దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మహిళా నేతలు

First Published 17, May 2019, 12:19 PM IST

భారత రాజకీయాల్లో పురుషులతో పాటు మహిళలు కూడ రాణించారు. ఆయా రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడ మహిళలు చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడ కొందరు మహిళ నేతలు కూడ తమ రాజకీయ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారు.
 
కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సోనియాగాంధీ కీలకంగా వ్యవహరించారు. 2004లో బీజేపీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రావడంలో సోనియా కీలకంగా వ్యవహరించారు.

ప్రధానమంత్రి పదవిని స్వీకరించే అవకాశం వచ్చినా కూడ ఆమె ఆ పదవిని స్వీకరించకుండా మన్మోహన్ సింగ్‌ను ఆ పదవిలో కూర్చొబెట్టారని కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. 1997లో కోల్‌కత్తాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించారు.1998లో ఆమె పార్టీ నాయకురాలుగా ఎదిగారు.

1999లో సోనియాగాంధీపై ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న శరద్ పవార్, పీఎ సంగ్మా, తారిఖ్ అన్వర్ తిరుగుబాటు చేశారు. ఈ ముగ్గురిని రాజీనామా చేయాలని ఈ ముగ్గురిని సోనియా ఆదేశించారు. ఆ తర్వాత ఈ ముగ్గురు నేతలు ఎన్సీపీని ఏర్పాటు చేశారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించిన 62 రోజుల తర్వాత సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికైంది. 1999 ఎన్నికల్లో కర్ణాటకలోని బళ్లారి, యూపీలోని ఆమేథీ నుండి ఆమె పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో కూడ ఆమె విజయం సాధించింది. బళ్లారిలో సుష్మాస్వరాజ్‌ను ఓడించారు.13వ, లోక్‌సభలో సోనియాగాంధీ ప్రతిపక్షనేతగా ఉన్నారు. 2003లో వాజ్‌పేయ్ ప్రభుత్వంపై సోనియా అవిశ్వాసాన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

బీజేపీలో కీలకనేతగా సుష్మాస్వరాజ్‌ దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఏడు దఫాలు ఎంపీగా, మూడు దఫాలు అసెంబ్లీ సభ్యురాలిగా సుష్మా స్వరాజ్ పనిచేవారు. మోడీ కాకపోతే 2014 ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి పదవి రేసులో సుష్మా స్వరాజ్ పేరు కూడ విన్పించింది. మోడీ కేబినెట్‌లో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని నడపడంలో షీలా దీక్షిత్ కీలకంగా వ్యవహరించారు. 1998 నుండి 2013 వరకు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్‌ పనిచేశారు. ఆ తర్వాత కేరళ రాష్ట్రానికి 2014 మార్చి 11 నుండి 2014 ఆగష్టు 25వ తేదీ వరకు ఈ పదవిలో ఉన్నారు. యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో షీలా దీక్షిత్‌ను ఆ పార్టీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ, యూపీలో ఆ పార్టీకి అనుకొన్న ఫలితాలు దక్కలేదు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో షీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ద్రవిడ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. అన్నాడిఎంకెలో 1982లో ఆమె చేరారు.ఎంజీఆర్ ప్రోత్సాహాంతో ఆమె అన్నాడీఎంకెలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడు రాష్ట్రానికి ఆరు దఫాలు ముఖ్యమంత్రిగా ఆమె పనిచేశారు.1989లో జరిగిన ఎన్నికల్లో డీఎంకె ప్రభుత్వం తమిళనాడులో అధికారాన్ని చేపట్టింది.

ఆ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకె ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 1991 ఎన్నికల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అతి పిన్నవయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించారు.

1996లో జరిగిన ఎన్నికల్లో డీఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కరుణానిధి సర్కార్ జయలలితపై అవినీతి కేసులు పెట్టింది.ఈ కేసుల్లో ఆమెను జైల్లో పెట్టింది డీఎంకె సర్కార్.1998 ఎన్నికల్లో అన్నాడిఎంకె బీజేపీకి మద్దతు ఇచ్చింది. 13 మాసాల తర్వాత జయ పార్టీ వాజ్‌పేయ్ సర్కార్‌కు మద్దతును ఉపసంహరించుకొంది.దీంతో వాజ్‌పేయ్ సర్కార్ కుప్పకూలింది.

2001 ఎన్నికల్లో అన్నాడిఎంకె తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికే కోర్టు కేసు కారణంగా ఆమె పదవిని కోల్పోయింది. 2011లో జరిగిన ఎన్నికల్లో జయ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ కాలంలో ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి కలిసొచ్చాయి. 2016లో కూడ మరోసారి జయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగానే ఉంటూ 2016 డిసెంబర్ 6వ తేదీన ఆమె మృతి చెందారు.

బీఎస్పీ చీఫ్ మాయావతి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు దఫాలు మాయావతి ముఖ్యమంత్రిగా పనిచేశారు. యూపీ రాష్ట్రంలో బీజేపీని నిలువరించేందుకు ప్రస్తుతం ఎస్పీతో ఆ పార్టీ చేతులు కలిపింది. ప్రధాని రేసులో కూడ ఆమె ఉన్నారు.కాన్షీరామ్ ఏర్పాటు చేసిన బీఎస్పీలో 1984లో ఆమె చేరారు. ఆయన స్పూర్తితో పనిచేశారు. మాయావతి చేసే ప్రసంగాలకు పెద్ద ఎత్తున ప్రజలు ఆ సమయంలో హాజరయ్యేవారు.

1995లో యూపీకి ఆమె తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.3 జూన్ 1995 నుండి 18 అక్టోబర్ 1995 వరకు ఆ పదవిలో కొనసాగారు. రెండో దఫా 21 మార్చి 1997 నుండి 20 సెప్టెంబర్ 1997 వరకు ఆమె సీఎంగా పనిచేశారు.మూడో దఫా 3 మే 2002 నుండి 26 ఆగష్టు 2003 వరకు ఆమె ఈ పదవిలో ఉన్నారు.13 మే 2007లో మాయావతి యూపీకి నాలుగోసారి సీఎంగా ఎన్నికయ్యారు. ఈ దఫా ఆమె పూర్తి కాలం పనిచేశారు.

బెంగాల్ రాష్ట్రాన్ని పాలించిన వామపక్ష ప్రభుత్వాన్ని కుప్పకూల్చి రెండు దఫాలు వరుసగా అధికారాన్నిచేపట్టిన ఘనత మమత బెనర్జీకి దక్కుతోంది. సీపీఎం కు వ్యతిరేకంగా మమత బెనర్జీ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

1970లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ రాష్ట్రా మహిళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దీదీ గా ఆమెను అభిమానులు పిలుచుకొంటారు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి 1997లో ఆమె తృణమూల్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. 2011 ఎన్నికల్లో బెంగాల్‌లో టీఎంసీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2016లో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకొంది.

వసుంధర రాజె సింధియా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళ సీఎంగా ఎన్నికయ్యారు. బీజేపీలో వసుంధర రాజె సింధియా కీలక నేతగా ఎదిగారు. వసుంధర రాజె సింధియా తల్లి విజయరాజె సింధియా ద్వారా రాజకీయాల్లోకి వచ్చినట్టుగా చెబుతారు.1985లో వసుంధర రాజె సింధియా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

loader