డిల్లీ పేలుడు బాధితుల లిస్ట్ ఇదే...
Delhi Blast : దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకున్న బాంబు పేలుడులో కొంతమంది ప్రాణాలు కోల్పోగా చాలామంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. బాధితుల వివరాలిలా ఉన్నాయి…

డిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు
Delhi Blast : దేశ రాజధాని డిల్లీలో సోమవారం సాయంత్రం అలజడి రేగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు చోటుచేసుకోవడంతో అమాయక ప్రజలు బలయ్యారు... మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్స్ పాలయ్యారు.
ఓ ఐ20 కారు మెట్రో స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది... దీంతో దాన్ని చుట్టున్న వాహనాలు ఎగిరిపడ్డాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు వెనక ఉగ్రవాద కుట్రలు దాగివున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, ఇతర కేంద్ర బృందాలు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశాయి.
డిల్లీ బాంబు పేలుళ్లలో మరణించినవారు, గాయపడినవారి వివరాలు తెలియక చాలామంది కంగారుపడుతున్నారు. తమవారికి ఏమయ్యిందో తెలియడంలేదని వాపోతున్నారు. ఈ క్రమంలో ఈ బాబు పేలుడు ఘటన బాధితుల వివరాలిలా ఉన్నాయి.
డిల్లీ పేలుడులో గాయపడినవారి వివరాలు
1. షైన పర్వీన్ ( మహమ్మద్ సైఫుల్లా కూతురు), ఖ్వాబ్ బస్తీ, మిర్ఫ్ రోడ్, షకుర్ కి దుండి, ఢిల్లీ
2. హర్షుల్ (సంజీవ్ సేథి కుమారుడు), గదర్‌పూర్, ఉత్తరాఖండ్
3. శివ జైస్వాల్, డియోరియా, ఉత్తరప్రదేశ్
4. సమీర్, మండవాలి, ఢిల్లీ
5. జోగిందర్, నంద్ నగరి, దిల్షాద్ గార్డెన్, ఢిల్లీ
6. భవానీ శంకర్ సహర్మ, సంగం విహార్, ఢిల్లీ
7. గీత (శివ ప్రసాద్ కుమార్తె), కృష్ణ విహార్, ఢిల్లీ
8. వినయ్ పాఠక్ (రామ్‌కాంత్ పాఠక్ కుమారుడు), అయా నగర్, ఢిల్లీ
9. పప్పు (దుద్వీ రామ్ కుమారుడు), ఆగ్రా, ఉత్తరప్రదేశ్
10. వినోద్ (విశాల్ సింగ్ కుమారుడు), బాట్జిత్ నగర్, ఢిల్లీ
11. శివం ఝా (సంతోష్ ఝా కుమారుడు), ఉస్మాన్‌పూర్, ఢిల్లీ
12. అమన్ (వివరాలు తెలియవు)
13. మహ్మద్ షానవాజ్ (అహ్మద్ జమాన్ కుమారుడు), దర్యాగంజ్, ఢిల్లీ
14. అంకుష్ శర్మ (సుధీర్ శర్మ కుమారుడు), ఈస్ట్ రోహ్తాష్ నగర్, షాహదారా
15. మహ్మద్ ఫరూక్ (అబ్దుల్ ఖాదిర్ కుమారుడు), దర్యాగంజ్, ఢిల్లీ
16. తిలక్ రాజ్ (కిషన్ చంద్ కుమారుడు), రోహంపూర్, హిమాచల్ ప్రదేశ్
17. మహ్మద్ సఫ్వాన్ (మహమ్మద్ ఘుఫ్రాన్ కుమారుడు), సీతా రామ్ బజార్, ఢిల్లీ
18. మహ్మద్ దావూద్ (జానుద్దీన్ కుమారుడు), అశోక్ విహార్, ఘజియాబాద్
19. కిషోరి లాల్ (మోహన్ లాల్ కుమారుడు), యమునా బజార్, కాశ్మీరీ గేట్, ఢిల్లీ
20. ఆజాద్, (రసూలుద్దీన్ కుమారుడు), 5వ పుష్ట, కర్తార్ నగర్, ఢిల్లీ
డిల్లీ పేలుడులో మృతుల వివరాలు
డిల్లీ బాంబు పేలుళ్లలో మరణించినవారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహాకు చెందిన అశోక్ కుమార్ మరణించినట్లు తెలుస్తోంది. మిగతా మృతులను గుర్తించే పనిలో ఉన్నామని... వారి వివరాలు తెలియగానే వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.
డిల్లీ పేలుడు ఎలా జరిగిందంటే...
దేశ రాజధాని డిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతం రెడ్ ఫోర్ట్ ఏరియా. ఇక్కడికి నిత్యం వివిధ పనులను వచ్చేవారితో పాటు పర్యాటకులు కూడా ఎక్కువగా ఉంటారు. ఇలాంటి ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ ఐ20 కారు ఆగింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ కారుతో పాటే చాలా వాహనాలు ఆగాయి... ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
భారీ తీవ్రతతో పేలుడు జరగడంతో కారుతో పాటు చుట్టూ ఉన్న వాహనాలు ఎగిరిపడ్డాయి… మంటలు ఎగిసిపడ్డాయి. ఈ పేలుడు జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోని పోలీస్ పోస్ట్, చుట్టుపక్కల షాపులు దెబ్బతిన్నాయంటేనే ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పేలుడు ధాటికి కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
డిల్లీ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్
దేశ రాజధాని డిల్లీలో బాంబు పేలుడు నేపథ్యంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలను అలర్ట్ చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో పోలీసులు, ఇతర భద్రతా దళాలు అప్రమత్తం అయ్యారు. అనుమానాస్పద వ్యక్తులు, కదలికలు, వాహనాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు.
ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ (మంగళవారం) రెండో దశ పోలింగ్ జరుగుతోంది... ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ సిటీ బెంగళూరులో కూడా భద్రతను పెంచారు. ఇలా దేశంలోని అన్ని నగరాల్లో సెక్యూరిటీని పెంచారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దు... అప్రమత్తంగా ఉంటే చాలని పోలీసులు సూచిస్తున్నారు.