MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఇదేం విచిత్రం.. తమ్ముళ్లతో గొడవపడి సెల్ ఫోన్ మింగేసింది.. ఆ తరువాతే అసలు ట్విస్ట్...

ఇదేం విచిత్రం.. తమ్ముళ్లతో గొడవపడి సెల్ ఫోన్ మింగేసింది.. ఆ తరువాతే అసలు ట్విస్ట్...

ఓ అమ్మాయి తమ్ముళ్లతో గొడవపడి సెల్ ఫోన్ మింగేసింది. గొంతులో ఎలా పట్టిందా? అని ఆశ్యర్యంగా ఉంది కదా.. ఎలా మింగిందో కానీ.. ఆ తరువాత ప్రాణాల మీదికి తెచ్చుకుంది. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 07 2023, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
cell phone

cell phone

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. అక్కడి భింద్ జిల్లాలో సోదరుడితో గొడవపడిన 18 ఏళ్ల యువతి చైనా సెల్‌ఫోన్‌ను మింగేసింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వెంటనే ఆమె అస్వస్థతకు గురి కావడంతో గ్వాలియర్‌లోని జయరోగ్య ఆసుపత్రికి (జేఏహెచ్) తరలించారు, అక్కడ ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స చేసి, కడుపులో నుండి ఫోన్‌ను సురక్షితంగా తొలగించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

“తమ్ముళ్ల మధ్య తలెత్తిన వివాదంమే ఈ పరిణామానికి దారితీసింది. వారి మధ్య చోటు చేసుకున్న వాదనలతో కోపం పెరిగిపోయి.. ఆమె సెల్ ఫోన్ మింగేసింది. ఈ హఠాత్ పరిణామానికి సోదరులు షాక్ అయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పారు. వెంటనే వారు ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు”అని ఒక వైద్యుడు చెప్పారు. అయితే, ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యమయ్యిందని వైద్యులు అంటున్నారు. సెల్ ఫోన్ మింగిన తరువాత.. బాలికకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. వీటినుంచి కాస్త కోలుకున్న తరువాతే ఆమెను వైద్య సహాయం కోసం తీసుకొచ్చారు.

35
cell phone

cell phone

ఆమెను గ్వాలియర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ అయిన జేఏహెచ్ కి తీసుకెళ్లారు. జేఏహెచ్ కి బాలిక చేరుకోగానే, విషయం తెలుసుకున్న డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ ప్రశాంత్ శ్రీవాస్తవ, యూనిట్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ ప్రశాంత్ పిపారియా, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నవీన్ కుష్వాహ నేతృత్వంలోని నిపుణులైన వైద్యుల బృందం శస్త్రచికిత్సను నిర్వహించింది.

45
Cellphone

Cellphone

అల్ట్రాసౌండ్, ఎక్స్-రే,  సిటీ స్కాన్‌తో సహా క్షుణ్ణంగా పరీక్షించారు. అయితే, ఎండోస్కోపీ లేదా లాపరోస్కోపీ లాంటి ఇన్వాసివ్ పద్ధతుల ద్వారా ఫోన్‌ను సురక్షితంగా కడుపులోనుంచి తీయడం సాధ్యం కాదని తేలింది. దీనికోసం శస్త్రచికిత్స జోక్యం అవసరమని వైద్య బృందం నిర్ధారించింది. శస్త్ర చికిత్స బృందం దాదాపు రెండు గంటలపాటు శ్రమించి బాలిక కడుపులో నుంచి ఫోన్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ సమయంలో కొంచెం క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పటికీ, ఆపరేషన్ విజయవంతమైందని, ఫోన్‌ని విజయవంతంగా బైటికి తీశామని డాక్టర్ కుష్వాహా తెలిపారు. 

55

ఆపరేషన్ కారణంగా బాలికకు పది కుట్లు పడ్డాయి. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెబుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ కుష్వాహా ఈ కేసుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో ఇలాంటి సంఘటనను చూడలేదని పేర్కొన్నారు. విచిత్రమైన సంఘటన వెలుగులోకి రావడంతో,  యుక్తవయస్సు పిల్లలకు మొబైల్ లాంటి పరికరాలను ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని కుష్వాహా తల్లిదండ్రులను ఉద్దేశించి అన్నారు. 

About the Author

BS
Bukka Sumabala
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
Recommended image2
BJP : తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే..!
Recommended image3
India Day FIA Event: న్యూయార్క్‌లో భారత మువ్వన్నెల వెలుగులు.. త్రివర్ణ కాంతుల్లో మెరిసిన ఎంపైర్ స్టేట్ భవనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved