MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • National
  • పెట్రోల్ కు రేషన్... ఒక్క వాహనానికి నెలకు ఇంతే..!

పెట్రోల్ కు రేషన్... ఒక్క వాహనానికి నెలకు ఇంతే..!

పెట్రోల్ కు రేషన్ పెడుతారు…ఒక వాహనానికి నెలకు ఇంత అని… అలాగే వంటగ్యాస్ కు కూడా ఒక ఇంటికి ఇంత అని. అంతం కాదిది.. ఆరంభం మాత్రమే..! ఈ ప్రపంచవ్యాపితంగా కొన్నేళ్లకు డిజిటల్ డిక్టేటర్షిప్ వస్తుంది.

2 Min read
Author : Amarnath Vasireddy
Published : Mar 26 2026, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తోలుబొమ్మలాట..!
Image Credit : Getty

తోలుబొమ్మలాట..!

కరోనా రెండో వేవ్ కాలం నాటి కథ..!

"ఆక్సిజన్ సిలిండర్ల కొరత" అనే వార్తను సృష్టించారు..!

ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో డబ్బున్న మారాజులు టోకు మొత్తంలో మాట్లాడుకొని మూడు నాలుగు నెలలకు హాస్పిటల్ బెడ్స్ బుక్ చేసుకొని పక్కన ఒక ఆక్సిజన్ సిలిండర్ రిజర్వ్ లో పెట్టుకొని పడుకొన్నారు.

దీనితో నిజంగానే ఆక్సిజన్ సిలిండర్స్ కొరత వచ్చింది.

ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 90 కి తగ్గినవారికి ఆక్సిజన్ అందక పోయారు.

ముందు జాగ్రత్త చర్యగా హాస్పిటల్ బెడ్స్ బుక్ చేసుకొని చేరిన వారిలో చాలామంది భయానికి పోయారు.

అదీ జనాల పానిక్ ఫలితం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెట్రోల్ కోసం బారులు..
Image Credit : ANI

పెట్రోల్ కోసం బారులు..

రెండు రోజులుగా హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల ముందు పొడవాటి క్యూలు.

ట్యాంక్ ఫుల్ చేస్తే జీవితాంతం శాశ్వతంగా నడుపు కొనే వీలుందా..?

కొంతమంది అయితే డబ్బాల్లో పట్టుకొని పోతున్నారు. పెట్రోల్/డీజిల్ బాంబు లాంటిది.

ఇంట్లో పెట్టుకొంటే కాలి బూడిదైపోతాము అన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా..?

చర్చలు మొదలయ్యాయి.. పెద్దగా పురోగతి లేకపోయినా ఏదో ఒకటి తేలుస్తారు. పెట్రోల్ కొనకుండా మనం బతకలేము. అమ్మ కుండా గల్ఫ్ దేశాలు బతక లేవు.

కాకపోతే అక్కడ జరిగిన నష్టానికి పైసాకు పైసా మన దగ్గర నుండి రాబడుతారు.

పెట్రోల్ ధరలు పెరిగే టప్పటికి ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతుంది.

మెంటల్ మహానుభావుడు ట్రంప్ ను గిచ్చి పెట్టింది.. ఇజ్రాయెల్ ఒక్కటే కాదని నా డౌట్ అనుమానం. ఎంతో కొంత మేర ఎలక్ట్రిక్ వెహికల్స్ లాబీ ఉంది.

35
లాక్ డౌనా? పిండా కూడా?
Image Credit : Getty

లాక్ డౌనా? పిండా కూడా?

కరోనా కాలంలో రెండుసార్లు లాక్ డైన్ వచ్చింది.

మీడియా/సొషల్ మీడియా మాత్రం యాభై సార్లు పెట్టేసింది.

ఇక జన్మలో లాక్ డౌన్ రాదు.

కాకపోతే పెట్రోల్ కు రేషన్ పెడుతారు. ఒక వాహనానికి నెలకు ఇంత అని.. అలాగే వంట గ్యాస్ కు కూడా ఒక ఇంటికి ఇంత అని.

అంతం కాదిది.. ఆరంభం..!

ప్రపంచవ్యాపితంగా కొన్నేళ్లకు డిజిటల్ డిక్టేటర్షిప్ వస్తుంది.

ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ వచ్చేసాయి .

