వర్ష బీభత్సానికి 21 మంది దుర్మరణం.. పదుల సంఖ్యలో గల్లంతు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
కేరళలో శుక్రవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షంతో ప్రజల జీవనం స్తంభించింది. వరదలు పోటెత్తాయి. వర్షం దాటికి ఇల్లు నేలకొరిగాయి. కొండచరియలూ విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 21 మంది మరణించారు.

kerala floods
తిరువనంతపురం: Keralaలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం నుంచి కుండపోత వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. వృక్షాలు కూలిపోయాయి. రోడ్లు తెగిపోయాయి. ఇళ్లూ కూలిపోయాయి. కొట్టాయం జిల్లాలో కొండచరియలూ విరిగిపడ్డాయి. శుక్రవారం నుంచి వర్షాల కారణంగా రాష్ట్రంలో 21 మంది మరణించారు. ఇందులో 13 మంది కొట్టాయంలో మరణించగా, ఇదుక్కిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో గల్లంతయ్యారు.
kerala floods
కొట్టాయం జిల్లాలో కుండపోత వర్షానికి floods పోటెత్తడంతోపాటు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కొండ చరియల కింద కొందరు చిక్కుకుపోయారు. ఈ ఏరియాలో వరదల్లో గల్లంతైనవారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. దీంతో ఆర్మీ, NDRF, పోలీసులు, ఫైర్ ఫోర్స్ సహా స్థానికులు కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో కొండచరియల శిథిలాల కింద నుంచి మృతదేహాలు వెలికివచ్చాయి. కొట్టాయంలోని కూట్టిక్కాల్‌లో మరో ఐదు మృతదేహాలు శిథిలాల కింద నుంచి సహాయక బృందాలు మధ్యాహ్నానికల్లా వెలికి తీయగలిగాయి. ఇదే ఏరియాలో ముగ్గురు పిల్లల మృతదేహాలు ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నట్టుగా బయటపడటం కలచివేస్తున్నది. ఎనిమిది, ఏడు, నాలుగేళ్ల ఆ పిల్లల మృతదేహాలు రెస్క్యూ సిబ్బందినీ కంటతడి పెట్టించాయి.
kerala floods
కూట్టికాల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కావలిలో మద్రాస్ రెజిమెంట్ బలగాలు rescue operations ప్రారంభించాయి.
kerala floods
ఆర్మీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నది. ఐఎన్ఎష్ గరుడా నుంచి సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు వదర ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరాయి. శంగుముగమ్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో రెండు వైమానిక దళ విమానాలు ఎంఐ-17లు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.
kerala floods
కొట్టాయం సహా వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం పినరయి విజయన్ శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులను ఆదేశించారు. వెంటనే సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించాలని, కరోనా నిబంధనలనూ పాటించాలని చెప్పారు.
kerala floods
కేరళలో వరదలను పర్యవేక్షిస్తున్నామని, ప్రజలకు సహాయపడటానికి కేంద్రం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇప్పటికే ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావితం ప్రాంతాలకు పంపామని, ప్రతి ఒక్కరినీ రక్షించే ప్రయత్నం చేస్తామని వివరించారు.
kerala floods
ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉన్నదని తెలుస్తున్నది.