- Home
- National
- ఓ భారతీయుడి 'డాంకీ రూట్' కథ: విద్యుత్ షాక్‌లు, మూత్రంతో స్నానం, 182 రోజుల పాటు ఏజెంట్లు-మాఫియాల హింస
ఓ భారతీయుడి 'డాంకీ రూట్' కథ: విద్యుత్ షాక్‌లు, మూత్రంతో స్నానం, 182 రోజుల పాటు ఏజెంట్లు-మాఫియాల హింస
Donkey Route Victim Story: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలోకి అక్రమంగా వెళ్లినవారిని తిరిగి వెనక్కిపంపుతున్నారు. అయితే, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని డంకీ రూట్ లో సాగించిన ప్రయాణాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. హర్యానాలోని కురుక్షేత్ర నివాసి ఖుష్‌ప్రీత్ డాంకీ రూట్ కథ ఇది..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Donkey Route Victim Story: ఫస్ట్ అమెరికా నినాదంతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అక్రమంగా నివాసం వుంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ దేశం నుంచి బయటకు పంపుతున్నారు. అయితే, అక్రమంగా అమెరికాకు వెళ్లిన వారి డాంకీ రూట్ కథలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇటీవల అమెరికా తిరిగి పంపిన వారిలో హర్యానాలోని కురుక్షేత్ర నివాసి ఖుష్‌ప్రీత్ ఒకరు. ఆయన డాంకీ రూట్ కథ నిజంగా కన్నీళ్లు పెట్టిస్తోంది..
"దట్టమైన చీకటి అడవులు, విశాలమైన సముద్రాలు, దారుణమైన హింస. 182 రోజుల తర్వాత, నేను బ్రతికి బయటపడ్డాను.. దానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పడం ఖుష్ ప్రీత్ వెళ్లిన డాంకీ రూట్ ఎంత భయంకరమైందో" తెలియజేస్తుంది. హర్యానాలోని కురుక్షేత్ర నివాసి అయిన ఖుష్‌ప్రీత్.. తన కథను చెబుతూ బోరున విలపించారు. అమెరికాకు అక్రమంగా వెళ్లే డాంకీ రూట్ లో ఏజెంట్లు తన డబ్బును ఎలా దోచుకున్నారో.. తమ నమ్మకాన్ని ఎలా వమ్ము చేశారో ఆయన చెప్పారు. డాలర్ ఆశలతో ఉన్న తమను మాఫియాకు అప్పగించడంతో వాళ్లు తమ జీవితాలతో ఎలా ఆడుకున్నారో చెప్పారు.
america deportation
డాలర్ ఆశలతో అమెరికా పయనం !
ఖుస్ ప్రీత్ తన గురించి చెబుతూ.. "అమెరికా వెళ్లి చాలా డబ్బు సంపాదించాలనేది నా కల. దాని తర్వాత నా కలలను, నా కుటుంబ కలలను నెరవేర్చుకోగలను. దాంతోనే నును అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఏజెంట్ నాకు ఖర్చు రూ. 45 లక్షలు అవుతుందని చెప్పాడు. నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ విషయం ఇంట్లో చెప్పాను. నా కలలను నిజం చేసుకోవడానికి, మా కుటుంబం పొలం, ఇల్లు, ఉన్న పశు సంపదను అమ్మడంతో పాటు అప్పులు కూడా చేసింది. తరువాత వాళ్ళు నన్ను అమెరికాకు పంపించారు. అయితే, ఆ తర్వాత జరిగిన విషయాలు నా కలలో కూడా ఊహించలేదని" చెప్పాడు.
అమెరికాకు నన్ను తన ఏజెండ్ డాంకీ రూట్ గుండా తీసుకెళ్లాడని చెప్పారు. "నాకు గాడిద రూట్ అంటే ఏమిటో తెలియదు. ఏజెంట్ చెప్పినట్లుగానే నేను చేస్తూనే ఉన్నాను. అమెరికా చేరుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది. అక్కడికి చేరుకున్న తర్వాత, అమెరికన్ పోలీసులు నన్ను అరెస్టు చేశారు. దీంతో అక్కడ నేను 12 రోజులు మాత్రమే ఉన్నాను, తరువాత నన్ను దేశం నుండి బహిష్కరించారు. కానీ 182 రోజులు నేను అనుభవించిన హింసను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏజెంట్ల ఉచ్చులో పడి విదేశాలకు వెళ్లవద్దని ప్రతి యువతను నేను అభ్యర్థిస్తున్నాను. అది మీ ప్రాణాలకు కూడా ముప్పు కలిగించవచ్చు. నేను సజీవంగా తిరిగి వచ్చాను, ఇది నాకు ఒక అద్భుతం కంటే తక్కువ కాదని" చెప్పాడు.
డాంకీ రూట్ ఎందుకు భయంకరమైంది?
"నేను ఆరు నెలల్లో దట్టమైన చీకటి అడవులు, పర్వతాలు, విశాలమైన మహాసముద్రాల గుండా చిన్న పడవలలో ప్రయాణించి అమెరికా చేరుకున్నాను. ఈ సమయంలో, ఏజెంట్ మనుషులు నాకు దారిలో విద్యుత్ షాక్ ఇచ్చి, మూత్రంతో స్నానం చేయించారు. నాకు చాలా రోజుల వరకు తినడానికి ఏమీ పెట్టలేదు. చాలా రోజులు ఆకలితో ఉంచారు. నేను చాలా రోజులు అడవుల్లో నడిచాను. నేను అమెరికా చేరుకున్నప్పుడు, నేను 12 రోజులు మాత్రమే ఉండగలిగాను. అక్కడి నుండి ఒక తీవ్రమైన నేరస్థుడిలా చేతులు, కాళ్ళు గొలుసులతో కట్టి ఇంటికి పంపారు. అదృష్టవశాత్తూ నేను ప్రాణాలతో బయటపడ్డాను" అని ఖుస్ ప్రీత్ చెప్పారు.
మాఫియా విద్యుత్ షాక్.. ఏజెంట్ ఫోన్ ఎత్తడు.. ఏం జరుగుందో తెలీదు !
ఖుస్ ప్రీత్ తన డాంకీ రూట్ ప్రయాణం గురించి మరింత చెబుతూ.. కొన్నిసార్లు తనను అడవి గుండా, కొన్నిసార్లు సముద్ర మార్గం గుండా ముందుకు పంపారని చెప్పారు. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో యువకులు, ఇతరులు అక్కడ ఉన్నారు. ముందుకు నడవలేక పడిపోతే అలాగే వదిలేసేవారు. ఏజెంట్ మనుషులు అతన్ని వదిలి వెళ్లిపోతారు. మేము ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ తాగేవాళ్ళం. అతను తన దగ్గర ఏది ఉంటే అది తినేవాడు. ఏజెంట్లు డబ్బును మాఫియాకు ఇవ్వలేదు. దీంతో వారు మాకు విద్యుత్ షాక్‌లు ఇచ్చేవారు. ఏజెంట్లు ఫోన్ ఎత్తరు.. మాఫియా డబ్బు డిమాండ్ చేసేది.. ఏం జరుగుతుందో తెలిసేది కాదు" అని చెప్పాడు.
ఏజెంట్లపై పోలీసుల చర్యలు
హర్యానా నుండి యువకులను డాంకీ రూట్ గుండా పంపిన ఏజెంట్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోబోతున్నారని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇలాంటి కేసుల కోసం, రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పడిన సిట్ అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖ రాసింది. అటువంటి ఏజెంట్ల జాబితాను తయారు చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్టు చేయాలని చెప్పింది. ఈ క్రమంలోనే కురుక్షేత్రలో అమెరికా నుండి తిరిగి వచ్చిన 14 మంది ఫిర్యాదులను గురువారం తీసుకున్నారు.
సిట్ చీఫ్ సిబాస్ కవిరాజ్ రాసిన లేఖ ప్రకారం, యువత తిరిగి వచ్చిన జిల్లాల్లో, స్థానిక పోలీసులు స్వయంగా యువకుల ఇళ్లకు వెళ్లి వారి ఫిర్యాదులను తీసుకుంటారు. దీని తరువాత, వారిని పంపిన ట్రావెల్ ఏజెంట్లందరిపై కుట్ర కింద మోసంతో సహా వివిధ సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. డాంకీ రూట్ నుండి వచ్చే యువకుల సంఖ్య పెరిగేకొద్దీ, వారి పేర్లు కూడా పోలీసు రికార్డులలో చేర్చనున్నారు.
ట్రావెల్ ఏజెన్సీలపై దర్యాప్తు
అన్ని జిల్లాల్లో ట్రావెల్ ఏజెన్సీల రిజిస్ట్రేషన్‌ను కూడా తనిఖీ చేస్తారు. ట్రావెల్ ఏజెన్సీల ఉద్యోగుల రికార్డులు, ఏజెన్సీల పనితీరు, వాటి ద్వారా విదేశాలకు ప్రయాణించే కొంతమంది వ్యక్తుల రికార్డులను పోలీసులు పరిశీలిస్తారు. వారితో ఈ విషయాలపై మాట్లాడతారు. ఏదైనా అవకతవకలు జరిగితే ట్రావెల్ ఏజెన్సీలు, ఏజెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.