MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బ్లాస్ట్.. 10 మందికి పైగా మృతి, దేశమంతా హై అలర్ట్

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బ్లాస్ట్.. 10 మందికి పైగా మృతి, దేశమంతా హై అలర్ట్

Delhi Red Fort car blast: ఢిల్లీలో ఎర్రకోట మెట్రో గేట్ నం.1 వద్ద కారులో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో పది మందికిపైగా మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దర్యాప్తు కోసం NIA బృందం రంగంలోకి దిగింది.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Nov 10 2025, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఢిల్లీలో భారీ పేలుడు.. హై అలర్ట్
Image Credit : X@@1SanatanSatya

ఢిల్లీలో భారీ పేలుడు.. హై అలర్ట్

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని లాల్‌కిల్లా మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద సోమవారం సాయంత్రం భారీ కారు పేలుడు జరిగింది. ఈ ఘటనలో పది మందికిపైగా మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో ఆ ప్రాంతంలో భారీ జనసంచారం ఉండటంతో పానిక్ పరిస్థితులు నెలకొన్నాయి.

తగలబడిన కార్లు

ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం, సాయంత్రం సుమారు 6:55 గంటల సమయంలో పేలుడు జరిగినట్లు కాల్ వచ్చింది. వెంటనే ఏడు ఫైర్ టెండర్లు, 15 CAT అంబులెన్స్ వాహనాలు ఘటనాస్థలికి చేరాయి. ఆ కారు పూర్తిగా దగ్ధమవగా, దాని సమీపంలోని మూడు నుండి నాలుగు వాహనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి.

పేలుడు తీవ్రత కారణంగా సమీప వాహనాల అద్దాలు పగిలిపోయాయి, లైట్లు ఆగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గాయపడినవారిని LNJP ఆసుపత్రికి తరలింపు
Image Credit : ANI

గాయపడినవారిని LNJP ఆసుపత్రికి తరలింపు

పేలుడులో గాయపడిన పలువురిని లోక్‌నాయక్ జయప్రకాశ్ (LNJP) ఆసుపత్రికి తరలించారు. మీడియా నివేదికల ప్రకారం, ఆసుపత్రికి చేరేలోపే 9 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ప్రస్తుతం పలువురు బాధితులు చికిత్స పొందుతున్నారు.

పేలుడు తీవ్రత కారణంగా మృతదేహాల గుర్తింపు కూడా కష్టంగా మారినట్లు వైద్యులు తెలిపారు.

Related Articles

Related image1
ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడు
Related image2
తుపాను విధ్వంసం.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.6,384 కోట్ల నష్టం
35
దర్యాప్తు ప్రారంభం.. ఘటనాస్థలిలో NIA బృందం
Image Credit : our own

దర్యాప్తు ప్రారంభం.. ఘటనాస్థలిలో NIA బృందం

ఘటన జరిగిన వెంటనే ఢిల్లీ పోలీస్ ప్రత్యేక శాఖ, ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అక్కడికి చేరుకున్నారు. ఎన్ఐఏ (National Investigation Agency) బృందం కూడా దర్యాప్తు చేపట్టేందుకు ఘటనాస్థలికి చేరింది. పేలుడు కారణం ఇంకా నిర్ధారించలేదు.

ఢిల్లీ పోలీస్ అధికారి మాట్లాడుతూ, “ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడు కారణం, వాహనాల దగ్దం, బాంబు పదార్థాల స్వభావం గురించి విశ్లేషణ జరుగుతోంది” అని తెలిపారు.

45
ఢిల్లీ నగరమంతా హై అలర్ట్
Image Credit : Asianet News

ఢిల్లీ నగరమంతా హై అలర్ట్

ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ నగరమంతా హై అలర్ట్ ప్రకటించారు. పోలీసు పహారా, మెట్రో, రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్ ఇలా దేశమంతా హై అలెర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలను ముమ్మరం చేశారు.

గత రెండు రోజుల క్రితం ఫరీదాబాద్‌లో 360 కిలోల పేలుడు పదార్థాలతో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పేలుడుతో దేశ భద్రతా వ్యవస్థపై మరింత ఆందోళన కలిగిస్తోంది. ముంబై, గురుగ్రామ్, నోయిడా నగరాల్లో కూడా పోలీసు పహారా కఠినతరం చేశారు.

55
ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?
Image Credit : stockPhoto

ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?

ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఒక స్థానికుడు మాట్లాడుతూ, “మేము రోడ్డుపై నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా భయంకరమైన శబ్దం వినిపించింది. ఒకరి చెయ్యి రోడ్డుపై పడింది. ఆ దృశ్యంతో చాలా భయమేసింది” అని తెలిపారు.

ఘటన స్థలంలో ధ్వంసమైన వాహన అవశేషాలు, పగిలిన గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయని అధికారులు చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
పోలీసు భద్రత

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Related Stories
Recommended image1
ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడు
Recommended image2
తుపాను విధ్వంసం.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.6,384 కోట్ల నష్టం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved