MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • National
  • వేడి పప్పుగిన్నెలో పడ్డ ఐదేళ్ల బాలిక.. తీవ్ర గాయాలు... మధ్యాహ్నభోజన పథకంలో అపశృతి...

వేడి పప్పుగిన్నెలో పడ్డ ఐదేళ్ల బాలిక.. తీవ్ర గాయాలు... మధ్యాహ్నభోజన పథకంలో అపశృతి...

మధ్యప్రదేశ్ లోని ఓ స్కూల్లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒకటో తరగతి విద్యార్థిని వేడి పప్పు గిన్నెలో పడింది.  తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Apr 11 2023, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.  పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అపశృతి చోటు చేసుకుంది. స్కూల్లో మధ్యాహ్న భోజనం వడ్డించే సమయంలో వేడి వేడి పప్పుతో నిండి ఉన్న పాత్రలో పడి ఐదేళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు అధికారులు మంగళవారం తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
जली दाल

जली दाल

సోమవారం బన్స్లాలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రోజువారీ మద్యాహ్న భోజనం వడ్డిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకటవ తరగతి విద్యార్థిని తేజేశ్వరి తాండియా ఆహారం తీసుకోవడానికి ఇతర పిల్లలతో కలిసి క్యూలో నిలబడింది. ఈ సమయంలో పిల్లలు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకి వెళ్లడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. ఆ హడావిడిలో వేడివేడి పప్పు ఉన్న పెద్ద గిన్నెకు దగ్గరగా నిలబడి ఉన్న ఐదేళ్ల బాలిక ఒక్కసారిగా అందులో పడిపోయింది.

35

ఇది గమనించిన సిబ్బంది వెంటనే చిన్నారిని అందులోనుంచి బైటికి తీసి ప్రాథమిక చికిత్స అందించేందుకు సమీపంలోని భానుప్రతాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయాలు తీవ్రంగా ఉన్నాయని అక్కడినుంచి చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరంపై 30 శాతం కాలిన గాయాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

45

మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం, మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులు వరుసగా కూర్చోవాలి. సిబ్బంది వారికి ఒక్కో ఆహారపదార్థాన్ని వడ్డించాలి. అలా కాకుండా చిన్నారులే లైన్లో రావాలనే సరికి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు.

55

భానుప్రతాపూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ పాఠశాల అధికారుల నిర్లక్ష్యంపై దర్యాప్తు చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. “సంబంధిత ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకుంటున్నాం. వారికి షోకాజ్ నోటీసు జారీ చేయబడ్డాయి. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం' అని ఆయన తెలిపారు.

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railways Free AC Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Recommended image2
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Recommended image3
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved