డజన్ మామిడిపండ్లు రూ. 1.2 లక్షలకు అమ్మింది.. స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది.. !
జార్ఖండ్ లోని జంషేడ్ పూర్ కి చెందిన 11 యేళ్ల అమ్మాయి.. ఆన్ లైన్ క్లాసులకోసం స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలన్న తన కోరికను మామిడి పండ్లు అమ్మి నెరవేర్చుకుంది. మామిడిపండ్ల వ్యాపారి కూతురు తులసి కుమారి దగ్గర ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త డజను మామిడిపండ్లను రూ. 1,20,000కు కొనడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఒక్కో మామిడి పండు రేటు రూ. 10,000. జపాన్ లో అత్యంత ఖరీదైన మామిడి పండు ధర రూ. 8000. అలాంటిది ఆయన జస్ట్ రూ. 300కి వచ్చే మామిడిపండ్లను అంత ఎక్కువ రేటుకి ఎందుకు కొన్నారనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.
దీని వెనుక అసలు కారణం తెలిసి.. నెటిజన్లు ఆయన్ని మెచ్చెకుంటున్నారు. రోడ్డు పక్కన మామిడిపండ్లు అమ్ముతున్న తులసి కుమారి దగ్గర పండ్లు కొన్న ఆ వ్యాపారవేత్త, ఆమె తండ్రి శ్రీమల్ కుమార్ బ్యాంక్ అకౌంట్ కి బుధవారం డబ్బును ట్రాన్స్ ఫర్ చేశారు. దాంతో ఈ ఘటన సంచలనం అయ్యింది.
తులసి కుమారిది పేద కుటుంబం. ఆమె చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇలాంటి సమయంలో ఆన్ లైన్ క్లాసులు రావడంతో.. కనీసం మొబైల్ కొనేందుకు కూడా డబ్బు లేదు. ఈ విషయాన్ని గుర్తించిన వ్యాపారవేత్త అమేయహితే.. ఆమెకు సాయం చెయ్యాలని అనుకున్నారు.
ఉత్తినే డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదనుకున్న ఆయన.. ఆమె దగ్గర మామిడిపండ్లు కొన్నారు. అందుకోసం రూ.1.20లక్షలు ఇచ్చారు. అంతేకాదు, ఆమెకు రూ.13,000విలువ చేసే స్మార్ట్ మొబైల్ కొని ఇచ్చారు. అంతేకాదు, ఓ సంవత్సరానికి సరిపడా, ఇంటర్నెట్ డేటా రీఛార్జ్ కూడా చూసి ఇచ్చారు. ఇక ఆమె ఏడాదంతా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకునేలా చేశారు.