గూగుల్ కారణంగా నువ్వు ఎక్కడికి పోయినా అన్నీ ట్రేస్ అవుట్ చెయ్యొచ్చు .

కొన్నేళ్లకు కృత్రిమ మేథ... నీ దినచర్యను ఇలా లిస్ట్ అవుట్ చేస్తుంది.

పొద్దునే అయిదింటికి నిద్ర లేచాడు. ఏడింటికి ఆఫీస్ కు బయలుదేరాడు. మొత్తం 20 కిలోమీటర్స్. ఇదిగో ఈ రూట్ లో.. 40 నిముషాలు. మధ్యాహ్నం లంచ్ ఇక్కడ్నుంచి ఫుడ్ ఆర్డర్ .. ఇలా

అంతేనా ?

ఎంత కొనాలి..? ఏమి కొనాలి..? ఇలా వచ్చేస్తాయి..

డిజిటల్ id లేకుండా ఏమీ కొనలేరు .. తిన లేరు .

నీ బతుకు మొత్తం ప్రభుత్వం చేతిలో.. కృతిమ మేథ చేతిలో ..

జనాలు ఇప్పటికే ఆలోచించడం మాని ... ప్రతి దాన్ని కృతిమ మేథను అడుగుతున్నారు.

ప్రస్తుతానికి అయితే ఉచితం .

45
మన బతుకులు ఏఐ చేతిలో..
Image Credit : Getty

మన బతుకులు ఏఐ చేతిలో..

హైదరాబాద్ లో మంచి స్కూల్స్ ఏవి ?అని గూగుల్ ని అడిగితే అది లిస్ట్ అవుట్ చేస్తుంది.

ఎలా ?

దానికి డబ్బిచ్చి ప్రమోట్ చేసుకొనే వారి పేర్లు మాత్రం చూపుతుంది.

ఇది ఇప్పటికే వుంది .

ఇక రాబొయ్యే రోజుల్లో కృతిమ మేథ కంపెనీకి డబ్బిచ్చి ప్రమోట్ చేసుకొంటేనే బిజినెస్.

లేకపోతే అవుట్.

ప్రతి బిజినెస్ లో వాడు పార్టనర్ అయిపోతాడు.. పైసా పెట్టుబడి లేకుండా..

మన బతుకు మన చేతుల్లో ఉండదు .

ఎవడో, ఎక్కడో కూర్చుని జనాల దినచర్యను ప్రోగ్రాం చేస్తాడు.

హాస్పిటల్స్ రంగంలో పెట్టుబడి పెట్టిన ఒక విదేశీ ఈక్విటీ కంపెనీ రాబొయ్యే సంవత్సరం భారత దేశంలో కాన్సర్, బిపి, షుగర్ ఇంత వేగంగా పెరగాలి అని ప్రోగ్రాం చేస్తుంది.

55
ఇక అంతా ఏఐ మయమే...
Image Credit : Getty

ఇక అంతా ఏఐ మయమే...

జనాలు ఎలా ఆలోచించాలి/ఏమి ఆలోచించాలి..?

ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి..?

ఏ సినిమా హిట్ కావాలి..?

ఎవరికి ఓటు వెయ్యాలి..?

ఇలా మొత్తం .. ఎక్కడో దూరాన డిసైడ్ అయిపోతుంది.

మైండ్ మేనేజ్మెంట్ అన్న మాట.

ఆడించేవాడెవ్వడో .. నువ్వు మాత్రం నిమిత్తమాతృడివి.

కృతిమ మేథ యుగంలో సహజ మేథ కనుమరుగవుతుంది .

ఈ పోస్ట్ రాసింది AI ..

అంటే అమర్నాథ్ ఇంటలిజెన్స్ .

{అంత వీజీ కాదు .. ఇంకో సారి చదవండి .. ఫుల్ క్లారిటీ కావాలంటే}

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
భారత దేశం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railways Free AC Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Recommended image2
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Recommended image3
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే
Related Stories
Recommended image1
Now Playing
Hyderabad Petrol:పెట్రోల్ బ్యాంకుల్లో నోస్టాక్ బోర్డులు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు| Asianet News Telugu
Recommended image2
Petrol: పెట్రోల్ సంక్షోభం రానుందా.? ఎందుకీ భారీ క్యూలు.? అస‌లు వాస్త‌వం ఏంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved