MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ చేతిలో ప‌ట్టుకున్న వ‌స్తువు స్పెష‌ల్ ఏంటో తెలుసా?

అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ చేతిలో ప‌ట్టుకున్న వ‌స్తువు స్పెష‌ల్ ఏంటో తెలుసా?

Nita Ambani - raman divo  : ఆసియా అప‌ర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చంట్ ల వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు దేశ‌విదేశాల నుంచి చాలా మంది ప్ర‌ముఖులు వ‌చ్చారు.   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jul 14 2024, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Nita Ambani - raman divo : ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడు, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్  అంబానీ, రాధికా మ‌ర్చంట్ ల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ డికేడ్ లో అత్యంత ఖ‌రీదైన వివాహంగా రికార్డు సృష్టించింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు అనేక మంది ప్ర‌పంచ ప్ర‌ముఖులు విచ్చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ వివాహ వేడుకలో అంబానీ కుటుంబం మొత్తం సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. ముఖ్యంగా 60 ఏళ్ల వయసులోనూ నేటిత‌రం అమ్మాయిలో పోటీగా అందంతో మెరిసింది నీతా అంబానీ.

37

అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చంట్ ల వివాహంలో నీతా అంబానీ ఒక వ‌స్తువును ప‌ట్టుకుని క‌న‌పించారు. ఈ వివాహం పూర్తి అయ్యే వ‌ర‌కు ఆమె చేతిలో ఇది క‌నిపించింది. నీతా అంబానీ చేతిలోని ఈ విచిత్ర‌మైన వ‌స్తువుకు వినాయకుడి బొమ్మను చోడించి ఉంది. అలాగే, విగ్ర‌హం ముందు దీపం కూడా ఉంది. 

47

ముఖేష్ అంబానీ తన కొడుకు ఆనంత్ అంబానీని మ్యారేజ్ హాల్‌కు తీసుకువస్తున్న స‌మ‌యంలో నీతా అంబానీ తన చేతిలో ఈ ప్ర‌త్యేక‌మైన వస్తువును పట్టుకుని అంద‌రికంటే ముందుకు న‌డుస్తు క‌నిపించారు. 

57

దీంతో నీతా అంబానీ ప‌ట్టుకున్న వ‌స్తువు ఏమిటీ? ఎందుకు వివాహం పూర్తి అయ్యేవ‌ర‌కు ప‌ట్టుకున్నారు?  ఆ వస్తువుకున్న ప్ర‌త్యేక‌త ఏమిటీ? అనే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి. 

67

నీతా అంబానీ తన కొడుకు చేయి పట్టుకుని పెళ్లి జ‌రిపించ‌డం గుజరాతీ పెళ్లిళ్లలో కనిపించే సంప్రదాయం. అలాగే, వినాయకుడి ప్ర‌తిమ‌, ముందు దీపంతో కూడిన ఇలాంటి ప్ర‌త్యేక‌మైన వ‌స్తువును ప‌ట్టుకుని పెళ్లిళ్లు చేయ‌డం గుజరాతీ ప్రజలు శుభప్రదంగా భావిస్తారు. దీనిని 'రామన్ డివో' అంటారు. 

 

77

ఇది కొత్త జీవితాన్ని ప్రారంభించే జంటలను ఆశీర్వదించి, చీకటిని తొలగించి, వారి జీవితాలను కొత్త కాంతితో నింపుతుందని నమ్ముతారు. సాంప్రదాయ గుజరాతీ వివాహాలలో ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే నీతా అంబానీ త‌న కుమారుడి పెళ్లిలో చాలా స‌మ‌యం చేతిలో పట్టుకుని క‌నిపించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved