MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • National
  • Thalapathy vijay: DMK రూ.5వేల కోట్లు.. AIADMK రూ.5వేల కోట్లు.. మరి విజయ్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా?

Thalapathy vijay: DMK రూ.5వేల కోట్లు.. AIADMK రూ.5వేల కోట్లు.. మరి విజయ్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా?

Thalapathy vijay:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ దూసుకుపోతున్నాడు. అన్ని పార్టీల కంటే విజయ్ కే ఎక్కువ సీట్లు వచ్చేలా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఎన్నికల కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 04 2026, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Tamilnadu Election Results
Image Credit : Chat GPT

Tamilnadu Election Results

ఎన్నికల్లో గెలవాలి అంటే రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాలి అనే భావన ప్రజల్లో బాగా ఇమిడిపోయింది. ఎవరు ఎక్కువ పంచితే.. వారే గెలుస్తారు అనే నమ్మకం కూడా ఉంది. అందుకే.. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి అనగానే.. అందరు రాజకీయ నాయకులు అలర్ట్ అయిపోతారు. డబ్బులు సమకూర్చుకొని ముందు నుంచే ప్లాన్ ప్రకారం ఖర్చు పెడతారు. వారి ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి.. ఓటుకు ఇంత అంటూ లెక్క కట్టి మరీ డబ్బులు పంచిపెడతారు. చాలా మంది ప్రజలు కూడా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకే ఓటు వేయాలి అనే భావనతో కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో.. తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది..? ముఖ్యంగా టాప్ లో దూసుకుపోతున్న విజయ్ ఎన్నికల్లో ఓటర్లకు పంచిపెట్టడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనే విషయం ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏ పార్టీ ఎన్ని కోట్లు..?
Image Credit : ChatGPT

ఏ పార్టీ ఎన్ని కోట్లు..?

విశ్వసనీయ సమాచారం ప్రకారం, తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అంతేకాదు.. అన్నాడీఎంకే కూడా దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటర్ కీ.. ఒక్కొక్కరికి రూ. వెయ్యి పంచిపెట్టినట్లు సమాచారం. మరి.. టాప్ లో దూసుకువెళ్తున్న విజయ్ సంగతి ఏంటి అంటే..? ఆయన ఓటర్లకు రూపాయి ఖర్చు కూడా పెట్టలేదంట. అవును.. ఇతర రెండు పార్టీలు పంచి పెట్టిన డబ్బులు తీసుకొని.. విజయ్ కి ఎక్కువ మంది ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. విజయ్ కేవలం తన ప్రచారానికి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టారని, ఓట్లు పంచడానికి కాదు అని సమాచారం.

Related Articles

Related image1
Allu Arjun: పబ్లిక్ గా అల్లు అర్జున్ పరువు తీసేసిన తమ్ముడు శిరీష్..!
Related image2
Vijay- Trisha: గెలుపు విజయ్ దే.. ఫ్యాన్ కామెంట్ కి.. త్రిష రియాక్షన్ ఇదే...!
33
 విజయ్ కి ఎవరి ఓట్లు ఎక్కువ పడ్డాయి..?
Image Credit : Asianet News

విజయ్ కి ఎవరి ఓట్లు ఎక్కువ పడ్డాయి..?

విజయ్ కి హీరోగా సహజంగానే క్రేజ్ ఉంది. ముఖ్యంగా యువతలో ఈ క్రేజ్ చాలా ఎక్కువ. ఈ క్రేజే ఓట్లుగా మారినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, క్రిస్టియన్స్, దళితులు కూడా ఎక్కువగా విజయ్ కి ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ వర్గాల్లో ఎక్కువ క్రేజ్ ఉండటం కారణంగానే విజయ్ ఫలితాల్లో దూసుకుపోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

క్లీన్ పాలిటిక్స్ ఇమేజ్..?

విజయ్ గురించి మరో ఆసక్తికరమైన కోణం.. నెట్టింట వైరల్ గా మారింది.అంటే క్లీన్ పాలిటిక్స్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంటే.. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్నా.. ఎన్నికల్లో గెలవాలన్నా.. డబ్బులు పంచాల్సిన అవసరం లేదు అనే సందేశాన్ని ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారంటూ కొందరు విశ్లేషకులు భావిస్తారు. అంతేకాకుండా.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, దొంగ ఓట్లు లేకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా విజయ్ కి కలిసొచ్చినట్లు తెలుస్తోంది.

డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు భారీ ఖర్చులు చేస్తున్నాయనే ప్రచారం మధ్య, విజయ్ డబ్బు కాకుండా ప్రజల నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాడనే కథనం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
టీవీకే విజయ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్
Recommended image2
ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
Related Stories
Recommended image1
Allu Arjun: పబ్లిక్ గా అల్లు అర్జున్ పరువు తీసేసిన తమ్ముడు శిరీష్..!
Recommended image2
Vijay- Trisha: గెలుపు విజయ్ దే.. ఫ్యాన్ కామెంట్ కి.. త్రిష రియాక్షన్ ఇదే...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved