MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • నా జీవితంలో ఇంత పెద్ద పేలుడు శబ్దం ఎప్పుడూ వినలేదు.. ఢిల్లీ పేలుడు పై ప్రత్యక్ష సాక్షులు

నా జీవితంలో ఇంత పెద్ద పేలుడు శబ్దం ఎప్పుడూ వినలేదు.. ఢిల్లీ పేలుడు పై ప్రత్యక్ష సాక్షులు

Delhi Blast : దేశ రాజధాని ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ సమీపంలో భారీ పేలుడు జరిగింది. పేలుడులో 9 మంది మృతి చెందగా, 30 మంది వరకు గాయపడ్డారు. పేలుడు దాటికి ప్రాణాలు కోల్పోయిన వారి బాడీలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 10 2025, 09:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
భూమి కంపించింది, చనిపోతామనుకున్నాం : పేలుడు పై స్థానికుడు
Image Credit : stockPhoto

భూమి కంపించింది, చనిపోతామనుకున్నాం : పేలుడు పై స్థానికుడు

సోమవారం సాయంత్రం ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. Gate No.1 వద్ద పార్క్ చేసిన కారులో ఈ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. మంటలు వ్యాపించి చుట్టుపక్కల నిలిపి ఉంచిన కార్లు కూడా దగ్ధమయ్యాయి. ఈ బ్లాస్ట్ కారణంగా 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (LNJP) ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం ఢిల్లీ మొత్తం హై అలెర్ట్‌లోకి వెళ్లింది.

ఒక స్థానిక దుకాణదారుడు ANI వార్తా సంస్థతో మాట్లాడుతూ.. భారీ పేలుడు శబ్దంతో తాను షాక్ అయ్యానని తెలిపాడు. “నా జీవితంలో ఇంత పెద్ద పేలుడు శబ్దం ఎప్పుడూ వినలేదు. నేను షాప్‌లో కూర్చున్నాను, కానీ ఆ తాకిడికి మూడుసార్లు కిందపడిపోయాను. భూమి బద్దలైపోతుందేమో అనిపించింది. ఇంకో పేలుడు జరిగితే మేమందరం చనిపోతామనుకున్నాం” అని ఆ దుకాణదారుడు తెలిపాడు.

పక్కనే నివసించే రాజధర్ పాండే కూడా తీవ్ర భయంతో ఆ క్షణాలను గుర్తుచేసుకున్నారు. “కిటికీలు షేక్ అయ్యాయి. మంటలు ఇంటి కిటికీ నుండి కనిపించాయి. వెంటనే కిందకు వచ్చి ఏమైందో చూశాను” అని ఆయన తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
22
రోడ్డుపై చేయి కనిపించి షాక్ అయ్యాం : ప్రత్యక్ష సాక్షులు
Image Credit : Asianet News

రోడ్డుపై చేయి కనిపించి షాక్ అయ్యాం : ప్రత్యక్ష సాక్షులు

మరొక ప్రత్యక్ష సాక్షి పేలుడు తర్వాత కనిపించిన దృశ్యాల గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. “మొదట పేలుడు ప్రాంతం దగ్గరికి వెళ్లి చూశాం. అక్కడ ఒక చేతి భాగం రోడ్డుపై పడిఉంది. అది చూసి పూర్తిగా షాక్ అయ్యాం. వెంటనే SHOకి సమాచారం ఇచ్చాం” అని చెప్పారు.

పేలుడు తీవ్రతకు పరిసర ప్రాంతాల్లోని గోడలు, తలుపులు, కిటికీలు కంపించాయి. భయంతో ప్రజలు రోడ్డుపైకి పరుగులు తీశారు. కొంతమంది పిల్లలు, వృద్ధులు కింద పడిపోయారని సాక్షులు తెలిపారు.

పోలీసు, అగ్నిమాపక సిబ్బంది చర్యలు

పేలుడు చోటుచేసుకున్న వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చి దగ్ధమైన కార్లను పక్కకు తరలించారు. పేలుడు కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, అధికారులు ఫోరెన్సిక్ పరిశోధనలు ప్రారంభించారు.

ఢిల్లీ పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాంతం మొత్తాన్ని సెక్యూరిటీ కార్డన్ చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కూడా పరిశీలనలో పాల్గొంటున్నాయి.

చారిత్రక ప్రదేశం సమీపంలో భద్రతా ఆందోళన

ఈ ఘటనా ప్రాంతం ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన రెడ్ ఫోర్ట్, జామా మసీదు సమీపంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భద్రతా వ్యవస్థలు మరింత కట్టుదిట్టం చేశారు. మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద జరిగిన ఈ పేలుడు తర్వాత మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇప్పటి వరకు లభించిన వివరాల ప్రకారం, పేలుడు ఉద్దేశ్యపూర్వకమా లేదా ప్రమాదవశాత్తుగా జరిగిందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు తదుపరి దర్యాప్తు ఫలితాలు వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related Articles

Related image1
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బ్లాస్ట్.. 10 మందికి పైగా మృతి, దేశమంతా హై అలర్ట్
Related image2
ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడు

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే
Recommended image2
Now Playing
Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Recommended image3
Now Playing
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బ్లాస్ట్.. 10 మందికి పైగా మృతి, దేశమంతా హై అలర్ట్
Recommended image2
ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved