MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • లవర్ తో కలిసి మాజీ ప్రియుడి కిడ్నాప్, నగ్నవీడియోలు తీసి, గంజాయి తాగించి చిత్రహింసలు.. యువతి అరెస్ట్...

లవర్ తో కలిసి మాజీ ప్రియుడి కిడ్నాప్, నగ్నవీడియోలు తీసి, గంజాయి తాగించి చిత్రహింసలు.. యువతి అరెస్ట్...

బ్రేకప్ కి ఒప్పుకోలేదని మాజీ ప్రియుడిని లవర్ తో కలిసి కిడ్నాప్ చేసిందో యువతి. అతడిని బంధించి చిత్రహింసలకు గురిచేసింది. నగ్న వీడియోలు, ఫొటోలు తీసింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 13 2023, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తిరువనంతపురం : కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తిరువనంతపురంలోని వర్కాల సమీపంలోని అయిరూర్‌లో మాజీ ప్రియుడిని అతడి ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన యువతిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చెరున్నియూర్‌కు చెందిన బీసీఏ విద్యార్థిని, లక్ష్మీప్రియ(19)ను తిరువనంతపురంలోని ఆమె స్నేహితురాలి ఇంట్లో పోలీసులు అరెస్టు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఏప్రిల్ 5న ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన కేసులో లక్ష్మి ప్రధాన నిందితురాలిగా ఉందని, ఈ కేసులో 10 మంది నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎర్నాకులంకు చెందిన అమల్‌ను పోలీసులు గతంలో అరెస్టు చేశారు. “లక్ష్మి, బాధిత యువకుడు ఇంతకుముందు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవల, ఆమె చదువు కోసం ఎర్నాకులం వెళ్లింది, అక్కడ ఆమె మరొక యువకుడితో స్నేహం చేసింది

36

ఆ తర్వాత తన పాత సంబంధాన్ని తెంచుకోవాలని అనుకుంది. అయితే, అయిరూర్‌కు చెందిన వ్యక్తి లక్ష్మి ప్రతిపాదనను అంగీకరించకలేదు. ఆమెతో రిలేషన్ బ్రేక్ చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె, ఆమె మరో ఆరుగురు స్నేహితులు అతన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు, ”అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

46
Kidnap

Kidnap

మరోవైపు సదరు యువతి తన కొడుకును మోసగించి.. కారులో తీసుకెళ్లిందని బాధితుడి తండ్రి చెప్పాడు. అతను కారులోకి ఎక్కగానే ఆమె స్నేహితులు అతన్ని కొట్టడం ప్రారంభించారు. మార్గమధ్యంలో అలప్పుజాలో ఆగి ఆ యువకుడి బంగారు గొలుసు, ఖరీదైన మొబైల్ ఫోన్, నగదు తీసుకున్నారు. 

56

అనంతరం ఎర్నాకులంలోని తమ్మనం సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. ఆ గుంపు అతడిని అక్కడే కట్టేసి కొట్టారు. అతడిని నగ్నంగా చేసి తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. "వారు అతనికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. గంజాయి తాగించారు’’ అని బాధితుడి తండ్రి ఆరోపించారు. అనంతరం యువకుడిని వైటిళ్ల సమీపంలో దింపేసి పారిపోయారు. 

66

కాగా, తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఆ నేరంలో ఆమె పాత్ర లేదని లక్ష్మి తల్లి ప్రియ అన్నారు. “అబ్బాయి ఆమెను వేధించేవాడు. అందుకే ఆమె ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పింది. అయితే, ఆమె అతన్ని బాధపెట్టాలని అనుకోలేదు. స్నేహితులు అతన్ని కొట్టడం ప్రారంభించినప్పుడు, ఆమె వారిని ఆపమని వేడుకుంది. కానీ వారు తన మాట వినలేదు' అని ప్రియా అన్నారు. బాలికను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
Recommended image2
BJP : తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే..!
Recommended image3
India Day FIA Event: న్యూయార్క్‌లో భారత మువ్వన్నెల వెలుగులు.. త్రివర్ణ కాంతుల్లో మెరిసిన ఎంపైర్ స్టేట్ భవనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved