సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెడితే.. రంజనా అనే మహిళ ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె భర్త చంద్రప్రకాష్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తన భార్య ఆత్మహత్యకు పాల్పడడం.. దానికి అతనిపై అత్తమామలు వరకట్న మరణం కేసు నమోదు చేయడంతో చంద్రప్రకాష్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు సోమవారం తెలిపారు.
చంద్రప్రకాష్ తన భార్యను దహనం చేసిన శ్మశానవాటిక సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
ప్రస్తుతం చంద్రప్రకాష్ కుటుంబం అతని అత్తమామలపై.. చంద్రప్రకాష్ ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.